బిగ్ బాస్ నటుడిని వేధించిన అమ్మాయి.. చివరకు పోలీస్ కేసు పెట్టి..
బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు బిగ్ బాస్ సోహైల్. ఈయన హీరోగా వెండితెరపైన, సీరియల్స్ లో నటించి తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరయ్యాడు. మరోవైపు ఆయన సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. అలాగే తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షోతో మరింతగా పాపులర్ అయ్యారు. దాంతో వెండితెరపైన కూడా వరుస సినిమాలతో అలరిస్తూ వస్తున్నాడు. అయితే బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత సోహైల్ ఒక అమ్మాయి నుంచి ఇబ్బంది కలిగింది. ఆమె హద్దులు దాటి ప్రవర్తించడంతో సోహైల్ తగిన గుణపాఠం చెప్పానని చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..
కొత్త బంగారు లోకం నుంచి..
హీరోగా వెండితెరపై అలరించేందుకు సోహైల్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2008 నుంచి బిగ్ స్క్రీన్ పై అలరిస్తూ వస్తున్నాడు. తనకు వచ్చిన చిన్న చిన్న రోల్స్ ను సరిగా వినియోగించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల పాటు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ వచ్చారు. తొలుత కొత్త బంగారు లోకంతో వెండితెరపై మెరిశారు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అంతకు ముందు ఆ తర్వాత, వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత నేరుగా తనే హీరోగా లాంచ్ అయ్యారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

బిగ్ బాస్ తర్వాత అమ్మాయితో తలనొప్పి..
నటుడు సోహైల్ బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన తర్వాత మరింతగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా బుల్లితెర ప్రేక్షకులను మరింతగా అలరించారు. అయితే హౌజ్ నుంచి వచ్చిన తర్వాత లక్కీ భాస్కర్ సినిమా చేశారంట. ఆ సినిమా రిలీజ్ సమయంలో తన నెంబర్ ను గత ఇంటర్వ్యూలో బయట పెట్టారని సోహైల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో ఒక అమ్మాయి తన నెంబర్ తీసుకొని తరుచుగా ఫోన్ చేస్తూ విసిగించిందని చెప్పారు.
అంతే కాకుండా ఆమె తరుచూగా సోహైల్ ఎక్కడ ఉంటే అక్కడి వచ్చి కలుస్తూ ఉండేదని చెప్పారు. అక్కడితో ఆగకుండా తనకు దగ్గర కావడం కోసమని ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యిందని తెలిపాడు. అంతే కాకుండా సోహైల్ ను ముద్దులు, కిస్సులు అడిగుతూ చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాడు. ప్రతి రోజూ ఆమెతో టార్చర్ అనుభవించలేక పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. దాంతో ఆమె నుంచి విముక్తి కలిగిందన్నారు. ఇక అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఇబ్బందులు ఉంటాయని వివరించే ప్రయత్నించారు. అందరి అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యమని అన్నారు.
సోహైల్ చిత్రాలు..
సోహైల్ 2013లో మ్యూజిక్ మ్యాజిక్ అనే చిత్రంతో హీరోగా లాంచ్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత డీ ఫర్ దోపిడీ, ది బెల్స్, సిని మహాల్, యురేక, లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, చివరిగా బూట్ కట్ బాల్రాజు చిత్రంలో నటించి మెప్పించారు. కానీ సోహైల్ కు సాలిడ్ హిట్ పడాల్సి ఉంది. నెక్ట్స్ కర్మన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.


Click it and Unblock the Notifications











