బిగ్ బాస్ సోనియా, యష్‌ల పెళ్లి వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా ? రియల్లీ గ్రేట్ కదా..

బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల ఇటీవల యష్‌ ని వివాహం చేసుకుంది. అయితే. యష్‌కి అంతకుముందే పెళ్లి అయ్యింది.ఆయన తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చారు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అయినా.. సోనియా .. యష్‌ను పెళ్లి చేసుకుంది.వీరి పెళ్లి వెనుక ఓ పెద్ద కథే ఉండట. అందుకే యష్ ను సోనియా పెళ్లి చేసుకుందట. ఇంతకీ ఆ కథేంటీ? పెళ్లి చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులేంటో సోనియా మాటల్లో..

సోనియా ఆకుల విషయానికి వస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనిలో జన్మించింది. ఆమె 9వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. అనంతరం హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్‌లో టెన్త్, హైదరాబాద్‌లోని భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. కొన్ని రోజులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సోనియా.. సినిమాలపై ఇంట్రెస్ట్ తో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలుత ' జార్జ్ రెడ్డి' సినిమాలో హీరో సిస్టర్‌గా నటించే అవకాశం కొట్టేసింది సోనియా. ఈ మూవీ ఫేమ్‌తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, ఆశా ఎన్‌కౌంటర్ వంటి సినిమాల్లో నటించి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

bigg boss sonia akula revealed why she married yash in ismart jodi season 3

సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సోనియా ముందుంటున్నారు. ఆసా ( యాక్షన్ ఎయిర్‌ఫర్ సొసైటల్ అడ్వాన్స్‌మెంట్ ) అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు సోనియా. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది అనాథ పిల్లలకు అదుకుంటుంది. ప్రాజెక్ట్ ప్రేరణ పేరుతో ఆడపిల్లలకు బాసటగా నిలుస్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి అటు బుల్లితెర ఆడియన్స్ కు దగ్గరైంది. కానీ, బిగ్ బాస్ లో తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షోతో పాపులర్‌ అయిన సోనియా ఆకుల ఇటీవల వ్యాపారవేత్త యష్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. వీరి వివాహానికి బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. వాస్తవానికి యష్‌కి అంతకుముందే పెళ్లి అయ్యింది. అతనికి ఓ కొడుకు కూడా ఉన్నారు. సోనియా కోసం యష్ తన భార్యకు విడాకులు ఇచ్చారనే రూమార్స్ కూడా వచ్చాయి. వాటి అన్నింటికీ సోనియా క్లారిటీ ఇచ్చింది.

యాంకర్‌, డైరెక్టర్‌ ఓంకార్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడి సీజన్ 3 లో కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ ఫ్రేమ్ సోనియా, యష్ లు పాల్గొన్నారు. ఈ సమయంలో యష్ మాట్లాడుతూ.. సోనియా నాకు ఎంతో స్పెషల్. నాకు నా చెల్లెమ్మంటే కూడా చాలా ఇష్టం.నేను అమెరికాకు వెళ్తున్నప్పుడు నా గోల్ ఒకటే.. మంచి జాబ్ సంపాదించి, చెల్లెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అనుకున్న విధంగానే యూఎస్ కి వెళ్లి.. కష్టపడి చదివాను. మంచి జాబ్ సంపాదించి, అనుకున్న విధంగానే గ్రాండ్ గా పెళ్లి చేశాను. కానీ దురదృష్టశాత్తు.. లాస్ట్ ఇయర్ నా చెల్లి చనిపోయింది.' అంటూ ఎమోషనల్ అయ్యారు.

'ఆ సమయంలో మా ఫ్యామిలీ మొత్తం బాధతో కుంగిపోయింది. ఆ సమయంలో అప్పుడు మా జీవితంలోకి సోనియా వచ్చింది. మా చెల్లికి కూడా సోనియా అంటే చాలా ఇష్టం. ఆ సమయంలో సోనియా తమకు ఎమోషనల్ గా చాలా దగ్గర అయింది. మా ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలిచింది' అంటూ యష్ ఎమోషనల్ అయ్యారు.

ఆ తర్వాత సోనియా మాట్లాడుతూ శ్వేత చివరి కోరిక చెప్పింది. 'నువ్వు ఎంతోమంది అనాధ పిల్లలను టేక్ కేర్ చేస్తుంటావు. నువ్వు మా అన్నయ్యకు మంచి ఫ్రెండ్ వి, మీ ఇద్దరి మధ్య ఇలాంటి రిలేషన్ లో నాకు తెలియదు. కానీ,నా పిల్లల్ని కూడా నువ్వే చూసుకోవాలి, మా అన్నయ్య వాళ్లకు కూడా తోడు ఉండు' చివరి కోరిక కోరిందని తెలిపింది. 'శ్వేతమ్మ.. నీ అంత కాకుండా నా వరకు ఎంత అయితే అంత నేను ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటాను' అంటూ సోనియా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X