పుట్టిన 3 నెలల్లోనే గిన్నిస్‌తో పాటు 5 రికార్డులు.. బిగ్‌బాస్ సోనియా కూతురు రేర్ ఫిట్..

సాధారణంగా మూడు నెలల వయసున్న చిన్నారులు పాకడం, బోర్లా పడటం, నవ్వడం వంటి చిన్న చిన్న స్టెప్స్ నేర్చుకునే దశలో ఉంటారు. కానీ బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల (Sonia Akula) గారాల పట్టి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ చిన్నారి చేతలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోనియా- యష్ వీరగోని దంపతుల గారాల పట్టి 'శిఖ'మాత్రం అతి చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఘనత సాధించింది. కేవలం 3 నెలల 29 రోజుల వయసులోనే గిన్నిస్ సహా మొత్తం ఐదు ప్రతిష్టాత్మక రికార్డులు సాధించి సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసిందంటే?

బుడిబుడి అడుగులతో ప్రపంచ రికార్డు
చిన్నారి శిఖ సాధించిన ప్రధాన ఘనత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records)లో చోటు సంపాదించడం.'ఇన్ఫెంట్ ద్వారా పేరెంట్స్ పామ్‌పై నిటారుగా బ్యాలెన్స్ చేస్తూ ఎక్కువ సేపు నిలబడటం' అనే విభాగంలో ఆమె ఈ రికార్డు సృష్టించింది. తన తండ్రి అరచేతిపై ఏకంగా 2 నిమిషాలు 43 సెకన్ల పాటు నిలబడి అద్భుతమైన బ్యాలెన్స్ చూపించింది. ఈ వయసులో ఇంత స్థిరంగా నిలబడటం చాలా అరుదైన విషయం అని నిపుణులు చెబుతున్నారు.

Bigg Boss Sonia Daughter Sets 5 Records Including Guinness at Just 3 Months Age

ఐదు రికార్డులతో చిన్నారి సెన్సేషన్
గిన్నిస్ రికార్డు మాత్రమే కాదు, శిఖ సాధించిన విజయాలు ఇక్కడితో ఆగలేదు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ (Limca Book of Records), ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (Asia Book of Records), ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (India Book of Records), తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ (Telugu Book of Records)వంటి ప్రతిష్టాత్మక రికార్డు సంస్థలలో కూడా ఆమె పేరు నమోదైంది. ఒకేసారి ఐదు రికార్డులు సాధించడం అరుదైన ఘనతగా చెప్పాలి.

వైరల్ అవుతున్న వీడియో
చిన్నారి 'శిఖ' చేసిన ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చిన్నారి తన తండ్రి అరచేతిపై నిలబడి, ఆయన కళ్లలోకి చూస్తూ నవ్వుతున్న తీరు నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఎంతో చిన్న వయసులో ఇంత బ్యాలెన్స్, ఫోకస్ చూపించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. "ఇది నిజంగానే అద్భుతం", "ఇంత చిన్న వయసులో ఇంత టాలెంట్!" అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విజయంపై సోనియా, యష్ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు ఇంత చిన్న వయసులోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. అయితే, ఈ రికార్డు సాధన వెనుక సరైన ట్రైనింగ్, జాగ్రత్తలు, నిపుణుల పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని కూడా వారు చెప్పారు. ఇలాంటి ఫీట్లు చూసి ఇంట్లోనే ప్రయత్నించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి చిన్నారి శారీరక సామర్థ్యం వేర్వేరు గా ఉంటుందని, సరైన గైడెన్స్ లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. శిఖ విషయంలో ప్రత్యేక శిక్షణ, పర్యవేక్షణతోనే ఈ రికార్డు సాధ్యమైందని స్పష్టం చేస్తున్నారు.

బిగ్ బాస్ సోనియా కూతురు శిఖ సాధించిన ఈ ఘనత కేవలం కుటుంబానికి మాత్రమే కాదు, దేశానికి గర్వకారణంగా మారింది. మూడు నెలల వయసులోనే ప్రపంచ రికార్డులు సృష్టించడం నిజంగా అసాధారణం. ఈ చిన్నారి భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం శిఖ పేరు 'లిటిల్ చాంపియన్'గా సోషల్ మీడియాలో మార్మోగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X