Bigg Boss Telugu 7: చివరి వారంలో హౌస్‌లోకి కొత్త వ్యక్తులు.. వారికి స్పెషల్ గిఫ్టులు.. మళ్లీ ఫేవరిజమా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కాని అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ కు వెళ్లిన హౌస్ మేట్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. కేవలం ఎపిసోడ్స్ చూసి ఓట్లు వేయడమే కాకుండా వారి కోసం సోషల్ మీడియా వేధికగా గొడవలకు దిగుతున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్లను ఎవరైనా ఏమన్నా అంటే పర్సనల్ గా అటాక్ కూడా చేస్తున్నరు. బుల్లితెర ప్రేక్షకులకు తమ ఇంట్లోనే ఇదంతా జరిగేలా చేయడంలో బిగ్ బాస్ నిర్వాహకులు సఫలం అయ్యారు.
అయితే ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 15వ వారంలోకి అడుగు పెట్టింది. మరో మూడు రోజుల్లో ఈ షో పూర్తి కాబోతుండగా.. విన్నర్, రన్నరప్ లు ఎవరో తెలియనుంది. అయితే షో చివరి వారంలో హౌస్ లోకి కొత్త వ్యక్తులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లెవరో తెలిస్తే అంతా షాకవ్వాల్సిందే. ఎవరో తెలుసా... మొన్నటి వారంలో హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ అప్పజెప్పిన ఆయన పిల్లలు. అయితే ఆ పిల్లలే మరోసారి ఇంటికి వచ్చారు. తమను ఇంట్లో ఉన్న వాళ్లంతా నవ్వించి సంతోషపెడితే వాళ్లకు స్పెషల్ బహుమతులు ఇస్తామని వివరించారు. అయితే బిగ్ బాస్ పిల్లలను హ్యాపీగా ఉంచేందుకు కంటెస్టెంట్లు ఏమేం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా ఈరోజు విడుదల అయిన ప్రోమో చూస్తుంటే... బిగ్ బాస్ పిల్లలు హౌస్ లోకి అడుగు పెట్టినట్లు అర్థం అయిపోతుంది. అయితే ముందుగా బిగ్ బాస్ పిల్లలు... మీ ఇంట్లో వాళ్లను మీరు ఎంతలా మిస్ అవుతున్నారో, మీ ఇంటి ఫుడ్ ను కూడా అంతే మిస్ అవుతున్నారంటూ చెప్పారు. దానికి హౌస్ మేట్స్ కూడా అవునని చెప్పారు. అలాగే మీరు మమ్మల్ని కనుక సంతోషపరిస్తే.. మీ ఇంటి వాళ్లు పంపిన ఆహారాన్ని మీకు అందిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే అంబటి అర్జున్ కోసం ఆయన భార్య పంపిన ఆహారాన్ని చూపించారు.
అంబటి అర్జున్ కోసం ఆయన భార్య రాగి సంకటి, నాటుకోడి పులుసు పంపినట్లు చూస్తుంటేనే తెలిసిపోతుంది. అయితే ఆ ఆహారం ఆయనకు అందించాలంటే బాల్స్ టాస్క్ ను యావర్ ఆడి గెలవాలి. అప్పుడే ఆ ఆహారాన్ని అర్జున్ కు లభిస్తుంది. అయితే ప్రిన్స్ యావర్ చాలా కష్టపడి మరీ ఆ టాస్క్ ఆడాడు. గతంలో వచ్చిన ఇదే టాస్క్ ఆడి గెలిచిన అతడు.. మరోసారి గెలిచి... అర్జున్ కు అదిరిపోయే గిఫ్టు ఇచ్చాడు. తన భార్య ఎంతో ప్రేమతో పంపిన ఆహారం తనకు వచ్చేలా చేసిన యావర్ కోసం అర్జున్ ఏం చేస్తాడో చూడాలి మరి.

ఇక ఆ తర్వాత శివాజి కోసం ఆయన భార్య పంపిన ఆహారాన్ని చూపించారు. దానికోసం ప్రియాంక జైన్ గేమ్ ఆడాలని.. అందులో గెలిస్తేనే ఆయనకు ఆహారం లభిస్తుందని అన్నారు. అయితే ఈ టాస్క్ లో ప్రియాంక గెలిచి శివాజికి ఆయన ఆహారం వచ్చేలా చేసింది. ఇఖ ఆ తర్వాత శివాజిని పైన బాల్స్ పెట్టి వాటిని పగులగొట్టే టాస్క్ ఇచ్చారు. అందులో ఆయన ఓడిపోయినట్లు అర్థం అవుతోంది. కానీ ఆయన ఎవరి కోసం గేమ్ ఆడారో తెలియాలంటే ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











