Bigg Boss Telugu 5 Sreerama Chandra రొమాంటిక్ చాట్ శ్రీరెడ్డి లీక్ .. వాళ్ళ దెబ్బకు మళ్ళీ వైరల్!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించి, అవకాశాలు ఇవ్వకుండా చేసిన ఇండస్ట్రీ పెద్దల బండారం ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఇండస్ట్రీ పెద్దల్లో దడ పుట్టించిన శ్రీరెడ్డి ఎందుకో సడన్ గా సైలెంట్ అయిపోయి చెన్నై వెళ్లి సెటిల్ అయింది. ఆ మధ్య వరుసగా అందరినీ టార్గెట్ చేస్తూ బూతులతో విరుచుకుపడిన ఈ అమ్మడు ఆరోగ్యం బాలేక ఇప్పుడు సైలెంట్ గా ఉంటోంది. ఈ భామ సింగర్ శ్రీరామ్ గురించి లీక్ చేసిన చాట్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

వరుస లీకులు

వరుస లీకులు

తనను అవకాశాల పేరుతో మానసికంగా , శారీరకంగా హింసించారంటూ మీడియా నాలుగేళ్ల క్రితం మీడియా ముందుకు వచ్చిన శ్రీరెడ్డి... తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని, అప్పటి వరకూ తనను ఎవరెవరు వాడుకున్నారో ఆధారాలతో సహా బయటపెడతా అంటూ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపింది. అలా ఆమె కొన్నాళ్ల పాటు చాలా మంది ఛాట్స్ బయట పెట్టింది కూడా. అందులో భాగంగానే సింగర్ శ్రీరామ్ చాట్ లీక్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదీ నిజం స్వరూపం అంటూ

ఇదీ నిజం స్వరూపం అంటూ

తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా 'చూడండి.. ఇండియన్ ఐడల్ చాట్ .. షేమ్ ఆన్ యు శ్రీరామ్' అంటూ ఆయనతో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా లీక్ చేసింది శ్రీరెడ్డి. ఈ చాట్‌లో శ్రీరామ్.. ఆమె బాడీ పార్ట్స్ గురించి పదే పదే ప్రస్తావించడం.. ఫోటోలు పంపాలని అడగడం కూడా కనిపించింది. అయితే శ్రీరెడ్డి కూడా తక్కువేం కాదు అన్నట్టుగా అతన్ని రెచ్చగొట్టేలా చాట్ లో మాట్లాడడం కూడా కనిపిస్తోంది. అంటే చాట్ లో ఇద్దరి తప్పు ఉంది కానీ అతనిదే తప్పన్నట్టు శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది.

నాలుగేళ్ళ క్రితం

నాలుగేళ్ళ క్రితం

అలా ఈ అమ్మడు నాలుగేళ్ల క్రితం ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్, ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీ రామ్ చాట్ లీక్ చేసింది. ఇప్పుడు శ్రీ రామ్ మంచి పోటీ ఇస్తూ ఉండడంతో ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు శ్రీరెడ్డి పాత చాట్స్ ని బయటకు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేకాక శ్రీరామ్ అసలైన క్యారెక్టర్ ఇదే కాబట్టి అతనిని హౌస్ నుంచి బయటకు పంపేయాలి అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

 ఇప్పుడు టార్గెట్ చేయడం కోసం

ఇప్పుడు టార్గెట్ చేయడం కోసం

అయితే ఈ వ్యవహారం అంతా 2018 లో జరిగిన వ్యవహారం కాగా ఇప్పుడు శ్రీరామ్ బిగ్ బాస్ లో ఉండడంతో మిగతా కంటెస్టెంట్ అభిమానులు అందరూ శ్రీరామ్ ని టార్గెట్ చేయడానికి దీనిని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఆ పాత చాట్ తెర మీదకు తీసుకువచ్చి శ్రీరామ్ బిహేవియర్ ఇలాంటిది అతను అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందుకే అతనిని సపోర్ట్ చేయకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
ఆమె కావాలని

ఆమె కావాలని

అయితే దీనికి శ్రీరామ్ అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అసలు చాట్ మొత్తం పరిశీలిస్తే శ్రీరెడ్డి ముందు శ్రీరామ్ తో మాట్లాడిందని, ఆమె కావాలనే రెచ్చగొట్టే విధంగా శ్రీ రామ్ ను మాటల్లోకి దించింది అని అంటున్నారు. కావాలి అంటే చాట్ మొత్తం చూసుకోమని కూడా అంటున్నారు. మొత్తం మీద శ్రీ రెడ్డి శ్రీరామ్ వ్యవహారం మళ్లీ తెర మీదకు రావడం మాత్రం ఆసక్తికరంగా మారింది. దీనిమీద శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X