శ్రీముఖి కి పుల్లలు పెట్టడం బాగా అలవాటు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో శ్రీ సత్య (Sri Sathya)ఒకరు. సీరియల్స్‌తో బుల్లితెరపై మంచి పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ, బిగ్‌బాస్ సీజన్ 6 ద్వారా మరింత దగ్గరైంది. 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న శ్రీ సత్య, షార్ట్ ఫిల్మ్స్‌తోనూ క్రేజ్ పెంచుకుంది. అదే ఊపుతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి సుమారు 103 రోజుల పాటు తన ఆటతీరు, వ్యక్తిత్వంతో ఆకట్టుకుంది. అయితే షో తర్వాత సినిమాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో, ప్రస్తుతం డ్యాన్స్ షోలు, రియాలిటీ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొత్త స్నేహాలు, కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారా అని యాంకర్ ప్రశ్నించగా,, శ్రీ సత్య చాలా స్పష్టంగా స్పందించింది. 'గత కొన్ని రోజులుగా నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఎవరితోనూ తిరగడం లేదు. నాలో నేనే ఒక కొత్త మార్పు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఆరా డిస్టర్బ్ అవుతోంది. కెరీర్‌పై ఫోకస్ పెట్టాల్సిన సమయంలో బయట పనులు, ఎంజాయ్మెంట్ ఎక్కువ అవుతున్నాయి. ఏదైనా మనకు అలవాటైతే... వర్క్‌కి తర్వాత ప్రాధాన్యం ఇస్తాం. కానీ నాకు అది ఇష్టం లేదు. నాకు వర్క్‌నే ఇంపార్టెంట్' అంటూ తన ప్రస్తుత మైండ్‌సెట్‌ను వివరించింది.

ఇక 'ఈమధ్య గీతు రాయల్స్‌తో తిరగడం మానేశావా?' అన్న ప్రశ్నకు కూడా క్లారిటీ ఇచ్చింది. 'ఫ్రెండ్స్‌ని మార్చలేదు. కేవలం ఎంజాయ్మెంట్ ఎక్కువ అవుతోందనే ఉద్దేశంతో అందరికీ దూరంగా ఉంటున్నాను. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని మిగతా వాళ్లను దూరంగా ఉంచుతున్నా. గీతుకి ఉన్న నెగటివ్ ఎనర్జీ నాకూ వస్తుందేమో అన్న భయంతో కొంచెం గ్యాప్ తీసుకున్నా. అయినా గీతు ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్' అని చెప్పింది. అలాగే, 'నా ఎంజాయ్మెంట్ కోసం మమ్మీ- డాడీని దూరం పెట్టడం కూడా కరెక్ట్ కాదు'అంటూ కుటుంబ విలువల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
ఇదే ఇంటర్వ్యూలో బీబీ జోడీ 2 షో యాంకరింగ్ విషయంలో శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజులపై శ్రీ సత్య చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. 'శ్రీముఖిని చూస్తూ చూస్తూ మనం అలవాటు పడిపోయాం. ఆమెకు పుల్లలు పెట్టడం బాగా అలవాటు. కంటెంట్ కోసం ఇతరులను ఆటపట్టించడం, అదే స్టైల్‌ను కంటెంట్‌లో కొనసాగించడం ఆమెకు సహజం' అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించింది.
ప్రదీప్ విషయానికి వస్తే మాత్రం టోన్ మారింది.' ప్రదీప్ జోనర్ వేరే. అతను నవ్విస్తాడు, తన మాటలతో ఎవరూ ఇబ్బంది పడకుండా చూసుకుంటాడు. పుల్లలు పెట్టే టైపు కాదు. ఇప్పటివరకు షోలలో కూడా అలాంటి స్టైల్ చూడలేదు. ఈ షోలో ఏమైనా కొత్తగా ట్రై చేస్తాడేమో చూడాలి. యాంకరింగ్‌కు గ్యాప్ తీసుకుని రావడంతో కొద్దిగా తేడా కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే నేను ప్రదీప్‌కి పెద్ద ఫ్యాన్‌ని' అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. అయితే "ఒకప్పుడు కనిపించిన ప్రదీప్ ఇప్పుడు కొంచెం మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది" అంటూ చిన్న లోటు ఉందని కూడా చెప్పింది. ఇలా శ్రీ సత్య చేసిన ఈ నిజాయితీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











