డీజే టిల్లు 2తో మోసపోయా.. బిగ్ బాస్ శ్రీసత్యకు చేదు అనుభవం

బిగ్ బాస్ సీజన్ 6తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది నటి శ్రీసత్య. తొలుత మోడల్ గా, నటి తెలుగు చిత్ర పరిశ్రమలో పలు రకాల ట్రయల్స్ చేసింది. కానీ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇంట్రెస్టింగ్ సీరియల్స్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టవ్ గా కనిపిస్తూ ఉంటుంది.

సినిమాలు, సీరియల్స్ తో నటిస్తూనే మరోవైపు సమయం ఉన్నప్పుడల్లా పలు ఇంటర్వ్యూల్లోనూ మెరుస్తూ ఉంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను నిర్మోహమాటంగా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు జరిగిన చేధు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నటిగా ఎదుగుతున్న ఈ బ్యూటీకి ఓ భారీ ఆఫర్ మిస్ అయ్యిందని చెప్పుకొచ్చింది. తనే మొదట హీరోయిన్ అని చెప్పి చివర్లో మాట మార్చేశారని చెప్పుకుంటూ బాధపడింది. ఆ సినిమా మరేదో కాదు. 2024లో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డీజే టిల్లు స్క్వేర్ తో తనకు కెరీయర్ లో పెద్ద పడిందని వివరించింది.

Bigg Boss Sri Satya about DJ Tillu square movie offer missed

ముందు ఆ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా తననే ఎంపిక చేస్తామని మేకర్స్ చెప్పారంట. దాంతో శ్రీసత్య ఏడాది పాటు ఎలాంటి ప్రాజెక్ట్స్ ను ఒప్పుకోకుండా ఆ చిత్రం కోసం వెయిట్ చేసిందంట. కానీ చివరికి శ్రీసత్యను పక్కన పెట్టి ఆ సినిమా షూటింగ్ ను ప్రారంభించి రిలీజ్ కూడా చేశారని వెల్లడించింది. ఆ సమయంలో తను ఎంతగానో బాధపడ్డానని చెప్పుకొచ్చింది. వెయిట్ చేయించి మరీ తనను అవమానించారని, చాలా ఫీల్ అయ్యానని చెప్పింది. అలాగే తన కెరీయర్ బిగినింగ్ లోనూ సీరియల్ షూటింగ్స్ చేస్తున్న సమయంలో ఓ సీనియర్ నటి కూడా అవమానించిందని చెప్పింది.

కనీసం కొత్త నటి అని కాకుండా మనిషిగా కూడా విలువ ఇవ్వలేదని గుర్తుకొని బాధపడింది. ఆ తర్వాత నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనే విషయాలను నేర్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా తయారైనట్టు చెప్పుకొచ్చారు. ఆమె మాటలకు మున్ముందు మంచి భవిష్యత్ ను చూస్తావంటూ తన అభిమానులు మద్దుతునిస్తున్నారు. ఇక శ్రీసత్యం 2018లో తొలిసారిగా 'నిన్నే పెళ్లాడతా' సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2019లో ముద్ద మందారం, అత్తారింట్లో అక్కాచెళ్లెళ్లు, త్రినయని వంటి సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరోవైపు 'తొందర పడకు సుందర వదనా' అనే వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది. జీ తెలుగులో వచ్చిన సూపర్ క్వీన్ తెలుగు రియాలిటీ షోలోనూ మెరిసింది. ప్రస్తుతం సినిమాల్లో మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది. గతంలో రామ్ పోతినేని - కీర్తి సురేష్ జంటగా నటించి 'నేనూ శైలజా’ చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. విజయవాడలో పుట్టి పెరిగిన శ్రీసత్య మిస్ విజయవాడ 2015 అందాల పోటీ కాంపిటీషన్ లో టైటిల్ ను కూడా గెలుచుకుంది. అలా ఫ్యాషన్ ఈవెంట్ లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటూ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X