బిగ్ బాస్ బ్యూటీ లవ్ ఫెల్యూర్.. సొంత అక్కే తన బాయ్ ఫ్రెండ్ తో.. షాకింగ్
టీవీ నటి సత్యశ్రీ తెలుగు బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. సీరియల్ నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అందంతో పాటు నటన పరంగానూ మంచి మార్కులు పొందింది. తెలుగులో చాలా సీరియల్స్ లో మెరిసిన, మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ తర్వాత మరింతగా క్రేజ్ దక్కింది. దాంతో ఆయా టీవీ ప్రొగ్రామ్స్, గేమ్ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తోంది. మరోవైపు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా తన చిన్నతనంలో జరిగిన ఓ ఘటనను బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.
చిన్నప్పటి నుంచే బిగ్ బాస్ సత్యశ్రీ ఆసక్తి..
సత్యశ్రీ విజయవాడలో పుట్టి పెరిగింది. 1997 జూన్ 29న జన్మించింది. తండ్రి దుర్గా శ్రీనివాస్ ప్రసాద్. ఆయన బిజినెస్ మెన్. ఆమె తల్లి పేరు ఎం లలిత. తల్లిదండ్రులు సత్యశ్రీని చిన్నప్పటి నుంచే కళారంగం వైపు ప్రోత్సహించారు. ఆమె ప్రముఖ గాయకుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ బంధువులు కావడం విశేషం. అలా చిన్నప్పటి నుంచే కళారంగంపై ఆసక్తి పెరిగింది. డ్యాన్స్, యాక్టింగ్ పై ఆసక్తి చూపిస్తూ వచ్చింది. దాంతోనే మోడలింగ్ లో అడుగుపెట్టి 2015లో మిస్ విజయవాడ టైటిల్ ను గెలుచుకుంది. 2016లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ సబ్ టైటిల్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది.

బిగ్ బాస్ తో దశ తిరిగింది..
సత్యశ్రీ చిన్న వయస్సుల్లోనే కళారంగంలో అడుగుపెట్టింది. రామ్ పోతినేని కీర్తి సురేష్ జంటగా నటించిన నేనూ శైలజా చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత గోదారి నవ్వింది అనే సినిమాతోనూ అలరించింది. అంతకు ముందు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ ల్లో నటించింది. లవ్ స్కేచ్, తరుణం వంటివి బాగా గుర్తింపును తీసుకొచ్చాయి. ఇలా సీరియల్స్ లోనూ అవకాశం దక్కించుకుంది. నిన్నే పెళ్లాడుతా.. ముద్ద మందారం, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు, త్రినయని వంటి చిత్రాల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 2022లో వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపింది. తన టాలెంట్ తో ఆకట్టుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్రీసత్యకు మంచి క్రేజ్ దక్కింది. ఆ తర్వాత నుంచి పలు టీవీ షోల్లో మెరుస్తూ సందడి చేస్తోంది.
లేటెస్ట్ షోలో తన లవ్ లైఫ్ గురించి..
బిగ్ బాస్ సత్యశ్రీ ప్రస్తుతం 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్' సీజన్ 2 గేమ్ షోలో పార్టిసీపేట్ చేస్తోంది. అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్ లేడీ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి యాంకర్. అయితే రీసెంట్ ఎపిసోడ్ లో శ్రీసత్య తన లవ్ లైఫ్ గురించి మాట్లాడింది. 'మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండేవాడు. రోజు తనని చూసేందుకే వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. ఒక రోజు స్పెక్ట్ పెట్టుకొని వెళ్లాను. దాంతో అతను నీకు బాగున్నాయని చెప్పాడు.
దాంతో మా అమ్మను నాకు స్పెక్ట్ కొనివ్వవా అని అడిగాను. కొనివ్వను అని చెప్పింది. దీంతో మా పక్కింటి అక్క దగ్గరికి వెళ్లి స్పెక్ట్ కావాలంటే ఏం చేయాలని అడిగాను. నీకు సైట్ వస్తే కొనిస్తారని ఐడియా ఇచ్చింది. దీంతో మూడు నెలలు ఆ అక్క స్పెక్ట్స్ పెట్టుకొని తిరిగాను. దీంతో నాకు -2 సైట్ వచ్చింది. నాకు సైట్ వచ్చిందని తెలిసినా రోజే హాట్ బ్రేకింగ్ న్యూస్ కూడా తెలిసింది. అతని మా అక్క నచ్చిందని' అంటూ తన ఫస్ట్ లవ్ ఫెల్యూర్ గురించి చెప్పుకొచ్చింది. ఇక సత్యశ్రీ లవ్ స్టోరీ విన్న అందరూ షాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications











