‘ఏడో తరగతిలో దారుణం.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా అలా..’

బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ బ్యూటీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట సంచలనం రేపుతున్నాయి. తన చిన్నతనంలోనే తాను ఎదుర్కొన్న షాకింగ్ అనుభవం, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు ఘటనలను బయటపెట్టడంతో అందరూ షాక్ అవుతున్నారు. తాను ఏడో తరగతిలో ఓ షాకింగ్ సంఘటనను ఎదుర్కొన్నననీ ఎమోషనల్‌ అయ్యింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు? అసలేం జరిగింది? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Also Read
Dhurandhar 2: ధురంధర్ 2 కోసం రణవీర్ సింగ్ రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?
Dhurandhar 2: ధురంధర్ 2 కోసం రణవీర్ సింగ్ రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

ఆ అమ్మడు ఎవరో కాదు.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీ సత్య (Sri Satya), తాజాగా ఈ అమ్మడు తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, బిగ్ బాస్ షో తర్వాత మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోలతో బిజీగా ఉన్న శ్రీ సత్య.. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు సంబంధించిన పలు సంచలన విషయాలను బయటపెట్టింది.

Bigg Boss Sri Satya Reveals Shocking Harassment Incident from 7th Class Gets Emotional

ఈ సందర్భంగా చిన్నతనం నుంచే తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పింది. 'ఏడో తరగతిలో చదువుతున్నప్పుడు రోడ్డుపై వెళ్తుంటే ఒక వ్యక్తి నడుము గిల్లి వెళ్లిపోయాడు. అక్కడ చాలా మంది ఉన్నా ఎవరూ ముందుకు వచ్చి ఆపలేదు'అంటూ ఎంతో భావోద్వేగానికి గురైంది. చిన్నపిల్లలు కూడా ఇలాంటి ఘటనలకు గురవుతుండటం సమాజంలో ఉన్న సమస్యలను బహిర్గతం చేస్తోందని ఆమె అభిప్రాయపడింది.

Recommended For You
Dhurandhar 2 Vs OG: ఓజీని కొట్టలేకపోయిన ధురంధర్ 2.. సునామీలో పవన్ రికార్డు సేఫ్!
Dhurandhar 2 Vs OG: ఓజీని కొట్టలేకపోయిన ధురంధర్ 2.. సునామీలో పవన్ రికార్డు సేఫ్!

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు పెద్దగా మారలేదని శ్రీ సత్య వెల్లడించింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్ననీ, ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని అన్నారు. చాలా మంది నేరుగా కాకుండా పరోక్షంగా అవకాశాల కోసం ఇబ్బందికరమైన ఆఫర్లు ఇస్తారని తెలిపింది. 'ఇప్పటికీ నాకు అలాంటి ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. కానీ వారు ఎప్పుడూ నేరుగా అడగరు, చుట్టూ తిరిగి మాట్లాడుతుంటారు' అని ఆమె చెప్పింది.

You May Also Like
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇక అవకాశాల కోసం చేసిన ప్రయత్నాల గురించి చెప్పిన శ్రీ సత్య, ఆడిషన్లు, ఫోటోషూట్లు చేసిన తర్వాత కూడా కొన్ని సినిమాల నుంచి తనను తొలగించారని వెల్లడించింది. తాను ఎన్నో సార్లు చాలా నిరాశకు లోనయ్యాననీ, ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాకపోవడం వెనుక ఉన్న వాస్తవాలను ఈ సంఘటనలు తెలియజేస్తాయని పేర్కొంది. అంతేకాకుండా, టీవీ షోల సమయంలో కూడా తాను అవమానాలు ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పింది.

నా కష్టం అంతా వృథా.. నా డ్రీమ్ హౌస్ సుధీర్ చేతిలోకి.. టాలీవుడ్ నటుడు ఎమోషనల్
నా కష్టం అంతా వృథా.. నా డ్రీమ్ హౌస్ సుధీర్ చేతిలోకి.. టాలీవుడ్ నటుడు ఎమోషనల్

'మేకప్ రూమ్‌లో ఉండగా నా బ్యాగ్‌ను బయటకు విసిరేసి, ఎవరితో పడితే వాళ్లతో షేర్ చేసుకుంటామా అని మాట్లాడారు' అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. సినిమా, టెలివిజన్ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదని స్పష్టమవుతోంది. క్యాస్టింగ్ కౌచ్, పరోక్ష వేధింపులు, అవమానకర పరిస్థితులు వంటి అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని శ్రీ సత్య వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X