వాడిలో 1% డెడికేషన్ ఉన్నా చాలు.. మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని - బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శ్రీ సత్య (Sri Satya) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా పాపులారిటీ సంపాదించింది. హౌస్‌లో 100 రోజులకుపైగా కొనసాగుతూ తన అందం, ఆటతీరుతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే షో తర్వాత సినిమాల్లో పెద్ద అవకాశాలు రాకపోయినా.. ప్రస్తుతం టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లతో కొనసాగుతున్నాయి.

ఇటీవల RJ Kajal నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రీ సత్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షోలో ఫిట్‌నెస్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి చర్చ జరుగుతుండగా, ఆమె మహబూబ్‌దిల్ సే (Mehaboob Dil Se)గురించి మాట్లాడింది. "వాడి వర్కౌట్లు ఏంటో అర్థం కాదు... నాకు మహబూబ్‌లో ఒక్క శాతం డెడికేషన్ ఉన్నా చాలు, నేను మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని" అంటూ సరదాగా చేసిన కామెంట్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఇది కొంచెం కాంట్రవర్సీగా అనిపించినా, వెంటనే ఆమె అసలు విషయం క్లియర్ చేసింది.

Bigg Boss Sri Satya Shocking Comment on Mehaboob Dedication Goes Viral in Podcast Interview

శ్రీ సత్య మాట్లాడుతూ, గత రెండున్నర సంవత్సరాలుగా మహబూబ్‌తో కలిసి ట్రావెల్ చేస్తున్నానని, ముఖ్యంగా 'బీబీ జోడీ' షో తర్వాత వారి స్నేహం మరింత బలపడిందని తెలిపింది. 'నిజంగా వాడి డెడికేషన్ చూసి నాకు సిగ్గేస్తుంది. ఫిట్‌నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు" అని చెప్పింది. ఒకసారి అతని డైట్ ట్రై చేశానని, అందులో ఉప్పు, కారం ఏమీ లేకపోవడంతో తాను అలాంటి లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వలేనని నవ్వుతూ వెల్లడించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు విమర్శలా కాకుండా, మహబూబ్ క్రమశిక్షణపై ప్రశంసలుగా మారాయి.

ఇదే సమయంలో RJ కాజల్ కూడా తన అనుభవాన్ని పంచుకుంది. "మహబూబ్ వల్లే నాకు ఫిట్‌నెస్‌పై అవగాహన వచ్చింది. అతడిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని 125 రోజుల ఫిట్‌నెస్ ఛాలెంజ్ పూర్తి చేశాను" అని చెప్పడం ద్వారా మహబూబ్ ప్రభావం ఎంత ఉందో తెలియజేసింది. ఈ సంభాషణ మొత్తం చూస్తే, ఫిట్‌నెస్‌పై యువతకు మంచి మెసేజ్ ఇచ్చినట్టే అనిపిస్తుంది.

ఇక అదే ఇంటర్వ్యూలో శ్రీ సత్య తమ ప్రైవేట్ ఆల్బమ్ 'నువ్వే కావాలి' గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. యూరప్‌లో భారీ స్థాయిలో ఈ సాంగ్ షూట్ చేయడం తనకు చాలా థ్రిల్లింగ్ అనిపించిందని చెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్ బడ్జెట్, రికవరీ గురించి తాను పెద్దగా తెలుసుకోలేదని పేర్కొంది. దీంతో RJ కాజల్ సూచనతో శ్రీ సత్య, మహబూబ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంది.

మహబూబ్ చెప్పిన ప్రకారం, ఈ సాంగ్ కోసం దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు అయిందని, అయితే యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.20 నుంచి 25 లక్షల మధ్యలోనే ఉందని తెలిపాడు. అంటే పూర్తిగా లాభాలు రాకపోయినా, విజువల్ క్వాలిటీ కోసం నిర్మాతలు పెద్ద రిస్క్ తీసుకున్నట్టు తెలుస్తోంది. "యూట్యూబ్‌కు 20 లక్షలు అంటేనే ఎక్కువ... కానీ సాంగ్‌ను గ్రాండ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో యూరప్‌లో మూడు దేశాల్లో షూట్ చేశాం" అని మహబూబ్ చెప్పడం ప్రాజెక్ట్‌పై వారి ప్యాషన్‌ను చూపించింది.

ఈ ప్రైవేట్ ఆల్బమ్‌లో లిరిక్స్‌ను సురేష్ బనిశెట్టి అందించగా, భార్గవ్ రవడ సినిమాటోగ్రఫీతో పాటు డైరెక్షన్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించాడు. మనీష్ కుమార్ సంగీతం అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్‌తో జతకట్టింది. ముఖ్యంగా బార్సిలోనా, పారిస్, మెక్సికో వంటి అందమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఇంటర్వ్యూ ద్వారా శ్రీ సత్య తన వ్యక్తిత్వాన్ని మరో కోణంలో చూపించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X