రమ్య పికిల్‌తో రొమాంటిక్‌గా.. బిగ్‌బాస్ బ్యూటీకి లైన్ వేస్తూ భార్యకు దొరికిన యంగ్ హీరో

బిగ్‌బాస్ వేదికపై పరిచయమైన చాలా మంది కంటెస్టెంట్లు ఆ తర్వాత కూడా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా అలాంటి ఓ సంఘటననే ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసింది. అలేఖ్య చిట్టి పికిల్స్‌తో వైరల్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అమర్‌దీప్ చౌదరి కలిసి చేసిన ఓ స్కిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే... ఆ స్కిట్‌లో అమర్‌దీప్ చేసిన రొమాంటిక్ యాక్టింగ్‌ను ఆయన భార్య తేజస్విని గౌడ స్టేజ్‌పైనే ప్రశ్నించడం. ఇంతకీ ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా యూజర్లకు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ కస్టమర్‌ను తిట్టిన వీడియో వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రమ్య, తన అగ్రెసివ్ ఆటతీరు, డేర్‌డెవిల్ ఫిజికల్ టాస్క్‌లతో మొదట ఆకట్టుకుంది. కానీ తోటి కంటెస్టెంట్లపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల కారణంగా నెగటివ్ ఇమేజ్ తెచ్చుకుని, త్వరగానే ఎలిమినేట్ అయ్యింది.

Bigg Boss Star Amardeep Chowdary - Ramya Moksha Romantic Skit Tejaswini s Funny Reaction Goes Viral

ఇక అమర్‌దీప్ చౌదరి విషయానికి వస్తే, సీరియల్ హీరోగా కెరీర్ మొదలుపెట్టి బిగ్‌బాస్ తెలుగు 7 ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించారు. షోలో తన అమాయకత్వం, ఎమోషనల్ నేచర్‌తో అభిమానులను ఆకట్టుకున్న అమర్‌దీప్, అదే సమయంలో పల్లవి ప్రశాంత్‌తో జరిగిన గొడవల వల్ల కొంత నెగటివిటీ కూడా తెచ్చుకున్నారు. అయితే తన భార్య తేజస్విని గౌడపై ఉన్న ప్రేమను మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లో ఎన్నోసార్లు ఓపెన్‌గా చెప్పి, రియల్ లైఫ్ రొమాంటిక్ హస్బండ్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు అసలు కథలోకి వస్తే... సంక్రాంతి సందర్భంగా స్టార్ మా ఛానల్ నిర్వహించిన 'మా సంక్రాంతి వేడుక' స్పెషల్ ఈవెంట్‌లో అమర్‌దీప్, రమ్య మోక్ష జంటగా ఓ సరదా స్కిట్ చేశారు. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసిన ఈ ఈవెంట్‌లో బిగ్‌బాస్, సీరియల్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఆ స్కిట్‌లో భాగంగా రమ్య మోక్ష అమర్‌దీప్‌కు ఓ స్పెషల్ షీల్డ్ ఇస్తుంది. షీల్డ్‌పై పెద్దగా "ఊరుకో బావ... మీ ఆవిడ చూస్తుంది" అని రాసి ఉండటం మొదటి నవ్వును తెప్పించింది. ఆ షీల్డ్‌ను అమర్‌దీప్ చేతిలో పెట్టుతూ రమ్య అదే డైలాగ్‌ను రొమాంటిక్ టోన్‌లో పలకడం, ఓరకంటితో చూస్తూ కాస్త మత్తెక్కించేలా మాట్లాడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దీనికి అమర్‌దీప్ కూడా స్కిట్‌లో భాగంగా పూర్తి సహకారం ఇస్తూ, రమ్య వైపు కన్ను ఆర్పకుండా చూస్తూ యాక్ట్ చేయడం సీన్‌కు మరింత కలర్ తెచ్చింది. ఈ క్రమంలో బ్యాక్‌గ్రౌండ్‌లో 'పార్ట్ పార్ట్స్‌గా చూస్తే ఇది కూడా బాగుందే'అనే డైలాగ్ ప్లే కావడం స్కిట్‌కు హైలైట్‌గా నిలిచింది. ఆ క్షణాల్లో హాల్ మొత్తం నవ్వులతో మారుమోగింది. అయితే అసలు ట్విస్ట్ అక్కడితో ఆగలేదు. ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్న అమర్‌దీప్ భార్య తేజస్విని గౌడ ఒక్కసారిగా స్పందిస్తూ 'అసలు నీకు సిగ్గుందా రా?'అని గట్టిగా అనడం షోకు మరింత కిక్ ఇచ్చింది. అందరి ముందు తేజస్విని స్టేజ్‌ పై ఉన్న అమర్‌దీప్‌ను నేరుగా ప్రశ్నించడం మరో హైలెట్.

'చాలా కంఫర్ట్‌గా, ఫ్రీగా ఉన్నావు కదా?'అంటూ ఆమె షెటరికల్‌గా అడగగా, అమర్‌దీప్ కూడా అదే సరదా టోన్‌లో 'అవునవును... నేను చాలా కంఫర్ట్‌గా ఉన్నాను'అని రిప్లై ఇవ్వడం ప్రేక్షకులను మరింత నవ్వించింది. దీనికి ప్రతిగా తేజస్విని 'ఇంటికి రా... అప్పుడు ఇంకా కంఫర్ట్‌గా ఉంటుంది' అంటూ ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం, అమర్‌దీప్ 'నాకు తెలుసు... నేను రానుగా' అని కౌంటర్ ఇవ్వడం స్కిట్‌కు పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా సరదా, నవ్వులు, హ్యూమర్‌తో నిండిపోయింది. ఇది పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా రూపొందించిన స్కిట్ అని స్పష్టంగా కనిపించినప్పటికీ, రమ్య మోక్ష-అమర్‌దీప్ మధ్య రొమాంటిక్ డైలాగ్స్, తేజస్విని ఎంట్రీతో వచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులకు అదిరిపోయే వినోదం అందించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X