‘ఆయనలో మ్యాటర్ నచ్చే పెళ్లికి ఒప్పుకున్నా’.. బిగ్ బాస్ బ్యూటీ వైరల్ కామెంట్స్
తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ద్వారా శుభశ్రీ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను తనకు వీలైనంత వరకు అలరించింది. ప్రతి టాస్క్ లోనూ చురుకుగా పాల్గొని ఆడియెన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ను పంచింది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక మరింత పాపులర్ అయ్యింది. అయితే ఈ బ్యూటీ తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. కాగా ఆమె భర్త గురించి శుభశ్రీ తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
శుభశ్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..
నటిగా, మోడల్ గా, యాంకర్ గా శుభశ్రీ తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్ట్స్ ల్లో మెరిసి ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. నటిగా కంటే ముందు ఆమె లాయర్ కోర్స్ కూడా పూర్తి చేసి కొన్నాళ్లు హైదరాబాద్ హైకోర్ట్ లో ప్రాక్టీస్ కూడా చేసింది. ముంబైలో పుట్టి పెరిగిన శుభశ్రీ తెలుగులో 'రుద్రవీణ', తమిళంలో 'డెవిల్' అనే చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలా కాస్తా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే క్లాసికల్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. ఇక 3000 లైవ్ షోలను హోస్ట్ చేసి ఆకట్టుకుంది. 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఓడిశా టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది.

ఘనంగా శుభశ్రీ నిశ్చితార్థం..
సోషల్ మీడియాలో తన అభిమానులకు శుభశ్రీ ఎంతగానో దగ్గరగా ఉంటుంది. తన గురించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే జూన్ 6న శుభశ్రీ రాయగురు తన పెళ్లి కబురును చెప్పింది. అంతే కాదు ఎంగేజ్ మెంట్ ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆమె ఎంగేజ్ మెంట్ ఫొటోలను నెట్టింట వైరల్ గా మార్చారు. ఇక శుభశ్రీ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ యజమాని, నిర్మాత నటుడు అజయ్ ను పెళ్లి చేసుకోబోతోంది. ఆయన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే చిత్రాన్ని నిర్మించారు. 10th క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో నటించింది. 50కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపించారు. ఇక శుభశ్రీ, అజల్ 'మెజెస్టీ ఇన్ లవ్' అనే కవర్ సాంగ్ లో నటించి దగ్గరయ్యారు. వారి పరిచయం పెళ్లి వరకు వచ్చింది. ఇక వీరి ఎంగేజ్ మెంట్ లోనే ఆ కవర్ సాంగ్ ను రిలీజ్ చేయడం విశేషం.
కాబోయే భర్తపై శుభశ్రీ కామెంట్..
తను చేసుకోబోయే భర్తలో ఏం నచ్చిందని 'మెజెస్టీ ఇన్ లవ్' కవర్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎదురైన ప్రశ్నకు శుభశ్రీ ఆసక్తికరంగా మారింది. 'ఆయనలో చాలా విషయం ఉంది. తను చాలా ఫన్నీగా ఉంటారు. నిజాయితీ గల వ్యక్తి, అతని వైబ్ నచ్చింది. మేమిద్దరం ఓకే అనుకున్నాక, ప్రముఖుల సలహాలు తీసుకొని పెళ్లికి సిద్ధమయ్యాం' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











