‘డబ్బుల కోసం పెళ్లి చేసుకోవడం లేదు.. నాకు కాబోయే మొగుడు నల్లగా ఉంటే మీకేంటీ’

పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా శుభశ్రీ రాయగురు తెలుగు ప్రేక్షకుల్లో ఫేమ్ దక్కించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో అన్ని టాస్కుల్లో తనదైన శైలిలో పార్టిసీపేట్ చేసింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు తనవంతుగా ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. అంతకు ముందే పలు సీరియల్స్, సినిమాలతో బుల్లితెర వెండితెరపై మెరిసింది. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గానే శుభశ్రీ రాయగురు నిర్మాతతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆమెకు కాబోయే భర్తపై, తనపైనా కొన్ని పుకార్లు వచ్చాయి. వాటిపై తాజాగా శుభశ్రీ రాయగురు స్పందించింది. విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

కిస్సిక్ టాక్స్ షోలో శుభశ్రీ రాయగురు..
జబర్దస్త్ కామెడీ షోతో అలరించిన వర్ష ప్రస్తుతం బిగ్ టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న కిస్సిక్ టాక్స్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. కొద్ది రోజులుగా ఈ షోకు సినీ, టెలివిజన్ సెలబ్రెటీలను ఆహ్వానిస్తూ ఇంటర్వ్యూలు చేస్తోంది. వారి గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అడుగుతూ ఆసక్తికరమైన సమాధానాలను రాబడుతోంది. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ కు బిగ్ బాస్ ఫేమ్ శుభ్రశ్రీ రాయగురు హాజరైంది. ఈ సందర్భంగా వర్ష శుభశ్రీని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రశ్నించింది. సమాధానాలను రాబట్టింది. వర్ష ప్రశ్నలకు శుభశ్రీ కూడా సూటిగా బదులిచ్చింది. తన ఎంగేజ్ మెంట్ తర్వాత డబ్బుల కోసమే అతన్ని పెళ్లి చేసుకుంటుందని, మరోవైపు తన భర్త తనకు సరిగా సెట్ కాలేదంటూ చాలా ట్రోల్స్ వచ్చాయని శుభశ్రీని వర్ష ప్రశ్నించింది. దాని స్పందనను కోరింది.

Bigg Boss Subhasree Reacted on trolls about her Hubby and Fake Rumours

శుభశ్రీ ఘాటు రిప్లై..
తన ఎంగేజ్ మెంట్ తర్వాత వచ్చిన ట్రోల్స్, కామెంట్లకు చాలా బాధ కలిగిందని శుభశ్రీ తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ.. నాకు కాబోయే భర్తపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. అతను డార్క్ కలర్ ఉన్నారని అన్నారు. అస్సలు నేను ఎవరిని లైఫ్ పార్ట్ నర్ గా నిర్ణయించుకోవాలో చెప్పడానికి మీరు ఎవరు. మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి. ఇక డబ్బుల కోసం పెళ్లి అంటూ బుద్ధిలేకుండా మాట్లాడారు. అది అవాస్తవం. ముందు నాకు అతనే ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత పెళ్లి ఒప్పుకున్నాను. ఇక సినిమాల్లో పెళ్లి తర్వాత కూడా నటిస్తాను. కానీ షరతులుంటాయి.. అని చెప్పుకొచ్చింది.

అతనితో గ్రాండ్ గా శుభశ్రీ ఎంగేజ్ మెంట్..
జూన్ 6న శుభశ్రీ రాయగురు తన ఎంగేజ్ మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ యజమాని, నిర్మాత నటుడు అజయ్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఈ క్రమంలో ఈనెల మొదటి వారంలో నిశ్చితార్థం చేసుకుంది. ఇక అతను అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, 10th క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో నటించారు. 50కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ లో మెరిశాడు. శుభశ్రీ, అజల్ 'మెజెస్టీ ఇన్ లవ్' అనే కవర్ సాంగ్ లో కలిసి నటించడం విశేషం.

శుభశ్రీ సినిమాలు, ఇంట్రెస్టింగ్ వివరాలు..
నటిగా, మోడల్ గా, యాంకర్ గా శుభశ్రీ ఆయా ప్రాజెక్ట్స్ ల్లో మెరిసి ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. నటిగా కంటే ముందు ఆమె లాయర్ కోర్స్ పూర్తి చేసింది. కొన్నాళ్లు హైదరాబాద్ హైకోర్ట్ లో ప్రాక్టీస్ కూడా చేయడం విశేషం. ముంబైకి చెందిన శుభశ్రీ తెలుగులో 'రుద్రవీణ', తమిళంలో 'డెవిల్' అనే చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక 3000 లైవ్ షోలను హోస్ట్ చేసి ఆకట్టుకోవడం విశేషం. 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఓడిశా టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X