బిగ్ బాస్ నుంచి మరో సర్‌ప్రైజ్: ఈ వారం ఎలిమినేషన్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు.!

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలు రోజుల్లో కంటే శని, ఆదివారాల్లో ఈ షోకు విశేషమైన రెస్పాన్స్ వస్తుంటుంది. దీనికి కారణం ఆ రెండు రోజులు హోస్ట్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఎలిమినేషన్ జరుగుతుండడమే. అంతేకాదు, ఒక్కోసారి ఏదో ఒక ఊహించని పరిణామం కూడా కనిపిస్తుంటుంది. అచ్చం అలాగే ఈ వారం బిగ్ బాస్ నుంచి సర్‌ప్రైజ్ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అలాగే, ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు ప్లాన్ చేశారని తెలిసింది. ఆ ఆసక్తికర విషయాలు మీకోసం.!

అన్నీ కొత్తగానే.. అందుకే ఆ రెస్పాన్స్

అన్నీ కొత్తగానే.. అందుకే ఆ రెస్పాన్స్

తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే, ఈ సీజన్లు అన్నింటిలోనూ ఒకే రకమైన కంటెంట్ వల్ల కొత్తదనం లోపించిందన్న ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగో సీజన్‌ విషయంలో బిగ్ బాస్ యూనిట్ అన్నీ కొత్తగా ఉండేటట్లు చూసుకుంది. ఫలితంగా రెస్పాన్స్ అందుకుంటోంది.

 ఒకే రకమైన రేటింగుతో సాగిపోతోంది

ఒకే రకమైన రేటింగుతో సాగిపోతోంది

బిగ్ బాస్ షో అంటే ఒకే రకమైన రెస్పాన్స్ ఉంటుందని చెప్పలేం. పరిస్థితులను బట్టి.. షో నడిచే విధానాన్ని బట్టి అది మారుతూ వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సీజన్‌లోనూ అదే తరహా ఫలితాలు కనిపించాయి. అయితే, ఈ సీజన్‌లో మాత్రం సగటున ఒకే రకమైన రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోందీ షో. ఫలితంగా అన్నింట్లో నాలుగో సీజన్‌కే ఎక్కువ గుర్తింపు వస్తుంది.

ఆ విషయంలోనూ రికార్డులు బద్దలు

ఆ విషయంలోనూ రికార్డులు బద్దలు

బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా నడుస్తుంది. అందులో మంచి ఆడే కంటెస్టెంట్లు ప్రేక్షకుల ఓటింగ్‌తో విజేతలుగా నిలుస్తారు. అలా ఓటింగ్ అనేది షోలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ విషయంలో కూడా బిగ్ బాస్ నాలుగో సీజన్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రతి వారం అత్యధిక ఓటింగ్ నమోదు చేయడం ద్వారా ఈ ఘనతను అందుకుందీ రియాలిటీ షో.

ప్రయోగాలకు సిద్ధమైన బిగ్ బాస్ టీం

ప్రయోగాలకు సిద్ధమైన బిగ్ బాస్ టీం

నాలుగో సీజన్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తుండడంతో బిగ్ బాస్ యూనిట్ సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే టాస్కుల్లో వైవిధ్యాన్ని చూపించిన నిర్వహకులు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, మిడ్ వీకెండ్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ ఎంట్రీ సహా కొన్ని కొత్త ప్రయత్నాలు చేశారు. వీటిలో చాలా వరకు సక్సెస్ అవడంతో షో దూసుకుపోతోంది.

బిగ్ బాస్ షో నుంచి మరో సర్‌ప్రైజ్ రెడీ

బిగ్ బాస్ షో నుంచి మరో సర్‌ప్రైజ్ రెడీ

ఇప్పటికే ఎన్నో సరికొత్త అంశాలతో బిగ్ బాస్ షోకు వన్నె తీసుకు వచ్చారు నిర్వహకులు. ఈ క్రమంలోనే వీకెండ్ ఎపిసోడ్లను మరింత కొత్తగా రూపొందిస్తున్నారు. అందుకే వారాంతంలో వచ్చే రెండు ఎపిసోడ్లకు అత్యధిక స్థాయిలో రేటింగ్ నమోదవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 11వ వారం ముగింపు సమయంలో సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారని తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.

Recommended Video

Varsha Bollamma Chit Chat About Middle Class Melodies Movie
ఎలిమినేషన్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు

ఎలిమినేషన్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు

11వ వారానికి సంబంధించి నామినేట్ అయిన వారిలో ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఎలిమినేట్ అయిన ఓ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. మరోవైపు, ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఎలిమినేషన్ ఉంటే రీఎంట్రీ కూడా ఉంటుందని, లేకపోతే ఉండదని విశ్వసనీయంగా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X