Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ట్విస్ట్.. ఆ కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. అందుకే నిర్వహకులు వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వెళ్తున్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ సీజన్‌లో ఎన్నో ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. దీనికితోడు కొత్త కొత్త టాస్కులతో మజాను పంచుతున్నారు. ఈ నేపథ్యంలో పవర్ అస్త్ర టాస్కులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఆ వివరాలు మీరే చూడండి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పటికే రెండు వారాలు పూర్తవగా సందీప్, శివాజి మాత్రం పవర్ అస్త్రాలను సాధించి కన్ఫార్మ్ అయిన కంటెస్టెంట్లుగా నిలిచారు. ఈ క్రమంలోనే మూడో వారానికి సంబంధించి పవర్ అస్త్ర కోసం అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను బిగ్ బాస్ ఎంపిక చేయగా.. తమ అభ్యర్థిత్వం ఖరారు చేసుకునేందుకు వాళ్లంతా కొన్ని టాస్కులు ఆడారు.

Bigg Boss Surprise Twist In Power Astra Contender Selection

పవర్ అస్త్ర పోటీదారులుగా అవడం కోసం మొదటి యావర్ తన చాలెంజర్లతో టాస్క్ ఆడి విజయం సాధించాడు. ఇక, నిన్న జరిగిన ఎపిసోడ్‌లో శోభా శెట్టి కూడా తన ప్రత్యర్థులతో కలిసి టాస్క్ ఆడి గెలిచింది. అయితే, మరో పోటీదారుడు అమర్‌దీప్ చౌదరి మాత్రం గుండు చేయించుకునే టాస్క్‌ను చేయనని చెప్పి తప్పుకున్నాడు. దీంతో ప్రియాంక జైన్ పోటీదారుగా ఎంపికైంది.

మూడో పవర్ అస్త్ర కోసం చివరికి ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ పోటీదారులుగా నిలిచారు. వీళ్ల మధ్య పోటీ పెట్టి ఒకరిని విజేతగా ప్రకటించబోతున్నారు. ఇక, ఈ టాస్కుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ముగ్గురు పోటీదారుల్లో మెజారిటీ సభ్యులు కలిసి ఒక వీక్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.

Bigg Boss Surprise Twist In Power Astra Contender Selection

బిగ్ బాస్ ఆదేశం ప్రకారం.. మొదట శోభా శెట్టి.. యావర్‌ను ఈ టాస్కు నుంచి ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయింది. దీంతో వీళ్లిద్దరి మధ్యన గొడవ జరిగింది. ఆ తర్వాత అతడు ప్రియాంకకు చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకున్నాడు. అయినా ఆమె కూడా యావర్‌ పేరునే చెప్పింది. దీంతో అతడు ఆమెతో కూడా గొడవ పడ్డాడు. ఆ తర్వాత సందీప్‌తో సైతం వాగ్వాదానికి దిగాడు.

ఇలా పలు గొడవల తర్వాత ప్రిన్స్ యావర్ తన బొమ్మను తానే పగలగొట్టుకుని ఈ టాస్క్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో పవర్ అస్త్ర తుది రౌండ్‌కు ప్రియాంక జైన్, శోభా శెట్టి వచ్చారు. ఇక, ఈ ప్రోమోను చూసిన వాళ్లంతా ప్రిన్స్‌కు అన్యాయం జరిగిందని కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో శోభ, ప్రియాంకతో పాటు సంచాలక్ సందీప్‌నూ విమర్శిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X