Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్ బాస్ షోలో ఏమిటీ చండాలం: లేడీ కంటెస్టెంట్స్ లిప్ కిస్సులపై అభ్యంతరాలు!
Recommended Video
తెలుగులో మాదిరిగానే... తమిళంలో కూడా ఇపుడు బిగ్ బాస్ సీజన్ 2 రన్ అవుతోంది. కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో మొదటి నుండి వివాదాలకు కేంద్ర బింధువుగా ఉంది. తాజాగా బిగ్ బాస్ ఇంట్లో జరిగిన లిప్ కిస్సుల వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనం అయింది. అది కూడా ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ మధ్య జరుగడంతో బిగ్ బాస్ షోలో ఈ చండాలం ఏమిటీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మసాలా పెంచి టీఆర్పీ రేటింగులు పెంచుకోవడమే లక్ష్యంగా ఈ రియాల్టీ షో సాగుతుందని అంటున్నారు.
జననీ అయ్యార్, ఐశ్వర్య దత్త లిప్ టు లిప్ ముద్దులు
బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు పూర్తి చేయడంలో భాగంగా పోటీ దారులు ఎలాంటి పనులు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ గెలుపే ముఖ్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల తమిళ బిగ్ బాస్ 2లో జననీ అయ్యార్, ఐశ్వర్య దత్త లిప్ టు లిప్ ముద్దులు పెట్టుకుని సంచలనానికి తెరలేపారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బిగ్ బాస్ మీద విమర్శలు
అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల ప్రకారమే వాళ్లు ఈ చర్యకు పాల్పడటంతో చాలా మంది ఇలాంటి నీచమైన టాస్కులు ఇస్తున్న బిగ్ బాస్ మీద మండి పడుతున్నాయి. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెబుతున్న కొన్ని పనులు ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతూ ఆనందం కలిగిస్తుండగా, కొన్ని టాస్కులు మాత్రం ఏవగింపుగా అనిపిస్తున్నాయి.
ముంతాజ్ డైపర్లు
ఇటీవల తమిళ బిగ్ బాస్ ఇంట్లో ముంతాజ్ వ్యవహారం కూడా విమర్శలకు దారి తీసింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా ఆమె డైపర్లు వేసుకుని తిరగడం ప్రేక్షకులు ఇబ్బంది పడేలా చేసిందని చెప్పక తప్పదు.
తెలుగులోనూ ఇలాంటివి
ఇటీవల తెలుగులో కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు వివాదాస్పదం అయ్యాయి. కంటెస్టెంట్లు గాయపడేలా, రక్తం కారేలా పెట్టిన పోటీలపై బాబు గోగినేని ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రారా బిగ్ బాస్ అంటూ బండ బూతులు తిట్టారు.