బిగ్ బాస్ షోలో... ఈ సారి స్వలింగ సంపర్కుడు? ఆయన సూచన మేరకే నిర్ణయం?

హిందీలో మొదలైన బిగ్ బాస్ రియాల్టీ షోకు మంచి పాపులారిటీ రావడంతో దీన్ని ఇతర ఇండియన్ బాషల్లోనూ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ షోలో వివిధ వయసుల వారు, భిన్నమైన మనస్తత్వం కలిగిన వారు భాగమై ఉంటారు. షోను రక్తి కట్టించడానికి పలు ఆసక్తికర మార్పులు చేస్తూ వస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే లెస్పియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్ జెండర్స్(ఎల్.జి.బి.టి.క్యూ) కమ్యూనిటీకి చెందిన వారికి సైతం ఇందులో చోటు కల్పిస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' షోలో కూడా ఇపుడు ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంటర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రాగానే త్వరలో ప్రారంభం కాబోయే సీజన్ 3పై హైప్ ఒక్కసారిగా పెరిగింది.

కమల్ హాసన్ సూచన మేరకే..?

కమల్ హాసన్ సూచన మేరకే..?

‘బిగ్ బాస్' రియాల్టీ షో కేవలం ఎంటర్టెన్మెంట్ మాత్రమే కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలనే ఉద్దేశ్యంతో కమల్ హాసన్ సూచన మేరకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ షోలో అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తున్నామనే సందేశం ప్రజల్లోకి పంపడంలో భాగంగానే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారట.

ప్రజల్లో తమ పట్ల ఉన్న వ్యతిరేకత తొలగించేందుకే...

ప్రజల్లో తమ పట్ల ఉన్న వ్యతిరేకత తొలగించేందుకే...

లెస్పియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్ జెండర్స్ మీద ప్రజల్లో ఎన్నో తప్పుడు భావాలు, అపోహలు ఉన్నాయి. బిగ్ బాస్ షో ద్వారా ప్రజల్లో తమ పట్ల నెలకొన్న అపోహలను తొలగించడానికి సదరు కంటెస్టెంట్ ప్రయత్నం చేయబోతున్నారట. అయితే ఈ షోకు వస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

ఇతర భాషల్లో ఇప్పటికే...

ఇతర భాషల్లో ఇప్పటికే...

హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్లో ఇప్పటికే కొందరు ఎల్.జి.బి.టి.క్యూ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కంటెస్టెంటుగా ఉన్నారు. బిగ్ బాస్ హిందీ షోలో తొలిసారిగా బాబీ డార్లింగ్ అనే ట్రాన్స్ జెండర్ పాల్గొన్నారు. ఆ తర్వాత కన్నడ, మలయాళంలో కూడా ఈ కమ్యూనిటీ నుంచి కంటెస్టెంట్లు ఎంపికయ్యారు.

ఎల్.జి.బి.టి.క్యూ కమ్యూనిటీ నుంచి బిగ్ బాస్‌లో ఇప్పటి వరకు...

ఎల్.జి.బి.టి.క్యూ కమ్యూనిటీ నుంచి బిగ్ బాస్‌లో ఇప్పటి వరకు...

ఎల్.జి.బి.టి.క్యూ కమ్యూనిటీ నుంచి హిందీ బిగ్ బాస్ సీజన్ 3లో రోహత్ వర్మ, సీజన్ 5లో లక్ష్మీ నారాయణ త్రిపాఠి, సీజన్ 6లో ఇమ్మాన్ సిద్ధిఖీ, సీజన్ 7లొ వివేక్ మిశ్రా, విజె ఆండీ, సీజన్ 8లో సుశాంత్ దగ్వికర్ తదితరులు పాల్గొనగా....కన్నడ బిగ్ బాస్ 6వ సీజన్లో ఆడం పాషా, మళయాలం సీజన్ 1లో అంజలి అమీర్ భాగం అయ్యారు.

కమల్ హాసన్ షోలో పాల్గొనేది ఎవరు?

కమల్ హాసన్ షోలో పాల్గొనేది ఎవరు?

కమల్ హాసన్ హోస్ట్ చేయబోతున్న ‘బిగ్ బాస్ సీజన్ 3'లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు? అనే విషయంలో రకరకాలు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రసన్న, జంగిరిర్ మధుమిత, పవర్ స్టార్ శ్రీనివాసన్, సంజన సింగ్, కోవై సరళ, ఆల్య మానస, రచిత మహాలక్ష్మి, యూట్యూబర్ హరి ఆర్ భాస్కర్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X