For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్ను ఇలాగే పెంచానా?: కూతురు ప్రేమాయణంపై బిగ్‍‌బాస్ షోలో తండ్రి రచ్చ రచ్చ!

|
కూతురు ప్రేమాయణంపై బిగ్‍‌బాస్ షోలో తండ్రి రచ్చ రచ్చ!

బిగ్ బాస్ తమిళ 3 షో మోస్ట్ ఎమోషనల్ స్టేజికి చేరుకుంది. కంటెస్టెంట్లను కలవడానికి వారి కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రావడంతో వారు భావోద్వేగానికి గురవుతున్నారు. చాలా కాలం తర్వాత తమ వారిని చూడటంతో ఆయా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వారిని హగ్ చేసుకుని, ఇంతకాలం ఎంత మిస్ అవుతున్నామో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమిళ బిగ్ బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంటుగా ఉంటూ తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న లోస్లియా మాత్రం తన తండ్రి ప్రవర్తన వల్ల డిసప్పాయింట్ అయింది. తండ్రి చేసిన పనికి ఏడ్చేసింది.

లోస్లియా, కెవిన్ ప్రేమాయణం

లోస్లియా, కెవిన్ ప్రేమాయణం

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా ఉన్న లోస్లియా, కెవిన్ రిలేషన్‌షిప్ కొంతకాలంగా హాట్ టాపిక్ అవుతోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పలు సందర్భాల్లో హోస్ట్ కమల్ హాసన్ కూడా వ్యాఖ్యానించారు. తమ విషయంలో ఇంట్లో వారు ఎలా రియాక్ట్ అవుతారో అంటూ... ఈ జంట కూడా పలు సందర్భాల్లో చర్చించుకున్నారు.

నిన్ను ఇలాగే పెంచానా?

నిన్ను ఇలాగే పెంచానా?

తన కూతురును కలవడానికి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన లోస్లియా ఫాదర్... ఆమెను తిట్టడం ప్రారంభించారు. నిన్ను ఇలాగేనా పెంచింది? అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో నాన్న వచ్చాడనే ఆనందం ఆమె మొహంలో ఎంతోసేపు మిగలలేదు. తండ్రి తనను అలా తిడుతుండటంతో లోస్లియా ఏడ్చేసింది.

నెటిజన్ల మద్దతు

నెటిజన్ల మద్దతు

అయితే, లోస్లియా అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు మద్దతుగా నిలిచారు. తన 23 ఏళ్ల కూతురుతో లోస్లియా తండ్రి ప్రవర్తించిన తీరు బాగోలేదని, ఆమెను అవమానించే విధంగా, బాధ పెట్టే విధంగా మాట్లాడటం సరికాదు అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

గర్వపడాల్సింది పోయి ఇలా చేస్తాడా?

గర్వపడాల్సింది పోయి ఇలా చేస్తాడా?

ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం వల్లే తన కుమార్తె ఇప్పటివరకు షోలో నెగ్గుకురాగలిగింది, ఆమె టాలెంటును చూసి అతను గర్వపడాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఇలా చేయడం ఏమీ బాగోలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కమల్ హాసన్, చేరన్ తీరుపై విమర్శలు

కమల్ హాసన్, చేరన్ తీరుపై విమర్శలు

మరికొందరు ఈ విషయంలో చేరన్, కమల్ హాసన్‌ తీరును తప్పుబడుతూ ట్వీట్ చేస్తున్నారు. వారిద్దరూ... లోస్లియా-కెవిన్ రిలేషన్‌షిప్‌ను హైలెట్ చేయడం, దాన్ని సెన్సేషనల్ చేసే ప్రయత్నం చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందిన అంటున్నారు.

లోస్లియా అక్క అందుకే ఆత్మహత్య చేసుకుంది

ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ట్రాకర్, రమేష్ బాలా కూడా తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో వెల్లడించారు. లోస్లియా తల్లి కారణంగానే తన అక్క ఆత్మహత్య చేసుకుందని ఆయన అన్నారు. మీరు ప్రేమించే వ్యక్తుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తే తర్వాత జీవితాంతం భాధ పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు.

English summary
Losliya and Kavin's relationship in the Bigg Boss Tamil 3 show have been making news and the two have often spoken about how it might affect their families. Losliya's father started scolding her and asked if this is how she was raised. While Losliya was initially happy seeing her father, she was left with a rather sad memory.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more