ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సంయుక్త... స్టార్ క్రికెటర్‌తో సెలైంట్‌గా మూడు ముళ్లు

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. ఒకరి తర్వాత మరొకరు సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కుతున్నారు. పలువురు నటీనటులు తమ ప్రేమను పండించుకుని పెళ్లితో ఒక్కటవుతున్నారు. మరికొందరు రెండో పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇంకొందరైతే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఫోటోలు, వీడియోలతో షాకిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సైలెంట్‌గా పెళ్లి చేసుకుని బాంబు పేల్చింది. ఈ వివరాల్లోకి వెళితే...

మోడల్ నుంచి నటిగా
తమిళనాడుకు చెందిన సంయుక్త షణ్ముగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోడల్‌గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన సంయుక్త ఇన్ఫోసిస్‌లో జాబ్ చేశారు. మోడలింగ్‌లోకి దిగిన సంయుక్త 2007లో మిస్ చెన్నై పోటీలలో విజయం సాధించి పలు టాప్ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇందులేఖ హెయిర్ ఆయిల్, హ్యాపీ యూనికాన్, సేఫ్ వాష్ తదితర బ్రాండ్స్‌ను ప్రమోట్ చేశారు. ఈ దశలో తమిళ్ బిగ్‌బాస్ 4లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. వరిసు, మై డియర్ భూతం, కారీ, తుగ్లమ్ దర్బార్ తదితర సినిమాలలో నటించారు.

Bigg Boss Tamil 4 fame Samyuktha Shanmughanathan knot tied with Aniruddha Srikanth

సంయుక్త మల్టీ టాలెంటెడ్
ఇంజనీర్, నటి, మోడల్ మాత్రమే కాదు... సంయుక్త సర్టిఫైడ్ ఫిట్‌నెస్ కోచ్ కూడా. ఆమెలో క్లాసికల్ డ్యాన్సర్.. జుంబా డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, యోగా కూడా నేర్చుకున్నారు. 2020లో మోడల్‌గా అవార్డ్ అందుకున్నారు. గతంలో కార్తీక్ శంకర్ అనే వ్యక్తిని సంయుక్త పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే వీరి కాపురం సజావుగా సాగుతున్న దశలో శంకర్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న సంయుక్త అతనికి విడాకులు ఇచ్చింది. నాటి నుంచి ఒంటరిగా ఉంటూనే తన కొడుకు బాధ్యతలు తీసుకున్నారు సంయుక్త.

అనిరుధ్ శ్రీకాంత్‌తో ప్రేమాయణం
ఈ దశలో భారత దిగ్గజ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు అనిరుధ్ శ్రీకాంత్‌తో సంయుక్త కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తండ్రి బాటలోనే క్రికెటర్‌గా మారిన అనిరుధ్ తొలుత తమిళనాడు జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఈ దశలో ఐపీఎల్ అతనికి ఓ అవకాశం ఇచ్చింది. 2008 నుంచి 2013 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు అనిరుధ్ ప్రాతినిధ్యం వహించారు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ప్రాతినిథ్యం వహించాడు. అయితే తర్వాత ఏం జరిగిందో కానీ క్రికెట్‌కు నెమ్మదిగా దూరమయ్యాడు. 2012లో ప్రముఖ మోడల్ ఆర్తి వెంకటేష్‌ని వివాహం చేసుకున్నాడు అనిరుధ్. అయితే పెళ్లయిన రెండేళ్లకే మనస్పర్ధలు రావడంతో ఈ దంపతులు విడిపోయారు.

కొడుకే పెళ్లి పెద్ద
ఈ నేపథ్యంలో అనిరుధ్ - సంయుక్తల మధ్య ప్రేమ చిగురించిందని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇటీవల దీపావళి సందర్భంగా ఇద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో వీరి బంధానికి బలం చేకూరినట్లయ్యింది. త్వరలోనే వీరి పెళ్లి జరుగుతుందన్న ఊహాగానాలకు అనిరుథ్ - సంయుక్తలు తెరదించారు. నవంబర్ 27న సంయుక్త మెడలో మూడు ముళ్లు వేశాడు అనిరుధ్. చెన్నైలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో సంయుక్త కుమారుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: bigg boss tamil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X