Bigg Boss Tamil 7: మొదలైన తమిళ సీజన్.. ఏకంగా అంత మంది ఎంట్రీ.. అక్కడ కాన్సెప్టు ఏంటో తెలుసా?
రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఉత్తరాది వాళ్లకు ఎప్పుడో పరిచయం అయినా.. దక్షిణాదిలోకి మాత్రం ఆలస్యంగానే వచ్చింది. ఇలా ఏడేళ్ల క్రితం తమిళ బుల్లితెరపైకి సైతం ఈ షో వచ్చేసింది. మిగిలిన భాషలతో పోలిస్తే అక్కడ మాత్రం దీనికి వ్యతిరేకత చాలానే వచ్చింది. అయినప్పటికీ ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని మొదలెట్టారు. ఈ సీజన్ కంటెస్టెంట్లు, కాన్సెప్టు తదితర అంశాలను మీరే చూడండి!
తెలుగు తర్వాత టాప్:బిగ్ బాస్ షో చాలా అనుమానాల మధ్య తమిళ బుల్లితెరపైకి పరిచయం అయింది. అసలు ఇలాంటి వాటిని అక్కడి వాళ్లు ఎంకరేజ్ చేస్తారా? ఇక్కడ ఇది క్లిక్ అవుతుందా? ఇలా అనుకుంటోన్న పరిస్థితుల్లో ఈ షోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఆరు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. వీటికి తెలుగు తర్వాత అత్యధిక టీఆర్పీ రేటింగ్ కూడా సొంతం అయింది.

అంగరంగ వైభవంగా:తమిళంలో ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు షో నిర్వహకులు ఏడో దాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 1వ తేదీన ప్రీమియర్ ఎపిసోడ్ ద్వారా దీన్ని ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇందులో కంటెస్టెంట్లు ఆటపాటలతో అలరించారు. ముఖ్యంగా ఇందులో కమల్ హాసన్ తనదైన స్టైలిష్ హోస్టింగ్‌తో ఆకట్టుకున్నారు.

అలాంటి కాన్సెప్టుతో:తెలుగులో బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు మొదలైన తమిళ 7 సీజన్ మాత్రం 'రెండుల ఒన్ను పాకలం' అంటే 'డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే కాన్సెప్టుతో ప్రారంభం అయింది. తద్వారా గతంలో కంటే విభిన్నంగా ఒకేసారి రెండు రకలా వినోదాన్ని పంచేలా దీన్ని నడిపించబోతున్నారని చెప్పారు.

పొంగల్‌కే ఫినాలేతో:బిగ్ బాస్ తమిళం ఏడో సీజన్‌ను అక్టోబర్ 1న ప్రారంభించారు. దీన్ని మొత్తంగా 15 వారాల పాటు నడపబోతున్నట్లు ప్రీమియర్ ఎపిసోడ్‌లో హోస్ట్ కమల్ హాసన్ చెప్పారు. దీని ప్రకారం.. ఈ సీజన్ జనవరి 14వ తేదీకి పూర్తవబోతుంది. అంటే పొంగల్ రోజే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరిగే అవకాశం ఉంది. ఇక, ఈ సీజన్‌లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపించబోతున్నారు.

18 మంది వచ్చారు:బిగ్ బాస్ తమిళం ఏడో సీజన్‌లోకి నటుడు కూల్ సురేష్, యూట్యూబర్ పూర్ణిమ రవి, నటి రవీనా దాహా, నటుడు ప్రదీప్ ఆంటోనీ, ర్యాపర్ నిక్సన్, నటి వినూషా దేవి, డ్యాన్సర్ మణిచంద్ర, నటి అక్షయ, సినిమాటెక్ జోవికా విజయ్‌కుమార్, డ్యాన్సర్ ఐషు, నటుడు విష్ణు, నటి మాయ, నటుడు శరవణన్, సింగర్ యుగేంద్రన్, నటి విచిత్ర, రైటర్ బావ చల్లదురై, యాంకర్ అనన్య, డ్యాన్సర్ విజయ్ వర్మలు ఎంట్రీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











