Bigg Boss Tamil 7 షోలో ముగ్గురు టాలీవుడ్ యాక్టర్స్.. పవన్ కల్యాణ్ హీరోయిన్ ఎంట్రీ.. షో ప్రారంభం ఎప్పుడంటే

దేశవ్యాప్తంగా ప్రధాన భాషల్లో బిగ్‌బాస్ షోలు ప్రారంభమవుతున్నాయి. తెలుగు బిగ్‌బాస్ 7 సీజన్ ఇప్పటికే ప్రారంభమై నాలుగు వారాలు పూర్తి చేసుకోబొతున్నది. ఇక తమిళ బిగ్‌బాస్ 7 ప్రారంభానికి రంగం సిద్దమైంది. విలక్షణ నటుడు, ఇండియన్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ హోస్ట్‌గా ఈ షో ప్రారంభం కానున్నది. ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్లు ఎవరు? తమిళ బిగ్‌బాస్ ఏ రోజు ప్రారంభం కాబోతున్నదనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తమిళ్ 7 షోకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల రిలీజైన ప్రోమోలు రియాలిటీ షోపై క్రేజ్ పెంచాయి. ఇప్పటి వరకు జరిగిన సీజన్లకు భిన్నంగా తమిళ బిగ్‌బాస్‌లో రెండు హౌస్‌లను నిర్మించారు. ఈ రెండు హౌస్‌లు ఎందుకు? ఎవరు ఉంటారు? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. అయితే రెండు ఇళ్లలో కంటెస్టెంట్లు, హౌస్‌మేట్స్‌ను ఉంచుతారనే చర్చ జరుగుతున్నది.

 Bigg Boss Tamil 7

బిగ్‌బాస్ తమిళ సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కమల్ హాసన్ తనదైన శైలిలో ఈ రియాలిటీ షోను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ షో అభిమానులకు, టెలివిజన్ ప్రేక్షకులకు కూడా కమల్ హాసన్ మరింత ఫేవరేట్‌గా మారిపోయారు. ఈ షోను కమల్ తప్ప మరొకరు చేయలేరనే స్థాయికి ఈ షోను తీసుకెళ్లారు.

 Bigg Boss Tamil 7

ఇక తమిళ బిగ్‌బాస్ 7 షోలో కంటెస్టెంట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ షోలోకి
1. బబ్లూ పృథ్వీరాజ్
2. కూకు విత్ కోమలి ఫేమ్ విచిత్ర
3. రోషిణి హరిప్రియణ్
4. రవీనా దహా
5. టీవీ నటి నివిషా
6. బాలసుబ్రమణ్యం
7. శ్రీదేవీ విజయ్ కుమార్
8. యుథన్ బాలాజీ
9. యాక్టర్ విష్ణు
10. రచిత భర్త, టీవీ యాక్టర్ దినేష్
11. మూన్ నీలా
12. డ్యాన్సర్ విజయ్ వర్మ
13. మా కా పా ఆనంద్
14. దర్షా గుప్తా
15. జాక్వలైన్
16. రక్షణ్
17. KV శరత్
18. పాండ్యన్ స్టోర్స్ ఫ్యామిలీ కథీర్
19. మీరా చోప్రా,
20. సంతోష్ ప్రతాప్

 Bigg Boss Tamil 7

తమిళ బిగ్‌బాస్ 7 షోలో తెలుగు ప్రేక్షకులకు సుపరితులైన ముగ్గురు యాక్టర్లు ఉన్నారు. అందులో బబ్లూ పృథ్వీరాజ్, శ్రీదేవీ విజయ్ కుమార్, పవన్ కల్యాణ్ సరసన బంగారం మూవీలో నటించిన మీరా చోప్రా ఉన్నారు. ఈ ముగ్గురు ఏ రేంజ్‌లో రాణిస్తారో వేచి చూడాల్సిందే.

ఇక బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7 అక్టోబర్ 1వ తేదీన ప్రారంభం కాబోతున్నది. ఈ షో విజయ్ టెలివిజన్‌లో ప్రసారం కాబోతున్నది. ఇక 24 గంటలపాటు డిస్నీ+హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తున్నది. టెలివిజన్‌లోను, డిస్నీ +హాట్ స్టార్ యాప్‌లో ప్రతీ రోజు ఎపిసోడ్‌ను 9.30 గంటలకు గంటపాటు ప్రసారం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X