బిగ్‌బాస్‌ తమిళ షోలో దారుణం.. ఇద్దరు దాడి చేయడంతో కుప్పకూలిన మహిళ కంటెస్టెంట్‌.. విజయ్ సేతుపతి సీరియస్!

బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల ప్రవర్తనపై పలు విధాలుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అత్యంత పాపులారిటీ ఉన్న షోలో సెలబ్రిటీలు వ్యవహరించే తీరు, ఒకరిపై ఒకరు శారీరకంగా, మాటల దాడి చేసుకొనే విధానంపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినా పలు భాషల్లో ప్రసారమవుతున్న షోలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తమిళ బిగ్‌బాస్ సీజన్ 9 షోలో చోటు చేసుకొన్న సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా కంటెస్టెంట్‌తో మరో ఇద్దరు కంటెస్టెంట్లు వ్యవహరించి తీరు అత్యంత పాశవికంగా కనిపించింది. తమిళ బిగ్‌బాస్‌లో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తమిళ షోలోని హౌస్‌లో కారు టాస్క్ జరిగింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్లను కారులోకి ఎక్కించి ఎవరైతే చివరి వరకు కారులో ఉంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు ఒకరికొకరు తోసుకొనే ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా సండ్రా అనే మహిళా కంటెస్టెంట్‌పై పార్వతి, కమ్రుద్దీన్ దాడికి పాల్పడ్డారు. కారులో నుంచి బలవంతంగా తొసే ప్రయత్నం చేశారు. అందుకు కారు డోర్ తీసి హింసాత్మక ధోరణిలో దారుణంగా బయటకు నెట్టడం కనిపించింది.

Bigg Boss Tamil Contestant Sandra brutally attacked

అయితే సండ్రాను బయటకు నెట్టే ప్రయత్నంలో శారీరక దాడికి పాల్పడ్డారు. కాళ్లతో తన్నుతూ డోర్ తీసి బలవంతంగా తోశారు. దాంతో ఆమె కారు నుంచి కిందపడిపోయింది. ఆమెకు బలమైన గాయం కావడంతో నేలపై కుప్పకూలింది. కాళ్లు చేతులూ కొట్టుకొంటూ కనిపించింది. అయితే ఆమె పరిస్థితిని చూసిన ఇతర కంటెస్టెంట్లు ఆమెను మెడికల్ రూమ్‌కు తరలించారు. అయినా కమ్రుద్దీన్, పార్వతిలో ఏ మాత్రం పశ్చాత్తపం కనిపించకపోవడం గమనార్హం.

అయితే సండ్రాపై అత్యంత పైశాచికంగా వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘించారు. పూర్తిగా అనైతిక చర్య. వారి ప్రవర్తన దారుణంగా ఉంది. ఇలాంటి వారి ప్రవర్తన వల్ల కంటెస్టెంట్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వారిపై కఠిన చర్య తీసుకోవాలని వేల సంఖ్యలో నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి రియాలిటీ షోలపై కేంద్ర సమాచార ప్రసార శాఖ కఠినంగా వ్యవహరించాలి. కంటెస్టెంట్లను షోలోకి అనుమతించడానికి ముందే వారి ప్రవర్తన, వ్యవహరించే తీరును పూర్తిగా పరిశీలించాలి అని సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సండ్రాపై ఫిజికల్ ఎటాక్ చేసి ఆమె ప్రాణాల హానికరంగా మారిన కమ్రుద్దీన్, పార్వతిపై హోస్ట్ విజయ్ సేతుపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో నిబంధనలు అతిక్రమించడం, శారీరక దాడి, హింసకు పాల్పడిన నేపథ్యంలో ఆ ఇద్దరికి రెడ్ కార్డులు చూపిస్తూ విజయ్ సేతుపతి తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపించారా? లేక ఏదైనా శిక్ష విధిస్తారా? అనేది శనివారం ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X