Bigg Boss 9: ఇది ఎంటర్టైన్ షోనా? ఫైటింగ్ గేమా? బిగ్‌బాస్ హౌస్‌లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న కంటెస్టెంట్స్

అత్యంత పాపులర్ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) ఒకటి. రోజురోజుకూ ఈ గేమ్ షోను ఏ విధంగా అయితే క్రేజ్ పెరుగుతుందో.. అదే విధంగా కొత్త కొత్త వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వంటి అన్ని భాషల్లో ప్రసారం అవుతున్న ఈ షోకు అపారమైన అభిమానులు ఉన్నప్పటికీ, కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న గొడవలు, వాగ్వాదాలు, హింసాత్మక సన్నివేశాలు తరచూ చర్చనీయంగా మారుతున్నాయి. తాజాగా తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9లో జరిగిన సంఘటన ఒక పెద్ద వివాదానికి దారితీసింది. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభమైన నాటి నుంచి వివాదాల వేదికగా మారింది. టాస్కుల్లో, కెప్టెన్సీ కాంటెస్టుల్లో, పర్సనల్ ఈగోల్లో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు దాడి చేయడం, కేకలు వేయడం ఇప్పుడు సాధారణ విషయమే అయిపోయింది. అంతేకాకుండా ఈ రియాల్టీ షోలో అనైతిక ఘటనలు కూడా జరుగుతున్నాయని,ఈ షోను బ్యాన్ చేయాలని ఎన్నో సంస్థలు, పలువురు కేసులు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇన్ని వివాదాలు తలెత్తిన బిగ్ బాస్ షోలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి.ఇలా కొంతమంది ఆదరిస్తూ ఉంటే.. మరికొందరు మాత్రం గేమ్ షోను రద్దు చేయాలని ఫిర్యాదులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తమిళ్ బిగ్ బాస్ షోలో జరిగిన కొట్లాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bigg Boss Tamil Season 9 Turns Violent Kamarudeen and Praveen Raj Fight Video Goes Viral

విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ్ బిగ్ బాస్ షో నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోలో కమరుద్దీన్, ప్రవీణ్ రాజ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. మొదట ఇద్దరి మధ్య మాటల తగువు మొదలై, క్రమంగా అది ఫిజికల్ ఫైట్‌గా మారింది. వీడియోలో ఇద్దరూ పరస్పరం తోసుకోవడం, కుర్చీలు కదలడం, ఇతర కంటెస్టెంట్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం కనిపిస్తోంది. హౌస్‌లో అప్పుడు సీన్ పూర్తిగా హీట్‌గా మారిపోయింది. ఈ ఘర్షణను ఆపడానికి మరికొందరు కంటెస్టెంట్లు ప్రయత్నించినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసిన ప్రాంక్ వీడియో అని అంటుంటే, మరికొందరు మాత్రం చూస్తుంటే నిజంగానే ఫైట్ జరిగిందనేలా అనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. వీడియోలో కంటెస్టెంట్ల రియాక్షన్, కమరుద్దీన్ అగ్రెషన్, ప్రవీణ్ రాజ్ వైఖరి చూస్తుంటే.. ఈ సీన్ రియల్‌గా అనిపిస్తోంది. కొంతమంది నెటిజన్లు "షో రేటింగ్ తగ్గిపోవడంతో మేకర్స్ ఉద్దేశపూర్వకంగా గొడవలు క్రియేట్ చేస్తున్నారు" అని కూడా కామెంట్ చేస్తున్నారు. "ఇది రియాల్టీ షోనా? లేక ఫైటింగ్ రింగ్‌నా?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తమిళ్ బిగ్ బాస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కమల్ హాసన్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన హోస్టింగ్ గా వ్యవహరించడంతో ఈ గేమ్ షోకు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే ఈ సీజన్‌కు కమల్ హాసన్ రాకపోవడంతో, మేకర్స్ కొత్త హోస్ట్‌గా విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. నటుడిగా తన వైవిధ్యభరితమైన పాత్రలతో గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి బిగ్ బాస్ హోస్ట్‌గా తొలిసారి వ్యవహరిస్తున్నారు. అయితే.. ప్రేక్షకులలో కొంతమంది ఆయన హోస్టింగ్ స్టైల్‌పై విమర్శలు చేస్తున్నారు. "విజయ్ సేతుపతి కమల్ లాగా స్ట్రాంగ్‌గా హ్యాండిల్ చేయడం లేదు", "కంటెస్టెంట్ల గొడవల్లో ఆయన సైలెంట్‌గా ఉన్నారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కమరుద్దీన్-ప్రవీణ్ రాజ్ ఫైట్‌పై ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో విజయ్ సేతుపతి ఎలా స్పందిస్తారో అనే ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X