twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ బిగ్‌బాస్ విజేతకు చేదు అనుభవం.. వెన్నుపోటుదారు.. చీల్చి చెండాడిన నెటిజన్లు

    By Rajababu
    |

    తమిళ బిగ్‌బాస్ కార్యక్రమం సెప్టెంబర్ 30న ముగిసింది. తొలి సీజన్ విజేతగా ఆరవ్ నిలిచారు. అయితే విజేతగా నిలిచానన్న సంతోషం క్షణ కాలం కూడా లేకపోవడం గమనార్హం. ఎందుకంటే బిగ్‌బాస్ విజేతగా ఆరవ్‌ను ఎంపిక చేయడం సిగ్గు చేటు అని పలువురు విరుచుకుపడ్డారు. దాంతో ఆరవ్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలగడం జరిగింది. అత్యంత వివాదాస్పదంగా ఈ కార్యక్రమం నడిచింది. ఈ రియాలిటీ షో ముగిసినా కానీ వివాదాలు చుట్టుముట్టడంపై తమిళనాట చర్చనీయాంశమైంది.

     మొదటి నుంచి వివాదాలే

    మొదటి నుంచి వివాదాలే

    కమల్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ కార్యక్రమం ఆది నుంచి వివాదాలతోనే కొనసాగింది. ఇంటి సభ్యుడు ఆరవ్ తన ప్రత్యర్థి స్నేహన్‌పై విజయం సాధించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో అత్యంత వివాదాస్పదుడైన ఆరవ్‌కు భారీ సంఖ్యలో ఓట్లు రావడం విశేషం.

    దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు

    దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు

    తమిళ బిగ్‌బాస్‌లో దివ్యాంగులపై ఇంటి సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఓ వివాదంగా మారింది. టాస్క్‌లు చేసే క్రమంలో అంగ వైకల్యంతో బాధపడేవారి మనోభావాలు దెబ్బ తినే విధంగా కొందరు సెలబ్రిటీలు కామెంట్ చేయడంపై దుమారం చెలరేగింది.

     బిగ్‌బాస్‌ను నిషేధించండి

    బిగ్‌బాస్‌ను నిషేధించండి

    బిగ్‌బాస్ కార్యక్రమంలో తమిళ రాజకీయ పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సెలబ్రిటీలు పలువురు రాజకీయ నేతలుగా వ్యవహరిస్తూ చేసిన ఎపిసోడ్లు అత్యంత వివాదాస్పదమయ్యాయి. దాంతో ఈ షోను బ్యాన్ చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.

     బిగ్ బాస్ విజేతగా ఆరవ్

    బిగ్ బాస్ విజేతగా ఆరవ్

    ఇలా అనేక వివాదాలతో సాగిన బిగ్‌బాస్ కార్యక్రమంలో ఆరవ్ విజేతగా నిలిచారు. అయితే ఆరవ్ విజేతగా నిలువడంపై కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌లో తీవ్ర పదజాలాన్ని వాడుతూ ఆరవ్‌ను చీల్చి చెండాడారు.

     ఆరవ్‌కు శాపనార్థాలు

    ఆరవ్‌కు శాపనార్థాలు

    ఫేక్ అకౌంట్లతో ఓ చీటర్ విజేతగా నిలువవచ్చు. కానీ వాస్తవ జీవితంలో విజయం సాధించలేడు. చెత్త షోలో చెత్త మనిషి విజేతగా నిలిచాడు. ఆరవ్ విజేతగా నిలువడంతో ప్రపంచంలో ఎలాంటి మనుషులు ఉన్నారో అర్థం అవుతున్నది. మహిళలంటే గౌరవం లేని ఓ వ్యక్తి ఆరవ్. వెన్నుపోటుదారుడు, అబద్దాల కోరు లాంటి ఆరవ్ విజేతగా నిలువడం ఏమిటీ?. ఆరవ్ అందంగా ఉన్నంత మాత్రాన అమ్మాయిలు ఓట్లు వేస్తారా? అంటూ నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలే కాకుండా అనేక శాపనార్థాలు పెట్టారు.

     ఆరవ్ ఎవరు?

    ఆరవ్ ఎవరు?

    బిగ్‌బాస్ విజేతగా నిలిచిన ఆరవ్ మొదట్లో మోడల్‌గా రాణించాడు. ఆ తర్వాత విజయ్ ఆంటోని నటించిన సైతాన్ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ప్రవేశించారు. బిగ్ బాస్ తమిళ్‌తో పాపులర్‌గా మారారు. ఇప్పుడు పాపులారిటీ వచ్చినా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆరవ్ సంతోషం దక్కడం లేదు.

    English summary
    After a controversial journey on Kamal Haasan‘s Bigg Boss Tamil, Aarav beat Snehan to win the popular reality show. The model turned actor won the show by a higher number of votes. We all know that Kamal Haasan’s show was controversial with contestants making some sensitive comments, mentally challenged people being mocked and questionable tasks being conducted. Twitterati feels it was SHAMEFUL to make Aarav the winner of Kamal Haasan's Bigg Boss Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X