Bigg Boss Telugu 6: బిగ్ బాస్‌లోకి జబర్ధస్త్ బ్యూటీ.. రెండుసార్లు మిస్సైనా.. మరోసారి బంపర్ ఆఫర్
దేశంలోని చాలా భాషల్లో ఎప్పుడో ప్రారంభం అయినా.. తెలుగులోకి మాత్రం ఆలస్యంగా వచ్చినా.. ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుని సక్సెస్‌ఫుల్ షో అయిపోయింది బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు మాత్రం దీనికి ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా దేశంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో ఇది నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది.
ఈ క్రమంలోనే నిర్వహకులు ఐదు రెగ్యూలర్ సీజన్లు, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. దీనికోసం జబర్ధస్త్‌లో సందడి చేస్తోన్న ఓ భామకు బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఏకంగా ఐదు సీజన్లు పూర్తి చేశారు
'బిగ్ బ్రదర్' అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా హిందీలో 'బిగ్ బాస్' ప్రారంభం అయింది. ఆ తర్వాత దేశంలోని చాలా భాషల్లో ఇది మొదలైంది. అలా తెలుగులోకి కూడా పరిచయం అయింది. సాదాసీదా వచ్చినప్పటికీ.. తక్కువ టైమ్‌లోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ షో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సీజన్లను టాప్ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది.

ఓటీటీ సీజన్ కూడా సూపర్ హిట్
రెగ్యూలర్ బిగ్ బాస్ సూపర్ హిట్ అవడంతో నిర్వహకులు ఇటీవలే ఓటీటీ వెర్షన్ 'నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను నిర్వహించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికరమైన సన్నివేశాలను చూపించారు. ఫలితంగా దీనికి కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఇక, ఈ సీజన్‌లో లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.

ఆరో సీజన్ త్వరలోనే.. ప్రకటనతో
తెలుగు బుల్లితెర చరిత్రలోనే జనరంజకంగా సాగుతోన్న బిగ్ బాస్ షో నుంచి ఆరో సీజన్ కూడా త్వరలోనే రాబోతుంది. ఈ మేరకు నిర్వహకులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, కమింగ్ సూన్ ప్రోమోను కూడా విడుదల చేశారు. దీంతో బిగ్ బాస్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దీనిపై ఎన్నో రకాలుగా చర్చలు జరుపుతున్నారు.

అప్పటి నుంచే... కామన్ మ్యాన్‌కి
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు నిర్వహకులు అప్పుడే సెట్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేశారని అంటున్నారు. నాన్ స్టాప్ సీజన్‌లో వాడిన ఇంట్లో మార్పులు చేసి కొత్తగా నిర్మిస్తున్నారట. ఇక, ఇందులో ఓ కామన్ మ్యాన్‌కు కూడా అవకాశం కల్పిస్తోన్నట్లు ప్రకటించారు.

కంటెస్టెంట్ ఎంపిక కూడా స్టార్ట్స్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ పూర్తవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆరో సీజన్ మీద పడింది. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుండడంతో.. ఇందులో పలానా సెలెబ్రిటీ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం అయిందట.

జబర్ధస్త్ బ్యూటీకి బిగ్ బాస్ ఆఫర్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి అప్పుడే రోజుకో వార్త తెగ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. సీరియల్స్‌తో పాటు జబర్ధస్త్‌లో సందడి చేస్తోన్న బ్యూటీ వర్షను షో నిర్వహకులు తాజాగా సంప్రదించారట. అయితే, ఆమె ఇందులో చేయడానికి ఓకే చెప్పిందా? లేదా అన్నది తెలియలేదు.
అప్పుడలా మిస్సైనా.. మరో ఆఫర్
ప్రస్తుతం జబర్ధస్త్ వర్ష వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో కొన్ని సీరియళ్లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐదో సీజన్‌తో పాటు నాన్ స్టాప్ సీజన్‌లోనూ ఆమె కంటెస్టెంట్‌గా వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఆమె కూడా బిగ్ బాస్‌పై పోస్ట్ చేసింది. కానీ, అప్పుడు మిస్సైంది. మరి ఇప్పుడు ఏం చేయబోతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











