Bigg Boss Telugu 6: షోలోకి ఆ కంటెస్టెంట్ రీఎంట్రీ.. అప్పటి ఎలిమినేషన్ మరిచేలా ప్లాన్

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో వచ్చినా.. ఇక్కడి వాళ్లు దీనికి అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఇది ఐదు రెగ్యూలర్ సీజన్లను, ఒక ఓటీటీ సీజన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను మొదలు పెట్టడానికి నిర్వహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సీజన్‌ కోసం మాజీ కంటెస్టెంట్ ఒకరికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

Recommended Video

Sohel's Lucky Lakshman Movie Opening Video | Filmibeat
ఐదు సీజన్లు.. దేశంలోనే టాప్‌లో

ఐదు సీజన్లు.. దేశంలోనే టాప్‌లో


దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ రెస్పాన్స్ దక్కుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, మన దగ్గర వచ్చిన సీజన్లు ఒక దానికి మించి ఒకటి అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. ఫలితంగా నేషనల్ రికార్డులు బద్దలయ్యాయి. ఇలా ఐదేళ్లుగా తెలుగు బిగ్ బాస్ దేశంలోనే టాప్‌ ప్లేస్‌ను అందుకుంటోంది.

నాన్ స్టాప్ సీజన్‌ కూడా విజయం

నాన్ స్టాప్ సీజన్‌ కూడా విజయం

తెలుగులో బిగ్ బాస్ సూపర్ హిట్ అవడంతో నిర్వహకులు ఇటీవలే ఓటీటీ వెర్షన్ ‘నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను పరిచయం చేశారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికరమైన సంఘటలను హైలైట్ చేశారు. ఫలితంగా దీనికి కూడా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. ఇక, ఈ సీజన్‌లో లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి విజేతగా నిలిచి రికార్డును నెలకొల్పింది.

త్వరలోనే ఆరో సీజన్.. నాగ్‌తోనే

త్వరలోనే ఆరో సీజన్.. నాగ్‌తోనే

బుల్లితెర చరిత్రలోనే భారీ స్పందనను దక్కించుకుంటూ సూపర్ డూపర్ హిట్ షోగా నిలుస్తోన్న బిగ్ బాస్‌ను క్రమం తప్పుకుండా ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఆరో సీజన్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రోమోను కూడా విడుదల చేశారు. దీంతో ఈ షోను అభిమానించే వాళ్లంతా యమ హ్యాపీగా ఉన్నారు.

సీజన్ వివరాలు... ఈసారి ఒకరు

సీజన్ వివరాలు... ఈసారి ఒకరు

బిగ్ బాస్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆరో సీజన్ వచ్చే సెప్టెంబర్ నుంచి మొదలు కాబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన సెట్ వర్క్‌ను కూడా ప్రారంభించారని అంటున్నారు. అంతేకాదు, ఇందులోకి ఒక కామన్ మ్యాన్‌ను తీసుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన కాంటెస్ట్ కూడా దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది.

కంటెస్టెంట్ల కోసం చర్చలు చేసి

కంటెస్టెంట్ల కోసం చర్చలు చేసి


బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు బుల్లితెర, వెండితెరపై సందడి చేస్తోన్న కొందరు సెలెబ్రిటీలతో నిర్వహకులు చర్చలు కూడా మొదలు పెట్టేశారని అంటున్నారు. అలాగే, నాన్ స్టాప్ సీజన్‌లోని కొందరు కంటెస్టెంట్లను కూడా తీసుకోబోతున్నారని టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

మాజీ కంటెస్టెంట్‌కు మరో ఛాన్స్

మాజీ కంటెస్టెంట్‌కు మరో ఛాన్స్

బిగ్ బాస్ ఆరో సీజన్ ఆరంభానికి మరో మూడు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి అప్పుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఆర్జే చైతూను తీసుకుంటున్నారని తెలిసింది. ఇతగాడు ఈ మధ్యనే ముగిసిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

ఆ ఎలిమినేషన్ మరిపించేలానే

ఆ ఎలిమినేషన్ మరిపించేలానే


బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఆర్జే చైతూ టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగాడు. అయితే, ఊహించని విధంగా అతడు మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ షోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పుడు ఆ చెడ్డపేరును పోగొట్టుకునే ప్లాన్‌లో భాగంగానే చైతూకు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నారని ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X