Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి ఫేమస్ హీరో.. అప్పట్లో జైలు జీవితం.. ఇప్పుడు బంపర్ ఆఫర్

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులోకి ఇది పరిచయమైన వెంటనే ఎవరూ ఊహించని విధంగా రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా దేశంలో ఏ షోకూ రాని రీతిలో రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదింటిని విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను మొదలెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే మరో కంటెస్టెంట్ పేరు బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా సెలెబ్రిటీ? ఆ వివరాలను మీరే చూడండి!

ఆరో సీజన్‌ను రంగం సిద్ధంగానే

ఆరో సీజన్‌ను రంగం సిద్ధంగానే

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ప్రేక్షకులు అందించిన భారీ రెస్పాన్స్‌తో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా పూర్తి చేశారు. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఆరో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది.

అప్పటి నుంచే.. ఆ కంటెస్టెంట్

అప్పటి నుంచే.. ఆ కంటెస్టెంట్

బిగ్ బాస్ ఆరో సీజన్ ఎప్పుటి నుంచి మొదలు అవుతుంది అనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. దీన్ని వచ్చే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించబోతున్నారు. దీనికోసం ఇప్పటికే నిర్వహకులు పనులను కూడా మొదలెట్టేశారు. దీన్ని కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఇందులో ఒక కామన్ మ్యాన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

కంటెస్టెంట్ల ఎంపిక.. సెట్ వర్క్

కంటెస్టెంట్ల ఎంపిక.. సెట్ వర్క్

బిగ్ బాస్ షో ప్రారంభించే క్రమంలో నిర్వహకులు చేసే ముఖ్యమైన ప్రక్రియల్లో కంటెస్టెంట్ల ఎంపిక ఒకటి. ఆరో సీజన్ కోసం దీన్ని ఎప్పుడో మొదలు పెట్టారు. ఇప్పటికే ఒక రౌండ్‌ను కూడా పూర్తి చేసి షార్ట్ లిస్ట్ రెడీ చేశారని తెలిసింది. అంతేకాదు, ఇప్పటికే సెట్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేశారని అంటున్నారు. గతంలో చూడని ఎన్నో మార్పులను ఇందులో చూపించబోతున్నారట.

వాళ్లందరి పేర్లు... ఆసక్తకరంగా

వాళ్లందరి పేర్లు... ఆసక్తకరంగా

త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి.. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలెబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, అసలు ఇందులో ఎవరు పాల్గొంటారన్న దానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు. మొత్తానికి ఈ సెలెబ్రిటీల పేర్లు మాత్రం ట్రెండ్ అవుతున్నాయి.

బిగ్ బాస్ షోలోకి ఫేమస్ హీరో

బిగ్ బాస్ షోలోకి ఫేమస్ హీరో

బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి.. ఇందులో పాల్గొనే వాళ్ల జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. అయితే, అందులో ఎవరు కన్ఫార్మ్ అయ్యారో మాత్రం తెలియడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో సెలెబ్రిటీ పేరు తెరపైకి వచ్చింది. అది ఎవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించి.. ఇప్పుడు సీరియల్ హీరోగా వెలుగొందుతోన్న కృష్ణ కౌశిక్.

బంపర్ ఆఫర్ దక్కించుకుని

బంపర్ ఆఫర్ దక్కించుకుని

సీరియల్ హీరోగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న కృష్ణ కౌశిక్‌ను బిగ్ బాస్ నిర్వహకులు ఇటీవలే సంప్రదించారట. అంతేకాదు, ఆరో సీజన్ కోసం అతడికి అదిరిపోయే మొత్తాన్ని కూడా ఆఫర్ చేశారని తెలుస్తోంది. దీంతో ఇందులో పాల్గొనేందుకు కౌశిక్ వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

అప్పట్లో జైలు.. ‘మా’ గెలుపు

అప్పట్లో జైలు.. ‘మా’ గెలుపు


కృష్ణ కౌశిక్ చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు. ఆ తర్వాత హీరోగా సినిమా ప్లాన్ చేసినా అది విడుదల కాలేదు. అనంతరం అతడు సీరియల్ హీరోగా మారి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఆర్టిస్టుల సమస్యల గురించి పోరాటం చేసి జైలు పాలయ్యాడు. ఇక, గత ఏడాది జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి విజయం సాధించి.. ఆ తర్వాత రాజీనామా చేసేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X