Bigg Boss 6: జబర్ధస్త్ టాప్ కమెడియన్‌పై బిగ్ బాస్ కన్ను.. అన్ని లక్షలు ఇస్తామని ఆఫర్‌

రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులకు మజాను అందిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ఇది ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఫలితంగా అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సీజన్ల మీద సీజన్లను కూడా పూర్తి చేస్తున్నారు.

ఇలా ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన బిగ్ బాస్ టీమ్.. ఇప్పుడు ఆరో సీజన్ కోసం పనులు మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపికపై బాగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహకులు ఓ బిగ్ బాస్ టాప్ కమెడియన్‌తో చర్చలు జరిపారని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

ఐదు సీజన్లు.. రికార్డులు బద్దలు

ఐదు సీజన్లు.. రికార్డులు బద్దలు

బిగ్ బ్రదర్ అనే షో ఆధారంగా ఇండియాలో మొదలైన బిగ్ బాస్.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చింది. మన దగ్గర దీనికి భారీ రెస్పాన్స్ దక్కడంతో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో మన బిగ్ బాస్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇలా ఐదు సీజన్లూ.. ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా టాప్ రేటింగ్‌ను సాధించి రికార్డులు బ్రేక్ చేశాయి.

ఫస్ట్ కంటెస్టెంట్‌గా కొత్త చరిత్ర

ఫస్ట్ కంటెస్టెంట్‌గా కొత్త చరిత్ర

బిగ్ బాస్ షోకు తెలుగులో భారీ స్పందన వస్తుండడంతో.. ఇటీవలే నిర్వహకులు ఓటీటీ వెర్షన్ 'నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను ప్రసారం చేశారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికరమైన సన్నివేశాలను ప్రసారం చేశారు. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఇక, ఈ సీజన్‌లో లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.

ఆరో సీజన్ పనులు ప్రారంభం

ఆరో సీజన్ పనులు ప్రారంభం

తెలుగు బుల్లితెర చరిత్రలోనే టాప్ షోగా వెలుగొందుతోన్న బిగ్ బాస్ నుంచి ఆరో సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వహకులు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే, ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సీజన్‌పై అందరిలో ఆసక్తి నెలకొనడంతో పాటు ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

అప్పటి నుంచే.. కామన్ మ్యాన్

అప్పటి నుంచే.. కామన్ మ్యాన్

ఎన్నో అంచనాలతో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సీజన్‌ను కూడా టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఇందులో ఓ కామన్ మ్యాన్‌కు కూడా అవకాశం కల్పిస్తోన్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే ఒకరిని ఇప్పటికే సెలెక్ట్ చేశారట.

 రెండో దశలో.. సెట్ వర్క్ ఇలా

రెండో దశలో.. సెట్ వర్క్ ఇలా

బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందు చేసే పనుల్లో అసలైంది కంటెస్టెంట్ల ఎంపికే అన్న విషయం తెలిసిందే. ఆరో సీజన్ కోసం ఈ ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించారు. అంతేకాదు, ఇప్పటికే ఒక రౌండ్‌ను పూర్తి చేసి కొందరినీ షార్ట్ లిస్ట్ చేశారని కూడా తెలిసింది. అలాగే, సెట్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేశారట. ఇది గతంలో చూడని విధంగా ఉండబోతుందని సమాచారం.

జబర్ధస్త్ కమెడియన్‌పై ఫోకస్

జబర్ధస్త్ కమెడియన్‌పై ఫోకస్

బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల గురించి ఎన్నో విషయాలు బయటకు వస్తుంటాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నిర్వహకులు ఓ ఫేమస్ కమెడియన్‌తో చర్చలు జరిపారట. అది ఎవరో కాదు.. జబర్ధస్త్‌లో టాప్ కమెడియన్‌గా కొనసాగుతోన్న ఆటో రాంప్రసాద్‌ అని విశ్వసనీయంగా తెలిసింది.

అన్ని లక్షలు ఇస్తామని ఆఫర్

అన్ని లక్షలు ఇస్తామని ఆఫర్

ఒకపక్క తన టీమ్ మెంబర్లు గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ జబర్ధస్త్ నుంచి తప్పుకున్నా ఆటో రాంప్రసాద్ మాత్రం కొనసాగుతున్నాడు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ నిర్వహకులు అతడితో సీక్రెట్‌గా చర్చలు జరిపారట. అంతేకాదు, అతడికి ఎపిసోడ్‌కు లక్ష రూపాయలు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. మరి దీనికి రాంప్రసాద్ ఓకే చెప్పాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X