Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

బుల్లితెరపైకి ఎన్నో రకాల రియాలిటీ షోలు వస్తున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే ప్రేక్షకులను మదిని దోచుకుంటున్నాయి. అలాంటి వాటిలో నిజ సంఘటనల ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. బిగ్ బ్రదర్ అనే ఆంగ్ల షో ఆధారంగా ఇండియాలో పరిచయమైన దీనికి భారీ స్పందన దక్కింది. దీంతో ఆ తర్వాత చాలా భాషల్లోకి ఇది పరిచయం అయింది. ఇలా ఐదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అవడంతో పాటు ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. దీనికోసం టాలీవుడ్ హీరోను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఐదు కంప్లీట్.. దేశంలో టాప్‌ ప్లేస్

ఐదు కంప్లీట్.. దేశంలో టాప్‌ ప్లేస్

తెలుగులోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే సక్సెస్ అయిన షోలలో బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎప్పుడూ చూడని కంటెంటే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీన్ని బాగా ఆదరించారు. ఫలితంగా భారీ స్థాయిలో స్పందనతో ఈ షో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాదు, దేశంలోనే మరే షోకూ రానంత టీఆర్పీ రేటింగ్‌ను అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది.

సంచలనంగా మారిన నాన్ స్టాప్

సంచలనంగా మారిన నాన్ స్టాప్

బిగ్ బాస్ షో తెలుగులో సూపర్ హిట్ అవడంతో నిర్వహకులు ఇటీవలే ఓటీటీ వెర్షన్ 'నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను నిర్వహించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికరమైన సన్నివేశాలను ప్రసారం చేశారు. ఫలితంగా దీనికి కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఇక, ఈ సీజన్‌లో లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి విజేతగా నిలిచి సంచలనం అయింది.

ఆరో సీజన్‌‌కు రంగం సిద్ధంగానే

ఆరో సీజన్‌‌కు రంగం సిద్ధంగానే


గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న బిగ్ బాస్ షో నుంచి ఆరో సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు నిర్వహకులు ఇప్పటికే అధికారిక ప్రకటన వదిలారు. అంతేకాదు, కమింగ్ సూన్ ప్రోమోను కూడా విడుదల చేశారు. దీంతో ఈ సీజన్‌పై అందరిలో ఆసక్తి నెలకొనడంతో పాటు ఎన్నో రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

అప్పటి నుంచే.. ఆ కంటెస్టెంట్

అప్పటి నుంచే.. ఆ కంటెస్టెంట్

ఎన్నో అంచనాలతో రాబోతున్న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఈ సీజన్‌ను కూడా టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఇందులో ఓ కామన్ మ్యాన్‌కు కూడా అవకాశం కల్పిస్తోన్నట్లు ప్రకటించారు. ఇందుకోసం నిర్వహించిన ప్రక్రియ కూడా ఇప్పటికే ముగిసింది.

ఫస్ట్ రౌండ్ పూర్తి... సెట్ పనులు

ఫస్ట్ రౌండ్ పూర్తి... సెట్ పనులు


బిగ్ బాస్ ప్రియులు అందరి దృష్టి ఇప్పుడు ఆరో సీజన్ మీద పడింది. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుండడంతో.. ఇందులో పలానా సెలెబ్రిటీ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికలో ఫస్ట్ రౌండ్‌ను కూడా నిర్వహకులు పూర్తి చేశారని తెలుస్తోంది. అంతేకాదు, సెట్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేశారని అంటున్నారు.

షోలోకి టాలీవుడ్ వారసుడు రాక

షోలోకి టాలీవుడ్ వారసుడు రాక

బిగ్ బాస్ షోకు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికీ ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్‌ కోసం టాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు కుమారుడు, ప్రముఖ హీరో సుమంత్ అశ్విన్‌ను నిర్వహకులు సంప్రదించారని తాజాగా తెలిసింది. దీంతో అతడు షోలోకి వస్తున్నాడని అంటున్నారు.

అందుకోసమే ఒప్పుకున్నాడట

అందుకోసమే ఒప్పుకున్నాడట

'తూనీగ తూనీగ' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన సుమంత్ అశ్విన్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో 'అంతకు ముందు ఆ తర్వాత', 'కేరింత' మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకున్నాయి. ఆ తర్వాత అతడికి బ్రేక్ రావట్లేదు. దీంతో బిగ్ బాస్ ద్వారా జనాల్లోకి వెళ్లొచ్చనే ఉద్దేశంతోనే ఆరో సీజన్‌కు సుమంత్ ఒప్పుకున్నాడని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X