Don't Miss!
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Lifestyle
మీ జుట్టు ఒత్తుగా లేదా మెరుస్తూ ఉండాలనుకుంటున్నారా? వీటిని ఉపయోగించండి...
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ లవర్ బాయ్.. అప్పుడు మిస్సైనా ఈ సారి కన్ఫార్మ్!
తెలుగు బుల్లితెరపైకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న ఏకైక షో బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమం సరికొత్త టాస్కులు, ఊహించని సంఘటనలు, అదిరిపోయే రొమాన్స్, లవ్ ట్రాకులు ఇలా ఎన్నో రకాల పరిణామాలతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో నిర్వహకులు ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఇది ప్రారంభించడానికి చాలా సమయమే ఉన్నా.. కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త లీక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ కోసం టాలీవుడ్ హీరోను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

దేశంలోనే టాప్.. ఐదు కంప్లీట్‌గా
ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షో భారీ స్థాయిలో స్పందనను అందుకుంది. ఫలితంగా అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో మన బిగ్ బాస్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇలా ఐదు సీజన్లలోనూ భారీ రేటింగ్ నమోదైంది. ఈ విజయం వెనుక దీన్ని హోస్ట్ చేసిన స్టార్ల పాత్ర కూడా చాలా ఉంది.
లేటు వయసులో రెచ్చిపోయిన సుస్మితా సేన్: స్విమింగ్ పూల్‌లో అందాల ఆరబోత

నాన్ స్టాప్ సీజన్‌తో కొత్త చరిత్ర
బిగ్ బాస్ షో తెలుగులో సక్సెస్ అవడంతో నిర్వహకులు కొద్ది రోజుల క్రితమే ఓటీటీ వెర్షన్ 'నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను నిర్వహించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికరమైన సన్నివేశాలను ప్రసారం చేశారు. ఫలితంగా దీనికి కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఇక, ఈ సీజన్లో లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి విజేతగా నిలిచి కొత్త రికార్డు సృష్టించింది.

ఆరో సీజన్ కోసం సన్నాహాలతో
తెలుగులో తిరుగులేని షోగా వెలుగొందుతోన్న బిగ్ బాస్ షో నుంచి ఆరో సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వహకులు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే, ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సీజన్‌పై అందరిలో ఆసక్తి నెలకొనడంతో పాటు ఎన్నో రకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
హాట్ వీడియో షేర్ చేసిన శృతి హాసన్: టాప్‌ను పైకి లేపి మరీ హాట్ ట్రీట్

అప్పటి నుంచే.. కామన్ మ్యాన్
భారీ అంచనాలతో రాబోతున్న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఈ సీజన్‌ను కూడా టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఇందులో ఓ కామన్ మ్యాన్‌కు కూడా అవకాశం కల్పిస్తోన్నట్లు ప్రకటించారు. ఇందుకోసం నిర్వహించిన ప్రక్రియ కూడా ఇప్పటికే ముగిసినట్లు తెలిసింది.

రౌండ్ పూర్తి.. సెట్ వర్క్ కూడా
బిగ్ బాస్ షో మొదలు కావడంలో అసలైన ఘట్టం కంటెస్టెంట్ల ఎంపిక. దీనికి సంబంధించిన ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే ఒక రౌండ్‌ను పూర్తి చేసి కొందరినీ షార్ట్ లిస్ట్ చేశారని కూడా అంటున్నారు. అలాగే, సెట్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేశారట. నాన్ స్టాప్ సీజన్ కోసం వాడిన హౌస్‌లో మార్పులు చేసి కొత్తది రెడీ చేస్తున్నారు.
దారుణమైన ఫొటోలు వదిలిన రాశీ ఖన్నా: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు

సీజన్లోకి లవర్ బాయ్ ఎంట్రీ
బిగ్ బాస్ షో ప్రారంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్ కోసం టాలీవుడ్లో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఒకప్పటి స్టార్ హీరో తరుణ్‌ను నిర్వహకులు సంప్రదించారని తాజాగా తెలిసింది. ఈ సీజన్లోకి వచ్చేందుకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.

అప్పుడు మిస్సైనా.. కన్ఫార్మ్గా
వాస్తవానికి హీరో తరుణ్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు దాదాపు రెండో సీజన్ నుంచే వార్తలు వస్తున్నాయి. అయితే, అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఆరో సీజన్లోకి అతడు రావడం దాదాపుగా ఖాయం అయిందని తెలుస్తోంది. అతడు వెండితెరపై పెద్దగా కనిపించట్లేదు కాబట్టి.. దీని ద్వారా మళ్లీ ఫేమస్ అవ్వాలని అతడు భావిస్తున్నాడట.