Bigg Boss Telugu 8: నామినేషన్స్‌పై బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. ముందుగా ఎలిమినేట్ అయ్యేది వాళ్లే!
టెలివిజన్ హిస్టరీలోనే బ్రహ్మాండమైన రీతిలో ప్రేక్షకుల స్పందనను దక్కించుకుని తిరుగులేని షోగా దూసుకెళ్తోంది బిగ్ బాస్. ఇండియాలోని మిగిలిన భాషల కంటే ఎక్కువ రెస్పాన్స్‌తో సత్తా చాటుతోన్న ఈ తెలుగు రియాలిటీ షో... విజయవంతంగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో నిర్వహకులు కూడా రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో దాన్ని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్స్ టాస్కు విషయంలో బిగ్ బాస్ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుందట. ఆ వివరాల్లోకి వెళితే...
కొత్త కాన్సెప్టుతో 8వ సీజన్
బిగ్ బాస్ షో తెలుగులో ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నిర్వహకులు ప్రారంభించారు. గత ఆదివారం జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌తో ఈ సీజన్ ఎంతో గ్రాండ్‌గా మొదలైంది. దీన్ని అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే కాన్సెప్టుతో నడపబోతున్నారు. దీంతో ఈ సీజన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

వచ్చిన వాళ్లు ఎవరంటే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కోసం నిర్వహకులు ఎంతో మందితో సంప్రదింపులు జరిపారు. షోలోకి మాత్రం 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వారిలో ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఉన్నారు.
అన్నీ కొత్తే.. అవి లేవుగా
కంటెస్టెంట్లు.. ప్రీమియర్ ఎపిసోడ్ ఇవన్నీ పక్కనపెడితే.. ఎనిమిదో సీజన్‌లో గతంలో ఎన్నడూ చూడని కొత్త ట్విస్టులు, టాస్కులు ఉంటాయని హోస్ట్ నాగార్జున ముందుగానే వెల్లడించాడు. అందుకు తగ్గట్లుగానే ప్రారంభ ఎపిసోడ్ అంతా కొత్తగానే సాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌కు కెప్టెన్సీని తీసేశారు. అలాగే, రేషన్‌లోనూ కండీషన్స్ పెట్టారు. ఇలా చాలా మార్పులు చేశారు.
నామినేషన్స్ కొత్తగానే
బిగ్ బాస్ షో మొత్తంలో ఎలిమినేషన్ అనేది చాలా ప్రత్యేకమైనది. దాని ఆధారంగానే షో నడుస్తుంది. కాబట్టి కంటెస్టెంట్లను ఎలిమినేషన్ జోన్‌లోకి తీసుకొచ్చే నామినేషన్ టాస్క్ ఇంకా ముఖ్యమైనది. దీన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తూ షోను మరింత ఉత్కంఠభరితంగా సాగిస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి నామినేషన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నట్లు కూడా తెలిసింది.
మొత్తం మార్చేశారంట
సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ ప్రక్రియను సోమవారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో చూపిస్తుంటారు. కానీ, ఎనిమిదో సీజన్‌లో మాత్రం దీన్ని ఆరోజు చూపించడం లేదట. అంతేకాదు, ఈ టాస్కును ప్రతి వారం బుధవారం రోజున ప్రసారం చేయబోతున్నారట. వీక్ డేస్‌లో దీనికి ఆదరణ తగ్గుతోన్న కారణంగానే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఓటింగ్ కూడా ఒక్కటే
బిగ్ బాస్ షోలో ఆరో సీజన్ వరకూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అకౌంట్ ఉన్న ఒక యూజర్ రోజుకు పది ఓట్లను వేసుకునే సదుపాయం ఉండేది. అయితే, ఏడో సీజన్‌లో మాత్రం ఆ ఓట్లను 'ఒక్క దానికే' తగ్గించారు. ఈ సీజన్ మొత్తం అలాగే కంటిన్యూ అయింది. ఇక, ఇప్పుడు ఎనిమిదో సీజన్‌లో సైతం ఇదే ఫాలో అవబోతున్నారు. అందుకే దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని టాక్.


Click it and Unblock the Notifications











