Bigg Boss 7 Telugu: ఓటింగ్‌పై ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ సారి వాళ్లు ఎలిమినేట్ అవడం ఖాయం

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో రకరకాల కాన్సెప్టులతో షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులు దోచుకుని సూపర్ సక్సెస్ అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమం మిగిలిన భాషల కంటే తెలుగులోనే భారీ విజయవంతం అయింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లు పూర్తి చేశారు.

బిగ్ బాస్ షో తెలుగులో ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నిర్వహకులు ప్రారంభించారు. గత ఆదివారం జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌తో ఈ సీజన్ ఎంతో గ్రాండ్‌గా మొదలైంది. ఇందులోకి 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లతో పాటు నవీన్ పోలిశెట్టి కూడా ఇంట్లోకి వెళ్లాడు.

Bigg Boss Team Decreases Audience Votes for 7th Season

కంటెస్టెంట్లు.. ప్రీమియర్ ఎపిసోడ్ ఇవన్నీ పక్కనపెడితే.. ఏడో సీజన్‌లో గతంలో ఎన్నడూ చూడని కొత్త ట్విస్టులు, టాస్కులు ఉంటాయని హోస్ట్ నాగార్జున ముందుగానే వెల్లడించాడు. అందుకు తగ్గట్లుగానే ప్రారంభ ఎపిసోడ్ అంతా ఉల్టా పుల్టాగానే సాగింది. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌కు సంబంధించిన ఓటింగ్‌లో సైతం సమూలంగా మార్పులు చేసినట్లు తాజా ఎపిసోడ్‌లో తెలిపాడు.

వాస్తవానికి బిగ్ బాస్ ఓటింగ్ ప్రారంభంలో 'గూగుల్' ద్వారా జరిగేది. అందులో Bigg Boss Telugu Vote అని టైప్ చేస్తే వచ్చే పేజ్‌లో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు పది ఓట్లు వేసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత దీన్ని మార్చి 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్' ఓటింగ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. దీనితో పాటు మిస్‌డ్ కాల్స్ ద్వారా కూడా ఓట్లు వేసే చాన్స్ కల్పించారు.

ఆరో సీజన్ వరకూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అకౌంట్ ఉన్న ఒక యూజర్ రోజుకు పది ఓట్లను వేసుకునే సదుపాయం ఉండేది. అయితే, ఏడో సీజన్‌లో మాత్రం ఆ ఓట్లను 'ఒక్క దానికే' తగ్గించారు. అంటే.. అప్పుడు పది ఓట్లు వేసే వాళ్లు ఇప్పుడు ఒక్క ఓటు మాత్రమే వేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రీమయర్ ఎపిసోడ్‌లో తెలిపాడు.

Bigg Boss Team Decreases Audience Votes for 7th Season

ఏడో సీజన్‌కు సంబంధించి ఎవరైనా తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు మద్దతు తెలిపాలంటే 'హాట్‌స్టార్'లో లాగిన్ అయి రోజుకు ఒక ఓటును నమోదు చేసుకోవాలి. ఈ మార్పు వల్ల పీఆర్ టీమ్‌లను పెట్టుకుని వచ్చి షోలో ధైర్యంగా ఉంటున్న చాలా మందికి షాక్ తగిలినట్లు అవుతుంది. అదే సమయంలో ప్రేక్షకుల మద్దతు లేనివాళ్లంతా ఎలిమినేట్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X