Bigg Boss Telugu 6: ఆ కంటెస్టెంట్‌ను పంపేసే కుట్ర.. ఆమె వీడియోలే వైరల్ చేయడంతో!
వేరే భాషల్లో ఎప్పుడో మొదలైనా.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది బిగ్ బాస్ షో. అంచనాలను పక్కన పెడితే ఎన్నో అనుమానాలతో మన భాషలోకి వచ్చిన దీనికి చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు మద్దతును అందించారు. దీంతో ఇది తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందన అందించారు. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ సైతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ ఒకరిని టార్గెట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలేంటో మీరే చూడండి!
Photo Courtesy: Star మా and Disney+Hotstar

భారీ అంచనాలు.. అదే రీతిలో
చాలా భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్‌కు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. అందుకే ఆరో సీజన్‌పై అంచనాలు అదే రేంజ్‌లో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే షో నిర్వహకులు ఈ సీజన్‌లో అన్నీ సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా ఇది ఆరంభం నుంచే ఆసక్తికంగా సాగుతూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.

ఆరో సీజన్‌లో ఫోకస్ అయింది
ఆరో సీజన్‌లోకి 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఇనాయా సుల్తానా మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఈ అమ్మడు రాంగోపాల్ వర్మతో కలిసి చేసిన వీడియో వల్ల ఫేమస్ అవడమే. దీనికితోడు ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఈమె మాంచి సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఫలితంగా ఇనాయా యమా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు.

నామినేషన్ లేకున్నా గొడవలు
బిగ్ బాస్ షోలో ప్రీమియర్ ఎపిసోడ్ ఆదివారం జరగ్గా.. సోమవారమే నామినేషన్స్ టాస్కును నిర్వహించేవారు. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం ఈ టాస్కును పెట్టలేదు. పైగా మొదటి రోజే ఓ టాస్కును కూడా నిర్వహించారు. అంతేకాదు, అంతకు ముందు తర్వాత కొన్ని గొడవలను చూపించారు. దీంతో నామినేషన్స్ టాస్క్ లేకున్నా ఈ ఎపిసోడ్ మాత్రం ఎన్నో గొడవలతో సాగిందని తెలిసిందే.

గీతూతో గొడవకు దిగిన బ్యూటీ
గీతూ రాయల్ బాత్రూంలోకి వెళ్లిన సమయంలో కొన్ని వెంట్రుకలు కనిపించాయి. దీంతో ఆమెకు ఎంతో కోపం వచ్చింది. వెంటనే నిన్న రాత్రి ఎవరు స్నానం చేశారని ప్రశ్నించింది. దీంతో బోల్టు బ్యూటీగా పేరొందిన ఇనయా సుల్తానానే అని కొందరు చెప్పారు. దీంతో ఆమె నేరుగా వెళ్లి గొడవకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరగడంతో ఇనాయా హైలైట్ అయింది.

వాళ్లతో కూడా గొడవ పడుతూ
బిగ్ బాస్ షో ఆరో సీజన్‌లో రెండు ఎపిసోడ్‌లు జరగ్గా ఇందులో ఇనాయా సుల్తానానే ఎక్కువగా కనిపించింది. దీనికి కారణం ఆమె తరచూ ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకోవడమే. మొదట గీతూతో ఫైట్ చేసిన ఇనాయా.. ఆ తర్వాత ఆది రెడ్డితో పాటు మరికొందరితో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు, తనకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదంటూ కంటెస్టెంట్లపై ఆరోపణలు కూడా చేసింది.

ఆమెను పంపేసే కుట్ర అంటూ
బిగ్ బాస్ ఆరో సీజన్ రెండు ఎపిసోడ్లలో బాగా హైలైట్ అయింది ఇద్దరు కంటెస్టెంట్లు మాత్రమే. అందులో ఒకరు గీతా రాయల్ కాగా, మరొకరు ఇనాయా సుల్తానా. అయితే, మొదటి ఆమెను ఎంటర్‌టైనర్ యాంగిల్‌లో చూపించారు. కానీ, ఇనాయాను మాత్రం గొడవలు పెట్టుకునే అమ్మాయిగానే చెప్తున్నారు. దీంతో ఆమెను బయటకు పంపే కుట్ర చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఈ వారం వెళ్లిపోయేది ఆమెనా
బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి జరిగిన టాస్కులో ఇనాయా సుల్తానా పలుమార్లు ఓటమి పాలైంది. దీంతో ఆమె ఈ వారానికి జరిగే నామినేషన్ ప్రక్రియలో నేరుగా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఇనాయాను ఈ వారం బయటకు పంపేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ఈ వారం చివర్లో జరుగుతుంది.


Click it and Unblock the Notifications











