Bigg Boss Telugu 5 సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ దిమ్మతిరిగే ఆఫర్: ఆ స్టార్ హీరో రేంజ్‌లో!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే కార్యక్రమాలు అన్నీ ఒక ఎత్తైతే.. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయమై భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ సాగిపోతోన్న బిగ్ బాస్ మరో ఎత్తు. అసలే మాత్రం తెలియని పద్దతిలో ప్రసారం అవుతోన్నప్పటికీ.. దీనికి మన ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఈ కారణంగానే ఇది తెలుగులో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, త్వరలోనే నిర్వహకులు ఐదో సీజన్‌ను కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి ఎన్నో వార్తలు బుల్లితెర వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ యూనిట్ జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

 తెలుగు బిగ్ బాస్.. జాతీయ స్థాయి గుర్తింపు

తెలుగు బిగ్ బాస్.. జాతీయ స్థాయి గుర్తింపు

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా పదిహేనేళ్ల క్రితం బిగ్ బాస్ హిందీలో ప్రారంభం అయింది. అక్కడ సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత దేశంలోని మరికొన్ని భాషల్లోకి పరిచయం అయింది. అలా కొన్నేళ్ల క్రితమే ఇది తెలుగులోకి వచ్చింది. చాలా అనుమానాల మధ్య వచ్చిన ఈ షోకు మన ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే గత సీజన్‌లో ఏకంగా 18 పైచిలుకు రేటింగ్‌తో రికార్డు నమోదైంది. తద్వారా జాతీయ స్థాయిలో తెలుగు బిగ్ బాస్ గుర్తింపును తెచ్చుకుంది.

ఐదో సీజన్‌కు డేట్ ఫిక్స్... ప్రోమోలు కూడా

ఐదో సీజన్‌కు డేట్ ఫిక్స్... ప్రోమోలు కూడా

తెలుగులో బిగ్ బాస్ షోకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీంతో ప్రతి సంవత్సరం ఈ షో కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఐదో సీజన్‌ మొదలయ్యే అవకాశాలు లేవని ఆ మధ్య చాలా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ సీజన్‌కు సంబంధించిన లోగో ప్రోమో కూడా విడుదలైంది. తద్వారా త్వరలోనే కొత్త సీజన్ రాబోతుందని ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక, ఈ సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని, దానికి ముందు పలు ప్రోమోలు వస్తాయని టాక్.

అసలైంది ముగిసింది.. అది మాత్రం బ్యాలెన్స్

అసలైంది ముగిసింది.. అది మాత్రం బ్యాలెన్స్

ఈ ఏడాది కోవిడ్ సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా అసలు బిగ్ బాస్ సీజన్‌ను ప్రారంభించాలా? వద్దా? అన్న సంశయంలో ఉండిపోయారు నిర్వహకులు. అందుకే దీనికి సంబంధించిన పనులను ఈ మధ్యనే మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ముందుగా కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించిన బిగ్ బాస్ టీమ్.. 50 మందితో ఆన్‌లైన్ ద్వారానే సంప్రదింపులు జరిపారట. ఈ జాబితాలోని సభ్యులతో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపారు. ఇక, ఇప్పుడు సెట్‌కు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ జరుగుతుందని తెలిసింది. లోపలి రూమ్‌లలో సౌకర్యాలు కల్పిస్తున్నారని సమాచారం.

 ఐదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే

ఐదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే

తెలుగులోనే టాప్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు సంబంధించిన అన్ని విషయాలను రహస్యంగా ఉంచుతారు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపిక గురించి పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. కానీ, మొదటి సీజన్ నుంచే అన్నీ ముందే లీక్ అవుతున్నాయి. ఇక, ఇప్పటికి అందిన సమచారం ప్రకారం.. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్‌లో సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్, గీతా సింగ్, షణ్ముక్ జశ్వంత్, సురేఖ వాణి, ప్రియ, యాంకర్ వర్షిణి సౌందరాజన్, యాంకర్ రవి, రఘు మాస్టర్, టిక్ టాక్ దుర్గారావులు పాల్గొనబోతున్నట్లు ఓ జాబితా బయటకు వచ్చేసింది.

సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ అదిరేలా ఆఫర్

సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ అదిరేలా ఆఫర్

నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఐదో సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌ను నిర్వహకులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే బాగా ఫేమస్ అయిన ఆర్టిస్టులను, సోషల్ మీడియా సెలెబ్రిటీలను కంటెస్టెంట్లుగా ఎంపిక చేస్తున్నారు. అంతేకాదు, ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న పలువురు సెలెబ్రిటీలతో చర్చలు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే షో నిర్వహకులు జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారని ఓ న్యూస్ లీకైంది.

భారీ మొత్తం.. ఇండియాలోనే తొలిసారి అంత

భారీ మొత్తం.. ఇండియాలోనే తొలిసారి అంత

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సుడిగాలి సుధీర్‌తో ఇటీవల బిగ్ బాస్ నిర్వహకులు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారట. ఈ సమయంలో బిగ్ బాస్ యూనిట్ అతడికి ఏకంగా రూ. 4.50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని సమాచారం. ఇంత పెద్ద మొత్తం ఇప్పటి వరకూ ఇండియాలోని ఏ బుల్లితెర ఆర్టిస్టు కూడా తీసుకోలేదు. అంతెందుకు ఏ భాషలో కూడా ఎవరూ ఇంత చార్జ్ చేయలేదు. ఇక, ఈ ఆఫర్ తెలుగులో బిగ్ బాస్ హోస్టుగా చేసిన నేచురల్ స్టార్ నాని తీసుకున్న మొత్తానికి సమానం. దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Recommended Video

#HBDMaheshBabu : Surprising Facts సినిమాల్లో అలా.. బయట ఇలా | #SarkaruVaariPaata || Filmibeat Telugu
 అందుకే సుధీర్ పేరు లిస్టులో.. క్లారిటీ రాలేదు

అందుకే సుధీర్ పేరు లిస్టులో.. క్లారిటీ రాలేదు

సుడిగాలి సుధీర్‌తో బిగ్ బాస్ నిర్వహకులు చర్చలు జరిపిన విషయం బయటకు రావడం వల్లే అతడిని ఈ సీజన్‌ జాబితాలో చేర్చేశారు కొందరు ఔత్సాహికులు. అందుకే ఈ సీజన్ కంటెస్టెంట్ల జాబితాలో సుధీర్ పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ జబర్ధస్త్ కమెడియన్ షోలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా? అన్నది మాత్రం తెలియడం లేదు. అంత ఆఫర్‌ను అతడు ఒప్పుకున్నాడా? లేక కమిట్‌మెంట్ల వల్ల రిజెక్ట్ చేశాడా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు, ఇంత భారీ మొత్తం ఆఫర్ చేశారన్నది నమ్మశక్యంగా లేదంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X