Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. ఈ సీజన్ 15 వారాలు కాదు.. ఇది కదా అసలైన ఉల్టా పుల్టా

తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌ను పరిచయం చేస్తూ బుల్లితెరపైకి వచ్చిన షోనే బిగ్ బాస్. ఊహకందని సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్, కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఇలా ఎన్నో రకాల అంశాలతో ప్రేక్షకులకు మజాను పంచుతూ ఇది భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంది. ఇప్పటికే కొన్ని సీజన్లను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్.. ఇటీవలే ఏడో సీజన్‌ను ప్రారంభించింది. దీనికి గతంలో కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా నిర్వహకులు ఇప్పుడు ఈ సీజన్ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆ వివరాలను మీరే చూడండి!

ఉల్టా పుల్టాగా.. భారీ రెస్పాన్స్:బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఎలాగైనా సూపర్ సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టాస్కులను తీసుకు వస్తున్నారు. అలాగే, సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఇది భారీ టీఆర్పీతో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.

Bigg Boss Team To Increase 2 More Weeks Game in Season 7

19 మంది.. ఇప్పుడు టాప్ 10:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇలా ఈ సీజన్‌లోకి మొత్తం 19 మంది సభ్యులు కంటెస్టెంట్లుగా వచ్చారు. పది వారాల్లో పది మంది ఎలిమినేట్ అయిపోయారు. అయితే, రతికా రీఎంట్రీ వల్ల ఇప్పుడు హౌస్‌లో పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు.

ముందే ఫ్యామిలీ వీక్ సక్సెస్:సాధారణంగా బిగ్ బాస్ సీజన్‌లో ఎప్పుడైనా ఫినాలేకు ముందు ఫ్యామిలీ వీక్‌ను తీసుకు వస్తున్నారు. అయితే, ఇప్పుడు ఏడో సీజన్‌లో మాత్రం ఇది కాస్త ముందుగానే నిర్వహించారు. ఈ వీక్ మొత్తం ఎంతో ఎంతో ఎమోషనల్‌గా సాగింది. ఇందులో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు వచ్చి షోను మరింత రంజుగా మార్చారు. మొత్తానికి ఫ్యామిలీ వీక్ సక్సెస్‌ఫుల్‌గానే సాగిపోయింది.

ఈ సీజన్‌ అన్ని వారాలేనా?:బిగ్ బాస్ ఏడో సీజన్‌ను పదిహేను వారాల పాటు నిర్వహించబోతున్నట్లు టీమ్ ముందుగానే ప్రకటించింది. దీని ప్రకారం మరో ఐదు వారాల్లో ఈ సీజన్‌కు ముగింపు పలుకుతారని అంతా అనుకుంటున్నారు. అయితే, ఇప్పుడు హౌస్‌లో 10 మంది సభ్యులు ఉండడంతో ఈ సారి టాప్ 6ను ఫైనల్‌కు పంపుతారా? లేక ఈ సీజన్‌ను పొడిగిస్తారా? అన్న సందేహాలు వస్తున్నాయి.

Bigg Boss Team To Increase 2 More Weeks Game in Season 7

సంచలనంగా.. పెంచేస్తూ:బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోన్న కారణంగా.. దీన్ని మరింతగా పొడిగించబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సీజన్‌ను మరో రెండు వారాలకు పెంచబోతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. నాగార్జున కూడా ఓకే అంటే ఈ నిర్ణయం తీసుకుంటారని టాక్.

ఏ సీజన్.. ఎన్ని వారాలు?:తెలుగులో బిగ్ బాస్ ఆరు రెగ్యూలర్ సీజన్లను పూర్తి చేసుకుంది. అందులో మొదటి దాన్ని 10 వారాలకే పరిమితం చేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన రెండో సీజన్ మాత్రం 16 వారాలు కొనసాగింది. తర్వాత మూడు నుంచి ఆరు సీజన్లు అన్నీ 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించాయి. అయితే, ఇప్పుడు మాత్రం ఇది 17 వారాలు నడిస్తే తెలుగులో రికార్డు అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X