Bigg Boss 7 Telugu రతిక కోసం మాజీ ప్రియుడి పాట.. బ్యూటీని బిగ్‌బాస్ కెలకడం మామూలుగా లేదుగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. హౌజ్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్... ఎవ్వరూ తగ్గకుండా ఫెర్మామెన్స్ ఇస్తున్నారు. ఆట సందిప్, ప్రియాంక జైన్ కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ గుర్తించాడు. ఇక ఈ రోజు మూడో కంటెస్టెంట్ ఫైనల్ చేయనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో తెలిసింది. ఇక రతిక మాజీ ప్రియుడి పాట వేసి.. ఆమెను ఎమోషల్ చేశాడు బిగ్ బాస్. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఇద్దరు కంటెస్టెంట్స్ కన్మార్మ్ అయిన సంగతి తెలిసిందే. ఆట సందీప్, ప్రియాంక జైన్ ఇద్దరూ కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ గుర్తించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్ బాస్ మూడో కంటెస్టెంట్ ను కన్మ్పార్మ్ చేయనున్నారు. ఇక దానితో పాటు.. కొన్ని ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి.

Bigg Boss Teases Rathika Rose

ఈ ప్రోమోలో గమనిస్తే... అందరి కంటే ఎక్కువగా బిగ్ బాస్ ను మెప్పించిన వారిని మూడవ కంటెస్టెంట్ గా గుర్తిస్తారని ప్రకటించాడు. ప్రిన్స్ అమ్మాయి గెటప్ వేసుకుని అలరిస్తున్నాడు. ఇక ప్రిన్స్ యావర్ గెటప్, ఫెర్మామెన్స్ చూసి బిగ్ బాస్ ప్రశంసించాడు. ఇక ప్రిన్స్ యావర్, ఆట సందీప్ కు ముద్దులు పెడుతూ... ఎంటర్టైన్ చేశాడు.

టెస్టీ తేజ తనను 30 సెకన్లు ఎవరు ఎత్తుకుంటారు అని అడిగితే... శుభ శ్రీ టెస్టీ తేజను లిఫ్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. షకీలాకు బిగ్ బాస్ నిద్రపోవద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇక కన్సేషన్ రూమ్ కి రమ్మని చెప్పగా.. అక్కడికి వచ్చిన షకీలా.. గౌతం, శుభశ్రీ అఫైర్‌ ను లీక్ చేసింది. ఇక టెస్టీ తేజ.. శుభ శ్రీని ఎత్తుకుని తిప్పుతాడు.

Bigg Boss Teases Rathika Rose

మరోవైపు రతికను బిగ్ బాస్ ఎవరినైనా మిస్ అవుతున్నావా అంటూ అడిగాడు. దీనికి రతిక మిస్ అవుతున్నావా అని అడిగితే ఎవరైనా మొదట పేరెంట్స్ ను మిస్ అవుతున్నాం అంటారు. పేరెంట్స్ పక్కన మిస్ అయితే అతనే అంటూ తెగ ఎమోషనల్ అయింది. దీన్ని అదనుగా తీసుకుని బిగ్ బాస్ మరింత ఎమోషల్ అయ్యేలా చేశాడు.

బిగ్ బాస్ కోసం మీరు చాలా పాటలు పాడారు కదా.. మీకోసం ఇప్పుడు ఒకటి వినిపించాలి అనుకుంటున్న అని బిగ్ బాస్ చెబుతాడు. దానికి రతిక... ఏమన్నా పాట పాడిండ నాకోసం అంటుంది. ఇంతలో పిల్లా అంటూ బిగ్ బాస్ పాటను వినిపించాడు. దానికి రతిక కళ్ల నుంచి నీళ్లు కారాయి. అది విని కన్నీటి పర్యాంతం అయింది.

అయితే ఈ ప్రోమో చూసిన నెటిజన్స్... ఈ పాట ఎక్కడో ఎవరో పాడినట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది రాహుల్ సింప్లిగంజ్ పాడిన పాట. గతంలో బిగ్ బాస్ సీజన్స్ లో పాల్గొన్న రాహుల్.. ఈ పాటను ఎన్నో సార్లు పాడాడు. అయితే రాహుల్ రతిక ఇద్దరూ గతంలో లవర్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి హే పిల్ల అనే ప్రైవేట్ అల్బామ్ చేశారు. అప్పుడే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల రతిక రాహుల్ వీడిపోయారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X