నవదీప్ తో నాకు పెళ్లి.. బిగ్ బాస్ తేజస్వి మదివాడ క్లారిటీ
యంగ్ అండ్ టాలెంటెడ్ నటి తేజస్వి మదివాడ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేశ్ బాబు - విక్టరీ వెంకటేశ్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ సినిమాలో మహేశ్ బాబుతో 'ఒక్కసారి ఇంకోసారి' అంటూ చెప్పిన డైలాగ్ తో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత నుంచి చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది.
'ఐస్ క్రీమ్' అనే చిత్రంతో తేజస్వి మదివాడ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తేజస్వి మదివాడకు తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వచ్చాక మరింత క్రేజ్ సొంతం అయ్యింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో తేజస్వి మదివాడ కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే హౌజ్ లో ఈ ముద్దుగుమ్మ చేసిన రచ్చకు టెలివిజన్ ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. ఆమె ముక్కుసూటి తనంతో అందరికీ గుర్తుండిపోయింది.

కాగా, బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తేజస్వీ మదివాడకు మంచి పేరు దక్కడంతో పాటు కెరీయర్ కూడా బాగానే నడిచింది. అయితే బిగ్ బాస్ సీజన్ తర్వాత తేజస్వి మదివాడ, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవదీప్ కు మంచి స్నేహం ఏర్పడింది. పలు ఇంటర్వ్యూల్లో వీరద్దరూ ఎంతో క్లోజ్ గా మాట్లాడుతూ కనిపించారు. నవదీప్ కు యాక్సిడెంట్ అయిన సందర్భంలోనూ తేజస్వి స్పెషల్ కేర్ తీసుకుంది. దాంతో వీరి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు పుటుకొచ్చాయి. ఆ రూమర్లపై తాజాగా తేజస్వి మదివాడ స్పందించింది.
తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. నా జీవితం తెరిచిన పుస్తకం. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక చాలా పీక్స్ చూశాను. నా బాయ్ ఫ్రెండ్ ను కోల్పోయాను. నాకు స్నేహితులంటే చాలా ఇష్టం. నాకోసం తపన పడే వారికి ఎప్పుడూ రుణపడి ఉండాలనుకుంటాను. ఈ క్రమంలోనే నవదీప్ కూడా నాకు మంచి స్నేహితుడు. కానీ చాలా మంది నవదీప్ తో పెళ్లి ఎప్పుడు అని సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారు. క్లోజ్ గా ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సిందేనా.. నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నా ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లి చూస్తే నేను ఎంత మందితో డేటింగ్ చేశానో అనేది మీకే తెలుస్తుంది. నవదీప్ తో నాకు మంచి స్నేహం మాత్రమే ఉండింది... అని చెప్పుకొచ్చింది. ఆ రూమర్లలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక గతంలోనూ నవదీప్ ఈ రూమర్లను కొట్టి పారేశారు. ఇక తేజస్వి మదివాడ ప్రస్తుతం స్టార్ మా ప్రసారం అవుతున్న 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ సీజన్ 2' గేమ్ షోలో పార్టిసీపేట్ చేస్తోంది. ప్రతి టాస్క్ లో చురుకుగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.


Click it and Unblock the Notifications











