బిగ్‌బాస్ బ్యూటీతో టేస్టీ తేజ రొమాన్స్.. గుండెలపై పచ్చబొట్టు వేయించుకుని మరీ రచ్చ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు, వాళ్లు చేసిన సందడి, రచ్చను వారి అభిమానులు అస్సలే మర్చిపోలేరు. సీజన్ 7లో పాల్గొన్న టేస్టీ తేజ చాలా టాలెంటెడ్ అండ్ ఫన్నీగా కనిపిస్తూ అందిరితోనూ చక్కగా కలిసిమెలిసి ఉన్నాడు. ఎవరినీ హర్ట్ చేయకుండా చక్కగా గేమ్ ఆడాడు. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లో నటించిన శోభాశెట్టితో చాలా క్లోజ్ గా ఉంటూ తెగ సందడి చేశాడు. ఈ క్రమంలోనే శోభా పేరును తనకు నచ్చిన చోట టాటూ వేయించుకోమంటూ బిగ్ బాస్ బాగా ఇరిటేట్ చేశాడు. కానీ తేజ మాత్రం అస్సలే వేయించుకోలేదు. కానీ ఎట్టకేలకు ఆయన ఓ అమ్మాయి పేరును తన గుండెలపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఎవరి పేరు, ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు టేస్టీ తేజను, శోభాశెట్టితో ఆయన కాంబోను ఇష్టపడని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కాస్త ఓవర్ చేస్తున్నారనిపించినా అందరికీ నచ్చందీ జంట. ఈక్రమంలోనే తెగ సందడి చేశారు. వీరిద్దరి మధ్య బాండింగ్ పెరగడం, బయటకు ఎలా వెళ్తుందో తెలియక శోభాశెట్టి చాలా ఫీల్ అయింది. టేస్టీ తేజ వల్ల తన రియల్ లైఫ్ లవ్ కు ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందేమోనని చాలా భయపడింది. అదే విషయాన్ని అందరి ముందే తేజను అడిగింది. ఆయన అలా ఏం ఉండదులేవే అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి వరకు వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనుకున్న వాళ్లకు శోభాకు బయట ప్రియుడు ఉన్నట్లు తెలుసుకున్నారు.

 Bigg Boss Telgugu 7 Contestant Tasty Teja Tattooed Another Contestant Name Check Details

ఆ తర్వాత నుంచి వీరిద్దరి మధ్య కాస్త స్నేహం తగ్గింది. తగ్గింది అనడం కంటే కూడా వారు కావాలనే తగ్గించారని చెప్పడం కరెక్ట్. అయితే ప్యామిలీ వీక్ తర్వాత శోభా ప్రియుడు రావడంతో ఆమెకు ఉన్న అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. కానీ అప్పటికే టేస్టీ తేజ ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. కానీ ఆమె బయటకు రాగానే టేస్టీ తేజ వచ్చి ఆమెను కలిశాడు. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి తెగ రచ్చ చేస్తున్నారు. ఎవరితో ఎక్కువగా కనిపించని శోభాశెట్టి.. ఒక్క తేజతో మాత్రమే ఎక్కువగా వీడియోలు చేస్తోంది. అయితే టేస్టీ తేజ మాత్రం హౌస్ మేట్స్ అందరినీ కలుస్తూ రచ్చ చేస్తున్నాడు.

 Bigg Boss Telgugu 7 Contestant Tasty Teja Tattooed Another Contestant Name Check Details

ఈక్రమంలోనే తాజాగా టేస్టీ తేజ శోభాశెట్టిని కలిశాడు. ఆమెను తనవెంట ఓ రెస్టారెంట్ కు కూడా తీసుకెళ్లాడు. ఈక్రమంలోనే ఆయన తన గుండెలపై వేసుకున్న పచ్చబొట్టును చూయించాడు. అది చూసిన శోభాశెట్టి షాకైంది. ఇదేంట్రా ఇది నిజమైన టాటూయేనా అంటూ చూడగా.. అది ఫేక్ అని తెలిసిపోయింది. అందులోనూ శోభా పేరును తప్పుగా రాశారు. అదేదో స్టికర్, లేదా పెన్నుతో రాసినట్లుగా కనిపిస్తోంది. శోభా అని ఇంగ్లీషులో రాయగా... హెచ్ లేదని శోభా అంది. దానికి పోనీలేవే నీకోసం టాటూ వేయించుకున్న అది చాల్లే నీకంటూ చెప్పుకొచ్చాడు టేస్టీ తేజ.

 Bigg Boss Telgugu 7 Contestant Tasty Teja Tattooed Another Contestant Name Check Details

ఆ తర్వాత వీరిద్దరూ కలిసి బిర్యానీ తింటూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఒకరినొకరు హత్తుకుంటూ చాలా ఫన్నీ ఫన్నీగా కామెడీగా వ్యవహరించారు. అయితే ఈ వీడియోను టేస్టీ తేజ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేయగా.. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. మీరు కూడా ఓసారి ఈ క్యూట్ వీడియోను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X