నూతన్ నాయుడు దారిలో నోయల్ సీన్.. ‘బిగ్‌బాస్ తెలుగు’లో ఎంత మంది బయటకు వెళ్లి వచ్చారంటే

తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ రియాలిటీ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకోబోతున్నది. అయితే సీజన్లు రంజుగా సాగుతున్న సమయంలో కొందరు ఇంటి సభ్యులు అనూహ్యమైన పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చింది. తాజా సీజన్‌లో నోయల్ అనారోగ్యంతో గేమ్ రూల్స్‌కు విరుద్ధంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లిన సెలబ్రిటీ ఎలిమినేట్ అయితే తప్పా లేదా గేమ్ పూర్తయితే తప్పా బయటకు రాకూడదనే నిబంధన తెలిసిందే. నాలుగు సీజన్లను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు అనూహ్య పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వారు ఎవరంటే..

బిగ్‌బాస్ తెలుగు 1 షోలో ముమైత్ ఖాన్

బిగ్‌బాస్ తెలుగు 1 షోలో ముమైత్ ఖాన్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 విషయానికి వస్తే.. అత్యంత ఆసక్తిగా షో కొనసాగుతున్న సమయంలో అప్పటి కంటెస్టెంట్ ముమైత్ ఖాన్‌‌ను డ్రగ్స్ రాకెట్ కేసు వెంటాడింది. డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులను విచారించారు. ఆ క్రమంలో ముమైత్ ఖాన్‌ను కూడా పోలీసులు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆమె ఒక రోజు బయటకు వెళ్లి విచారణకు హాజరయ్యారు.

కోర్టు కేసు కోసం సామ్రాట్‌ రెడ్డి

కోర్టు కేసు కోసం సామ్రాట్‌ రెడ్డి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 సంబంధించి.. ఇద్దరు కంటెస్టెంట్లు గేమ్ మధ్యలో బయటకు వెళ్లి రావడం జరిగింది. కోర్టు కేసు కారణంగా సామ్రాట్‌ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రోజు బయటకు వెళ్లిన సామ్రాట్ కోర్టులో హాజరై తిరిగి బిగ్‌బాస్ ఇంటికి చేరుకొన్నారు.

భుజం నొప్పితో నూతన్ నాయుడు బయటకు

భుజం నొప్పితో నూతన్ నాయుడు బయటకు


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 లోనే నూతన్ నాయుడు వైద్య చికిత్స కోసం బయటకు వెళ్లి రావడం జరిగింది. సీజన్ 2లో ఓ టాస్క్ జరుగుతుండగా భుజానికి గాయం కావడంతో ఇంట్లోనే చికిత్స అందించారు. అయితే నొప్పి తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌కు తిరిగి వచ్చారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
సీజన్‌లో నోయల్ సీన్ అనారోగ్యంతో

సీజన్‌లో నోయల్ సీన్ అనారోగ్యంతో

ఇక తాజాగా నోయల్ సీన్‌కు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కండరాలకు సంబంధిన సమస్యతో బాధపడుతున్న నోయల్‌కు బిగ్‌బాస్ ఇంటిలోనే ప్రాథమికంగా చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇంటి నుంచి బయటకు పంపిస్తూ బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నాడు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఇంటి సభ్యులందరూ కలిసి గెట్ వెల్ సూన్ అంటూ విషెస్ అందించగా ఇంటి నుంచి బయటకు వచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X