సామాన్యులకు లాస్ట్ ఛాన్స్.. బిగ్‌బాస్ 10 అగ్నిపరీక్ష‌‌ దరఖాస్తులకు ఫైనల్ డేట్ ఎప్పుడంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ మరోసారి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ మెగా షో.. త్వరలో 10వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. మైల్‌స్టోన్ అనదగ్గ సీజన్ కోసం ఈసారి సరికొత్తగా సిద్ధమవుతోంది బిగ్‌బాస్. దాదాపు 100 రోజులకు పైగా వినోదాన్ని అందించనుంది ఈ మెగా రియాలిటీ షో. దాంతో ఈసారి ఎలాంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి? కంటెస్టెంట్స్ ఎవరు? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

గత సీజన్‌లో సామాన్యుల రాకతో గేమ్ షో అదిరిపోయింది. సెలబ్రిటీలకు ఏ మాత్రం లొంగకుండా.. వారికి గట్టి పోటీ ఇస్తూ కామన్‌మెన్ దూసుకెళ్లారు. చివరికి బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా సామాన్యుడు నిలిచి శెభాష్ అనిపించుకున్నాడు. ఆత్మ విశ్వాసం, సవాళ్లను స్వీకరించే సామర్ధ్యం, దూకుడు, తెలివితేటలు ఉంటే సామాన్యుడు విజేత కావొచ్చని నిరూపించారు. దాంతో బిగ్‌బాస్‌ను ఇష్టపడే కామన్‌మెన్ ఈ మెగా రియాలిటీ షోలో పాల్గొనాలని భావిస్తున్నారు.

Bigg Boss Telugu 10 Agnipariksha applications are Closing Soon Here is full Details

గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా కామన్‌మెన్‌కు ఎంట్రీ ఉంటుందని నిర్వాహకులు ఇటీవల ప్రకటించారు. గతేడాది మాదిరిగానే అగ్నిపరీక్ష సీజన్ 10 పేరుతో సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించనున్నారు. జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు ఆడిషన్స్‌కు వీడియోలు పంపవచ్చని ఇటీవల విడుదలైన ప్రోమోలో హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. 3 నిమిషాల నిడివితో అభ్యర్ధులు తమ గురించి, తమ టాలెంట్ గురించి తెలియజేస్తూ వీడియో పంపాలని తెలిపారు. bbtelugu.jiostar.comలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని నాగార్జున వెల్లడించారు.

మేనరిజం, హావభావాలు, కాన్ఫిడెన్స్, వీడియోలో స్పష్టమైన ఉచ్ఛారణతో పాటు మంచి క్వాలిటీతో, ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా చూసుకోవాలని అభ్యర్ధులకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఈసారి బిగ్‌బాస్ 10 అగ్నిపరీక్షకు యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరిస్తారని.. హీరో శివాజీ, గీతా మాధురిలతో పాటు అభిజిత్ లేదా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌లు జడ్జిలుగా వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక బిగ్‌బాస్ తెలుగు 10 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో బుల్లితెర నటి పల్లవి గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, పండు మాస్టర్, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, రైటర్ కడలి సత్యనారాయణ, ఈటీవీ ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు హీరో చంద్రహాస్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే రేపటితో బిగ్‌బాస్ 10 అగ్నిపరీక్షకు కామన్‌మెన్ దరఖాస్తులు పంపే గడువు ముగియనుంది. దీనిని తెలియజేస్తూ స్టార్ మా ఓ ప్రోమో విడుదల చేసింది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు, ఆ గెలుపు రావాలంటే కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఇప్పుడు అలాంటి అవకాశం మళ్లీ మీ ముందుకు వచ్చిందని నాగార్జున వాయిస్‌తో ప్రోమో వచ్చింది. ఇందులో అగ్నిపరీక్ష సీజన్ 1లో పాల్గొని బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్స్‌గా అవకాశం దక్కించుకున్న పడాల పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, దివ్య లిఖిత, హరిత హరీశ్, డిమోన్ పవన్ తదితరులు అప్పుడు ఎంత కష్టపడింది చూపించారు.

మరి బిగ్‌బాస్‌కు వెళ్లాలనుకునే సామాన్యులకు కొద్దిగంటలే సమయం ఉన్న నేపథ్యంలో త్వరపడాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి అగ్నిపరీక్ష సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎంతమంది సామాన్యులు ఈసారి కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టనున్నారు? తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X