Bigg Boss Telugu 10: సామాన్యులకు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష.. ఈసారి ఆ ముగ్గురిని మెప్పించాల్సిందే?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కింగ్ అక్కినేని నాగార్జున అధికారిక ప్రకటన చేశారు. అయితే గతేడాది కామన్‌మెన్ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సామాన్యుల్లో ఒకడు విజేతగా నిలిచాడు. దాంతో ఈసారి కూడా సామాన్యులకు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు నిర్వాకులు. దీనిలో భాగంగా బిగ్‌బాస్ తెలుగు 10 అగ్నిపరీక్ష సీజన్ 2 పేరుతో ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని భావిస్తున్నారట. అగ్నిపరీక్ష సీజన్ 2 దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, నిబంధనలకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
జూన్ 10 ఉదయం 10 గంటల నుంచి జూన్ 20 అర్ధరాత్రి వరకు అగ్నిపరీక్ష సీజన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 10 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు అగ్నిపరీక్షకు అర్హులు. అలాగే భారతీయ పౌరులు అయ్యుండాలి. గతేడాదితో పోలిస్తే కొత్త రూల్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లేదా ఏ ఇతర సోషల్ మీడియా లింక్ అయినా అప్లికేషన్‌లో ఇవ్వాల్సి రావొచ్చని అంటున్నారు. ప్రొఫైల్ వీడియో క్లారిటీగా ఉండాలని మొబైల్‌తో తీసినా ఆడియో, వీడియో క్లారిటీగా ఉంటే బెటర్ అని కొందరు సలహాలు ఇస్తున్నారు. మినిమమ్ 3 నిమిషాలు తగ్గకుండా వీడియోను అప్‌లోడ్ చేయాలని చెబుతున్నారు.

వీడియోలు, ప్రొఫైల్స్ వడపోత తర్వాత బిగ్‌బాస్ టీమ్ నుంచి అభ్యర్ధులకు రెండ్రోజుల్లోనే కాల్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ల హెడ్ మీతో మాట్లాడతారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి. సెలెక్ట్ అయిన 40 మందిని పర్సనల్ ఇంటర్వ్యూలకి పిలిచి మాట్లాడతారు. 5 లెవల్స్‌లో జరిగే వడపోత ప్రక్రియ ముగిసిన తర్వాత 10 రోజులు షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ ముగిసిన తర్వాత ఆగస్ట్ 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 నుంచి 22 ఎపిసోడ్స్ కింద అగ్నిపరీక్ష సీజన్ 2 టెలికాస్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.
గతేడాది అగ్నిపరీక్ష 7 మందిని కామెన్‌మెన్ కేటగిరిలో నుంచి తీసుకున్నారు. ఈసారి 10 మంది వరకు సామాన్యులు ఉండొచ్చని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతేడాది అగ్నిపరీక్షకు నవదీప్, బిందు మాధవి, అభిజిత్‌లు జడ్జిలుగా వ్యవహరించగా.. శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈసారి అగ్నిపరీక్ష సీజన్ 2కు కూడా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ న్యాయ నిర్ణేతలుగా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. హీరో శివాజీ, సింగర్ గీతా మాధురిలతో పాటు అభిజిత్ మరోసారి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు గతేడాది బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో పార్టిసిపేట్ చేసిన వారిలో కొందరు గెస్టులుగా వచ్చి టాస్క్‌లు ఇస్తారని అంటున్నారు.
గతేడాది ప్రయోగాత్మాకంగా చేపట్టిన అగ్నిపరీక్ష మంచి సక్సెస్ కాడంతో ఈసారి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లుగా తెలుస్తోంది. డిఫరెంట్ టాస్క్‌లు, అభ్యర్థుల శారీరక, మానసిక సామర్ధ్యం, ఓర్పు, మంచితనం ఇలా అన్నిరకాలుగా పరీక్షించి కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేస్తారని చెబుతున్నారు. అగ్నిపరీక్షకు వచ్చిన వారు ముగ్గురు జడ్జిలను మెప్పించి, పరీక్షల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. మరి ఇందులో ఎంతమంది విజయం సాధించి కంటెస్టెంట్స్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెడతారో చూడాలి. బిగ్‌బాస్ తెలుగు 10 అగ్నిపరీక్ష సీజన్ 2కి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, నిబంధనలతో కూడిన ప్రోమోను స్టార్ మా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications


