Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య?.. వారానికి ఎన్ని లక్షలు డిమాండ్ అంటే!

Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే రియాలిటీ షో బిగ్‌బాస్' (Bigg Boss Telugu). ఈ గేమ్ షో త్వరలోనే సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ఇప్పటివరకు సక్సెస్ పుల్ గా 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు గ్రాండ్‌గా 10వ సీజన్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు తగ్గట్టుగానే సీజన్‌ 10కు సంబంధించిన టీజర్, ప్రోమోలతో క్రేజ్ పెంచారు. గత సీజన్లకు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే అగ్ని పరీక్ష పేరుతో కామన్ మ్యాన్ కేటగిరిలో ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక సెలబ్రెటీ విభాగంలో షోలోకి ఎవరెవరూ వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ యంగ్ హీరో భార్య పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరు?

8వ సీజన్ వరకు బిగ్ బాస్ షోలో సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే వారు.. కానీ, గత సీజన్ నుండి ఫార్మట్ పూర్తిగా మారిపోయింది. సెలబ్రెటీలతో నిండిపోయే బిగ్‌బాస్ హౌస్‌లో సామాన్యులకు చోటు కల్పించారు. గత సీజన్‌లో కామన్‌మెన్ కేటగిరీ కింద అడుగుపెట్టిన కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల హౌస్‌లో తన సత్తా చాటడమే కాకుండా, టైటిల్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. అలాగే.. సెలబ్రెటీలు, కామనర్స్ షో కావడంతో షో రేటింగ్స్ కూడా అమాంతం పెరగడం, ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యారు. దీంతో 10వ సీజన్‌లో కూడా కామన్‌మెన్‌ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టార్ మా యాజమాన్యం.

Bigg Boss Telugu 10 Tejaswini Gowda Entry Buzz

ఇక దశావతరం కాన్సెప్ట్ తో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా సెప్టెంబర్ తొలి వారంలో షో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది పదో సీజన్ కావడంతో ఈసారి షో మేకర్స్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టెలివిజన్, సోషల్ మీడియా, యూట్యూబ్, సినిమా రంగాలకు చెందిన పాపులర్ సెలబ్రిటీలను హౌస్‌లోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. వారి వాళ్ల షో టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని, గేమ్ షో సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీల పేర్లు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ ఆర్టిస్టులు, టీవీ నటులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా యంగ్ హీరో బిగ్‌బాస్ తెలుగు మాజీ రన్నరప్ అమర్ దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ఎంట్రీ దాదాపు ఖాయమనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. తేజస్విని గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ మా 'కోయిలమ్మ' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అమాయకపు గ్రామీణ యువతిగా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత 'కేర్ ఆఫ్ అనసూయ'తో పాటు తమిళంలో పలు సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో బిజీబిజీగా మారింది.

ఇక తేజస్విని వ్యక్తిగత జీవితం కూడా ప్రేక్షకులకు తెలుసు. యంగ్ హీరో, బిగ్‌బాస్ తెలుగు మాజీ రన్నరప్ అమర్ దీప్ చౌదరిని ప్రేమించి 2022లో వివాహం చేసుకుంది. అమర్ దీప్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో తేజస్విని బయట నుంచి అతనికి మద్దతు ఇచ్చింది. దీంతో ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పటికీ వీరిద్దరూ కలిసి చేసే వీడియోలు, రీల్స్, యూట్యూబ్ వ్లాగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఇలాంటి క్రేజ్ కారణంగానే బిగ్‌బాస్ సీజన్ 10 కోసం తేజస్విని పేరు గట్టిగానే వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్న తేజస్విని, ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టి బిగ్‌బాస్ హౌస్‌లోకి రావాలంటే భారీ పారితోషికం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వారానికి సుమారు రూ.6 లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. తేజస్విని నిజంగానే కంటెస్టెంట్‌గా కనిపిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే నిర్వాహకుల అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇక కంటెస్టెంట్ల జాబితాలో సినిమా ఇండస్ట్రీ నుంచి హీరో చంద్రహాస్, హీరోయిన్లు సుప్రీత, కావ్య , నటుడు అభినవ్ గోమటం, యాంకర్ శ్యామల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే రాకింగ్ రాకేష్ , మహేష్ ఆచంట కూడా ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. టెలివిజన్ రంగం నుంచి శివకుమార్, నిరుపమ్ పరిటాల, ప్రేమీ విశ్వనాథ్, రక్ష గౌడ పేర్లు కంటెస్టెంట్ల రేసులో ఉన్నట్లు టాక్. జబర్దస్త్ టీమ్ నుంచి వర్ష , హరిత, ఎక్స్‌ప్రెస్ హరి పేర్లు వినిపిస్తుండగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో దీపిక పిళ్లి , మై విలేజ్ షో అనిల్ గీలా పేర్లు కూడా బిగ్‌బాస్ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X