Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు 10కి కౌంట్‌డౌన్ స్టార్ట్... గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే?

భారత్‌లో మెగా రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. అనంతరం భారత్‌లోని ప్రాంతీయ భాషల్లోకి అడుగుపెట్టి అక్కడా జయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా తెలుగులో అదిరిపోయే టీఆర్పీలు సొంతం చేసుకుంది బిగ్‌బాస్. ఇప్పటి వరకు 9 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు.. త్వరలో 10 సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షో కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు హిస్టరీకి వెళితే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 16 జూలై 2017న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 ప్రారంభమైంది. ఆ తర్వాత సీజన్‌ 2కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించగా.. బిగ్‌బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకు కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన ఛరిష్మా.. క్రేజ్, షోను నడిపించే తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బిగ్‌బాస్ అంటే నాగార్జున.. నాగార్జున అంటే బిగ్‌బాస్ అన్నంతగా ఆయన తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్రవేశారు.

Bigg Boss Telugu 10 Announced Akkineni Nagarjuna Returns as Host New Season Promises More Excitement

ఇప్పటి వరకు బిగ్‌బాస్ తెలుగులో శివ బాలాజీ, కౌశల్ మందా, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, విజే సన్నీ, రేవంత్, పల్లవి ప్రశాంత్, నిఖిల్ మలియాక్కల్, కళ్యాణ్ పడాల తదితరులు విజేతలుగా నిలిచారు. దాంతో 10వ సీజన్‌లో ఎవరు విజేతలుగా నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభం కానుంది? కంటెస్టెంట్స్ ఎవరు? కొత్తగా రూల్స్ ఏమైనా మారాయా? అంటూ ప్రేక్షకులు ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ సస్పెన్స్‌కు చెక్ పెడుతూ... బిగ్‌బాస్ తెలుగు 10 అనౌన్స్‌మెంట్ విడియోను స్టార్ మా విడుదల చేసింది. ఈ మేరకు హోస్ట్ అక్కినేని నాగార్జున గుడ్‌న్యూస్ చెప్పారు.

బిగ్‌బాస్.. ఎన్నో యుద్దాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం అంటూ నాగార్జున ఓ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు. ఆ మహా సామ్రాజ్యం గురించి రూల్ చేసే నేను కాదు.. లవ్ చేసే ఫ్యాన్స్ చెబుతారు ప్రేక్షకుల ఆటాపాటాను, వారు ఎంజాయ్ చేసే విధానాన్ని చూపించారు. చెదరని ప్రస్థానం తరగని అభిమానం బిగ్‌బాస్ సొంతం. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతోంది. ఈసారి మీరు చూడబోయేది బిగ్‌బాస్ దశావతారం.. ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్ అనే క్యాప్షన్‌ను పెట్టారు. దీనిని బట్టి ఈ కొత్త సీజన్ ఎంత రసవత్తరంగా ఉండబోతోందో నాగార్జున సంకేతాలు పంపారు. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌పై అధికారిక ప్రకటన విడుదల కానుంది.

గత సీజన్‌లో ఆరుగురు సామాన్యులకు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టే అవకాశం కల్పించారు. వారిలో ఒకరు విజేతగా నిలిచి సత్తా చాటారు. మరి ఈసారి కూడా సామాన్యులకు బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఉంటుందా? లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈసారి కూడా కామెన్‌మెన్లు.. బిగ్‌బాస్‌లో అడుగుపెడతారని, మరోసారి అగ్నిపరీక్ష జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? ఈసారి కూడా సామాన్యులు వస్తారా? కేవలం సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు మాత్రమే బిగ్‌బాస్‌లో అడుగుపెడతారా అన్నది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X