Bigg Boss Telugu 10: కామన్‌మెన్‌కి మరో గోల్డెన్ ఛాన్స్.. అందులో గెలిస్తే డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌లోకి!

బిగ్‌బాస్ తెలుగు 10 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ మెగా షో త్వరలో 10వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. మైల్ స్టోన్ లాంటి ఈ సీజన్ కోసం నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా ఎవరు రాబోతున్నారు? ఎలాంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి? అనే దానిపై ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్ కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా తుది దశకు చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Also Read
Peddi OTT Release: పెద్ది ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? రాంచరణ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Peddi OTT Release: పెద్ది ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? రాంచరణ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు సామాన్యులకు కూడా నిర్వాహకులు అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో సామాన్యుల ఎంట్రీతో షో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. అలాగే సామాన్యుడే చివరికి విజేతగా నిలవడం ఆసక్తిగా మారింది. దాంతో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాలనే చాలామందిలో కొత్త ఆశలు రేగాయి. గత సీజన్‌లో సామాన్యుడు సత్తా చాటడటం, ఆ సీజన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడటంతో ఈసారి కూడా కామన్‌మెన్‌కు పెద్ద పీట వేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

Bigg Boss Telugu 10 Another Golden Chance for Commoners to Enter the House

గత సీజన్‌లో అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులను కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేసే ప్రక్రియ కూడా చాలా కొత్తగా ఉంది. బుల్లితెరపై ప్రసారమైన ఈ ఎపిసోడ్స్ కూడా మంచి ఆదరణను దక్కించుకున్నాయి. దాంతో ఈసారి కూడా బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సామాన్యులు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 12 నుంచి జూన్ 20 వరకు అవకాశం కల్పించారు. బిగ్‌బాస్‌లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆడిషన్స్ క్లిప్స్ పంపించాలని ఓ ప్రోమో ద్వారా తెలియజేశారు.

Recommended For You
MIB Day 5 Collections: మా ఇంటి బంగారంకు డీసెంట్ కలెక్షన్స్... సమంత మూవీకి ఐదో రోజు ఎంతంటే?
MIB Day 5 Collections: మా ఇంటి బంగారంకు డీసెంట్ కలెక్షన్స్... సమంత మూవీకి ఐదో రోజు ఎంతంటే?

బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఉత్సాహం చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, విద్యార్ధులు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఇలా పలు కేటగిరీలలో ఉన్నారు. వీరిందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఫైనల్‌గా అగ్నిపరీక్ష సీజన్ 2 కోసం 40 నుంచి 50 మందిని సెలెక్ట్ చేసి అనేక పరీక్షలు, వడపోతలు అనంతరం వీరిలో 5 నుంచి 7 మంది వరకు బిగ్‌బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్స్‌గా పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నారు.

You May Also Like
సమంత ప్రెగ్నెన్సీ .. సంచలన నిర్ణయం తీసుకొన్న ఫ్యామిలీ, టీమ్ మెంబర్స్
సమంత ప్రెగ్నెన్సీ .. సంచలన నిర్ణయం తీసుకొన్న ఫ్యామిలీ, టీమ్ మెంబర్స్

తాజాగా బిగ్‌బాస్ లవర్స్ కోసం నిర్వాహకులు మరో గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా కాకుండా ఓ కొత్త పద్ధతిలో సామాన్యుడికి అవకాశం కల్పించనున్నారని టాక్. ఈసారి బిగ్‌బాస్‌ తెలుగు 10కి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వైట్‌గోల్డ్ సంస్థ ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు శ్రీముఖితో ఓ ప్రోమోను వదిలారు. బిగ్‌బాస్ 10 అగ్నిపరీక్ష ఆడిషన్ వీడియో సబ్మిట్ చేయడం మిస్ అయ్యారా? మీ కోసం మరో గోల్డెన్ ఛాన్స్. ఇందుకోసం http://whitegold.money/aptelugu అనే సైట్‌లోకి వెళ్లి ఓ ఆడిషన్ వీడియోను ఇందులో సబ్మిట్ చేయాలని శ్రీముఖి తెలిపారు.

Samantha Pregnancy : సమంత ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ... ఆ ఒక్క మాటతో చిరంజీవి లీక్
Samantha Pregnancy : సమంత ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ... ఆ ఒక్క మాటతో చిరంజీవి లీక్

అయితే ఇది బిగ్‌బాస్ అగ్నిపరీక్షలోకి పంపడానికి ఉద్దేశించినదా? లేక నేరుగా ఒక కాంటెస్ట్ ద్వారా సామాన్యుడిని ఎంపిక చేసి కంటెస్టెంట్‌గా అవకాశం ఇవ్వనున్నారా అనేది తెలియాల్సి ఉంది. కొందరు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2కి ఆడిషన్ వీడియో పంపడం మిస్ అయినవారు... బిగ్‌బాస్ టీం ఇచ్చిన సెకండ్ ఆప్షన్‌తో బిగ్‌బాస్‌లోకి వెళ్లాలనే కలను నెరవేర్చుకోవచ్చని చెబుతున్నారు. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 లాంచ్ అయితేనే కానీ ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X