Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా ఛాన్స్ ఇవ్వండి... నాగార్జున టీమ్‌కి ఎస్ఐ రిక్వెస్ట్

బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలుత హిందీలో అడుగుపెట్టిన ఈ టాప్ షో ఆ తర్వాత భారతీయ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తోంది. నగరాలు, పట్టణాలు దాటి మారుమూల పల్లెల్లోనూ బిగ్‌బాస్‌కు అభిమానులు ఉన్నారంటే ప్రజల్లో ఈ షో పట్ల ఉన్న ఆసక్తిని అర్ధం చేసుకోవచ్చు. బిగ్‌బాస్ తెలుగు విషయానికి వస్తే ఇప్పటి వరకు 9 సీజన్లు పూర్తి చేసుకుని, త్వరలో 10వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. ఇటీవలే కింగ్ అక్కినేని నాగార్జున తాజా సీజన్‌ ప్రారంభానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చారు. దాంతో తాజా సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా ఎవరు రానున్నారు? తదితర విశేషాలపై ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Also Read
Peddi Day 22 Collections: భారీగా పడిపోయిన పెద్ది కలెక్షన్స్.. రామ్ చరణ్ మూవీకి వసూళ్లు ఎంతంటే?
Peddi Day 22 Collections: భారీగా పడిపోయిన పెద్ది కలెక్షన్స్.. రామ్ చరణ్ మూవీకి వసూళ్లు ఎంతంటే?

బిగ్‌బాస్ షోలో పాల్గొనాలని, తాము కూడా సెలబ్రిటీలు కావాలని చాలామందికి ఉంటుంది. ప్రతి యేటా సీజన్ ప్రారంభానికి ముందు తమకు హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించాలంటూ ప్రేక్షకులు రకరకాల మార్గాల్లో బిగ్‌బాస్ టీమ్‌కి విజ్ఞప్తి చేస్తుంటారు. సోషల్ మీడియా రాకతో చాలామంది వీడియోలు, రీల్స్ చేసి వాటిని పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని సామాన్యులకు కూడా అవకాశం కల్పించాలని బిగ్‌బాస్ టీమ్ గత కొన్ని సీజన్ల నుంచి కామన్‌మెన్ కేటగిరీని ప్రవేశపెట్టింది.

Bigg Boss Telugu 10 AP SI Nagarjuna Reddy Seeks Entry into Akkineni Nagarjuna Show

గతేడాది కామన్‌మెన్‌లుగా చాలామందికి అవకాశం కల్పించి.. వీరిలో నుంచి పడాల పవన్ కళ్యాణ్ విన్నర్‌గా నిలిచి సామాన్యుడి సత్తాను నిరూపించారు. సెలబ్రిటీల నుంచి టఫ్ ఫైట్ ఎదురవుతున్నప్పటికీ ధైర్యం నిలవడి బిగ్‌బాస్ టైటిల్ అందుకున్నారు. దాంతో ఈసారి కూడా కామన్‌మెన్‌కు అవకాశం కల్పించేందుకు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2కి శ్రీకారం చుట్టింది స్టార్ మా. దీనికి తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఎస్ఐగా పనిచేస్తున్న వ్యక్తి.. తనకు బిగ్‌బాస్‌లో అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Recommended For You
హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తే అలాంటి కండీషన్లు... తెలుగు నటిపై బన్నీ వాసు కామెంట్స్
హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తే అలాంటి కండీషన్లు... తెలుగు నటిపై బన్నీ వాసు కామెంట్స్

నా పేరు నాగార్జున రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన వ్యక్తిని. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాను. ముందుగా ఒక విషయం ప్రేక్షకులకు తెలియజేయాలని అనుకుంటున్నా. సెలబ్రిటీలకే కాకుండా మారుమూల గ్రామాలలో దాగివున్న ప్రతిభను వెలికితీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని మంచి ప్లాట్‌ఫాంను తయారు చేసి ప్రజల ముందు ఉంచిన బిగ్‌బాస్ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారం. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిని, నేను నా నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాకు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా ధైర్యాన్ని, ఓర్పుని, నాలో ఉన్న ప్రతిభని ప్రేక్షకులందరికీ చూపించి వారి హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.

You May Also Like
రిలేషన్‌‌షిప్‌పై సమంత వ్యాఖ్యలు... శోభిత ధూళిపాళ కౌంటర్‌!
రిలేషన్‌‌షిప్‌పై సమంత వ్యాఖ్యలు... శోభిత ధూళిపాళ కౌంటర్‌!

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం, బిగ్‌బాస్ హౌస్‌లో నడుచుకోవడం కూడా చాలా కష్టం. బిగ్‌బాస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించా. అక్కడ ఎన్నో సవాళ్లు, ఎన్నో కష్టతరమైన పరిస్ధితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ ఎంతో ధైర్యంతో, ఓర్పుతో, తెలివితో అధిగమించి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలచుకుని, అలాగే స్టార్ మా, బిగ్‌బాస్ వారి మన్ననలను పొంది, నా టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్యూ బిగ్‌బాస్ త్వరలో మీ హౌస్‌లో కలుద్దామని నాగార్జున రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఎస్ఐ విజ్ఞప్తిని మన్నించి ఆయనకి అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X