Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోనూ కామన్‌మెన్‌కి ఛాన్స్? అగ్నిపరీక్ష సీజన్ 2 ఎప్పుడంటే?

ఇండియాలో టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్‌బాస్.. ప్రాంతీయ భాషల్లోనూ అదే స్థాయిలో హవా సాగిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ మెగా షో.. ఈ ఏడాది 10వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. మరికొద్దినెలల్లో బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసారి కంటెస్టెంట్ ఎవరు? ఎలాంటి కండీషన్స్ ఉన్నాయి? సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారే అవకాశం కల్పించింది బిగ్‌బాస్. బిగ్‌బాస్ తెలుగు 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్... ఇటీవల ముగిసిన సీజన్‌ 9లో సోల్జర్ కళ్యాణ్‌ బిగ్‌బాస్ విజేతలుగా నిలిచారు. వీరంతా సామాన్యులుగా అడుగుపెట్టి.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చి విన్నర్‌లుగా నిలిచారు. తెలివి, కష్టం, ఓర్పు, పరిస్ధితులకు ఎదురీదే సామర్ధ్యం ఉంటే బిగ్‌బాస్‌లో నెగ్గుకురావడం పెద్ద కష్టం కాదని వీరంతా ప్రూవ్ చేశారు. దాంతో మరికొందరు సామాన్యులు కూడా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాలని కలలు కంటున్నారు

Bigg Boss Telugu 10 Commoners Entry Agni Pariksha Season 2 and Contestant Buzz Goes Viral

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని బట్టి ఈసారి కూడా బిగ్‌బాస్ 10లో సామాన్యులకు అవకాశం ఇచ్చే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గత సీజన్‌లో సామాన్యులకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులు.. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానించి వారికి అగ్నిపరీక్ష పేరిట కఠినమైన ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బిగ్‌బాస్‌కు ముందు మంచి వినోదాన్ని అందించింది. అగ్నిపరీక్షలు సత్తా చాటిన వారిలో ఆరుగురు సామాన్యులకు కామెన్‌మెన్ కోటాలో కంటెస్టెంట్స్‌గా అవకాశం కల్పించారు బిగ్‌బాస్. వారే కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, దమ్ము శ్రీజ, హరిత హరీశ్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్.. వీరంతా సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు టాప్ 5లో ఇద్దరు స్థానం సంపాదించుకుని, చివరికి విజేతగానూ నిలిచారు.

కామన్‌మెన్ల ఆటతీరుపై తొలుత విమర్శలు వచ్చినప్పటికీ తర్వాత వీరంతా టాస్క్‌లు, గేమ్స్, వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా సామాన్యులకు ఎంట్రీ ఇవ్వాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని బట్టి.. ఈసారి బిగ్‌బాస్‌లో సామాన్యులు మూడు దారుల ద్వారా అడుగుపెట్టొచ్చట. మీరు సెలబ్రిటీ కావడం ఒకటైతే... అగ్నిపరీక్ష ద్వారా మరో దారి.. ఇక మూడో మార్గం విషయానికి వస్తే.. బిగ్‌బాస్‌కు స్పాన్సర్‌గా ఉన్న వారు పెట్టే మెగా కాంటెస్టెంట్‌లో గెలుపొందిన వారికి కంటెస్టెంట్‌గా అవకాశం కల్పిస్తారట.

ఇకపోతే.. ఈసారి కూడా అగ్నిపరీక్షకు స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. జడ్జీలుగా శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ ఉండే అవకాశం ఉందట. జూన్ ఫస్ట్ వీక్‌లో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉందట. ఈసారి అగ్నిపరీక్షకు వెళ్లడానికి కొన్ని కొత్త రూల్స్ ఉంటాయట. బిగ్‌బాస్ తెలుగు 10 ఈ ఏడాది సెప్టెంబర్ 6న లాంచ్ కాబోతోందట. అలాగే అగ్నిపరీక్ష సీజన్ 2 ఈసారి 22 ఎపిసోడ్‌లు ప్రసారమవుతాయని.. ఆగస్ట్ రెండో వారంలో అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈసారి 10 మంది సెలబ్రిటీలు.. 10 మంది సామాన్యులు కంటెస్టెంట్స్‌గా లోపలికి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అగ్నిపరీక్ష సీజన్ 2కి సంబంధించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X