బిగ్‌బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్‌గా ఆ యాంకర్? లీక్ చేసిన జబర్దస్త్ నటుడు!

భారతీయ బుల్లితెరపై సంచలనం బిగ్‌బాస్ షో. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ మెగా షో ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి సైతం అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. తెలుగులోనూ 9 సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది బిగ్‌బాస్. చూస్తుండగానే బిగ్‌బాస్ సీజన్ ముగిసి 5 నెలలు ముగిసిపోయింది. దీంతో బిగ్‌బాస్ తెలుగు 10 ఎప్పుడు? ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు? అనే చర్చ మొదలైపోయింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్ గురించి ఓ జబర్దస్త్ నటుడు లీక్ చేశాడు. ఈ వివరాల్లోకి వెళితే..

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. స్టార్ యాంకర్ శ్రీముఖి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతివారం బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు ఆ షోలో సందడి చేస్తున్నారు. వారానికొక కొత్త థీమ్‌తో శ్రీముఖి వారితో ఆడిస్తూ, పాడిస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. తాజాగా ఈ వీక్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి సంబంధించి మరో ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.

Bigg Boss Telugu 10 Contestant Leak Jabardasth Comedian Gives Hint About Express Hari

ఈ వారం బ్యాచిలర్ పార్టీ అనే థీమ్‌తో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో వినోదాన్ని పంచనుంది. తాజా ప్రోమోలో మనందరి జాతకాలు చెప్పడానికి వచ్చేస్తున్నారు మా నూకరాజు అంటూ శ్రీముఖి చెబుతుంది. భుజానికి సంచి తగిలించుకుని వేదిక మీదకు వస్తాడు నూకరాజు. రావడం రావడంతోనే ఏం అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోరా అని అడగ్గా... మీలాంటి మొగుడు వస్తాడేమోనని అంటూ దీపిక రంగరాజు పంచ్ పేల్చడంతో అంతా నవ్వేస్తారు. మీరు కూడా చేసుకోవచ్చు కదా అని శ్రీముఖి ప్రశ్నించగా.. నేను ఆల్రెడీ చేసుకుని లోపలికి వెళ్లి తిట్లు తిని బయటికొచ్చానని నవ్విస్తాడు నూకరాజు.

నేను జరిగేది చెబుతా.. జరగబోయేది చెబుతా అని నూకరాజు అంటాడు. అయితే జరిగేది చెప్పు అంటూ ఎక్స్‌ప్రెస్ హరి అడుగుతాడు. నువ్వు బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్‌గా వెళ్లబోతున్నావని నూకరాజు చెప్పడంతో అంతా అరుస్తూ గోల గోల చేస్తారు. అయితే జరగబోయేది ఏంటో చెప్పానా? వెళ్లిన ఫస్ట్ వారంలోనే అంటూ చెప్పబోతుండగా దానికంటే వెళ్లకుండా ఉండటమే బెటరంటూ నూకరాజుకు అడ్డుపడతాడు హరి. తర్వాత సెలబ్రిటీలతో ఒక్కో చిటీని తీయించి వారి జాతకాలు చెబుతాడు నూకరాజు.

ముందుగా గుండెనిండా గుడిగంటలు బాలు వచ్చి చీటి తీయగా.. బాలుగారు మీ పెళ్లి ఎక్కడ జరుగుతుందంటే? నిజామాబాద్‌లో అనడంతో శ్రీముఖి సిగ్గుతో మెలికలు తిరుగుతుంది. మీ పెళ్లయిన తర్వాత ఎలా ఉంటుందని అనుకుంటున్నావని నూకరాజు అడగ్గా.. నేను చెబుతానంటూ మధ్యలోకి వస్తాడు అవినాష్. అనంతరం బిగ్‌బాస్ 8 విన్నర్ నిఖిల్‌ చీటి తీయగా.. నిఖిల్ గారి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతుంది శ్రీముఖి. ఒక ఏడు, ఎనిమిది బ్రేకప్‌ల తర్వాత జరుగుతుందని చెబుతాడు నూకరాజు. సార్‌కి ఆల్రెడీ 17, 18 బ్రేకప్‌లు అయ్యాయని హరి సెటైర్లు వేస్తాడు.

తర్వాత బిగ్‌బాస్ బ్యూటీ దివిని పిలిచి చీటి తీయగా.. మీ పెళ్లి నడిరోడ్డు మీద జరగబోతోందని అంటాడు నూకరాజు. నాకు కూడా జ్యోతిష్యుడు నడిరోడ్డు మీదే జరుగుతుందని చెప్పాడని హరి చెబుతాడు. నడిరోడ్డు మీద అడుక్కుంటావని నూకరాజు పంచ్ పేల్చడంతో అంతా నవ్వేస్తారు. అనంతరం ఢీ పండు వచ్చి చీటి తీయగా.. నీ పెళ్లి చూడటానికి ఊరు ఊరంతా వస్తారని అంటాడు. మరి చెట్టుకు కట్టేసి కొడితే రారా ఏంటీ అని హరి సెటైర్ వేస్తాడు. చివరిలో అవినాష్ వచ్చి గురువుగారు అప్పటి నుంచి మీరు అందరినీ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. మీ కోసం నేనొక చిన్న సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నా ఒకసారి మీరు నా కోసం నోరు తెరవమని అవినాష్ చూపించగా అతని నోట్లో బబుల్స్ వేస్తుంది శ్రీముఖి. దాంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరి నిజంగానే ఎక్స్‌ప్రెస్ హరి బిగ్‌బాస్ 10లో కంటెస్టెంట్‌గా వెళ్లనున్నాడా? స్టార్ మా వాళ్లు నూకరాజు ద్వారా హింట్ ఇచ్చారా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X