Bigg Boss 10లో మొదట అడుగుపెట్టేది ఆమెనే? ఫస్ట్ కంటెస్టెంట్ పేరు బయటపెట్టిన వర్ష!

Bigg Boss 10 Telugu: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. తాజా ప్రోమోలో 'దశావతారం' అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ, ఈసారి ఆట మరింత కఠినంగా, ఉత్కంఠభరితంగా ఉండబోతోందని తెలిపారు. 'ఆటలో సవాల్ కాదు... ఈసారి ఆటే సవాల్'అనే ట్యాగ్‌లైన్‌తో షోపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో యాంకర్ వర్ష చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. బిగ్ బాస్ 10లో పాల్గొనబోయే తొలి కంటెస్టెంట్‌గా ఓ ప్రముఖ సీరియల్ నటి పేరు ఆమె వెల్లడించడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆ నటి రియాక్షన్ ఎంటీ?

యాంకర్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో చేసిన లవ్-ట్రాక్ కామెడీ స్కిట్స్ ఆమెకు మరింత పాపులారిటీ తీసుకొచ్చాయి. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇదే సమయంలో 'కిసిక్ టాక్స్'అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ సెలబ్రిటీలతో సరదా సంభాషణలు కొనసాగిస్తోంది. తాజాగా ఈ షోకు ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక నల్కారి అతిథిగా హాజరైంది.

Bigg Boss Telugu 10 Did Varsha Reveal Priyanka Nalkari as the First Contestant

ఈ సందర్భంగా యాంకర వర్ష బిగ్ బాస్ గురించి ప్రశ్నించగా ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "గతంలో తమిళ్ బిగ్ బాస్ నుంచి అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేదు. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ నుంచి కూడా సంప్రదించారు. అప్పుడూ నేను అంగీకరించలేదు. అయితే ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుంచి కాల్ వస్తే మాత్రం ఖచ్చితంగా హౌస్‌లోకి వెళ్తాను" అని స్పష్టం చేసింది. ప్రియాంక వ్యాఖ్యలు విన్న వెంటనే యాంకర్ వర్ష సరదాగా స్పందిస్తూ, "అయితే బిగ్ బాస్ 10 ఫస్ట్ కంటెస్టెంట్ దొరికేసినట్టే. ప్రియాంక నల్కారి ఈ సీజన్‌లో అడుగుపెట్టబోతున్న తొలి కంటెస్టెంట్" అంటూ ప్రకటించింది. దీంతో ప్రియాంక కూడా ఈ సీజన్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రకటించింది .

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక నల్కరి పేరు కొత్తది కాదు. కెరీర్ ప్రారంభంలోనే పలు తెలుగు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, 'ఆహ్వానం', 'మేఘమాల', 'మంగమ్మ గారి మనవరాలు','శ్రావణ సమీరాలు' వంటి ధారావాహికల్లో నటించి మంచి పేరు సంపాదించింది. అయితే ఆమె ప్రతిభకు తగ్గ స్థాయిలో స్టార్‌డమ్ మాత్రం తెలుగులో దక్కలేదు. సీరియల్స్‌తో పాటు యాంకర్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రియాంక, గెటప్ శ్రీనుతో కలిసి 'సినిమా చూపిస్తా మావా' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ షో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఆమె కెరీర్‌కు పెద్దగా మైలేజ్ తీసుకురాలేకపోయింది.

ఇదే సమయంలో వెండితెరపై కూడా అవకాశాలు అందిపుచ్చుకుంది. 'అందరి బంధువయ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, 'శివ మనసులో శృతి (SMS)'లో హీరో సుధీర్ బాబు చెల్లెలి పాత్రలో కనిపించింది. అనంతరం కిక్ 2, హైపర్, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలలో నటించింది. అలాగే రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన 3లో కూడా కీలక పాత్ర పోషించి తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రియాంక తమిళ బుల్లితెర వైపు అడుగులు వేసింది. అక్కడ ఆమె జీవితాన్నే మార్చేసిన సీరియల్ 'రోజా'. ఈ సీరియల్ లో రోజా పాత్రలో నటించి తమిళ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తమిళ బుల్లితెరలో స్టార్ హీరోయిన్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.

అయితే వర్ష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజంగానే ప్రియాంక నల్కారి బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొంటుందా? లేక ఇది కేవలం సరదా కామెంటేనా? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. అధికారిక కంటెస్టెంట్ల జాబితా ఇంకా బయటకు రాకపోయినా, ప్రియాంక చేసిన వ్యాఖ్యలతో ఆమె పేరు మాత్రం బిగ్ బాస్ 10 రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X