Bigg Boss 10 Contestants: బిగ్‌బాస్ తెలుగు 10 కంటెస్టెంట్స్ ఎవరంటే? వైరల్ అవుతోన్న లిస్ట్‌ ఇదే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 10కి ముహూర్తం ఖరారైంది. తాజా సీజన్‌కు సంబంధించి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కింగ్ అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ కానుంది. ఆటోలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అన్న క్యాప్షన్‌తో కొత్త సీజన్ ఆసక్తికరంగా ఉంటుందని నాగ్ హింట్ ఇచ్చారు. దాంతో ఈసారి బిగ్‌బాస్ తెలుగు 10 ఎలా ఉండబోతోంది? కంటెస్టెంట్స్ ఎవరు? ఈసారి సామాన్యులకు కూడా చోటు ఉంటుందా? కేవలం సెలబ్రిటీలకు మాత్రమే అవకాశం కల్పిస్తారా? ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
మహేష్ బాబుతో సినిమాపై బుచ్చిబాబు క్లారిటీ.. ఈసారి ఏం కట్ చేస్తారంటూ..
మహేష్ బాబుతో సినిమాపై బుచ్చిబాబు క్లారిటీ.. ఈసారి ఏం కట్ చేస్తారంటూ..

9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో.. ఈ ఏడాదితో 10వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. దాంతో అందరి చూపు ఈ సీజన్ మీదే ఉంది. ఐపీఎల్ సీజన్ ముగియడంతో మంచి కంటెంట్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దాంతో ఈసారి కాస్త ముందుగానే బిగ్‌బాస్ తెలుగు 10 ప్రారంభమవుతుందని పలువురు భావిస్తున్నారు. దానికి తోడు పదేళ్లు పూర్తి చేసుకోవడంతో ఈసారి సీజన్‌లో ఏదో ఒక స్పెషాలిటీతో ప్రత్యేకంగా రూపొందించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే ఈసారి సెలబ్రిటీలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Bigg Boss Telugu 10 Expected Contestants List Popular TV Stars and Influencers Reportedly in Talks

గత సీజన్‌లో డబుల్ హౌస్ పేరుతో సామాన్యులు, సెలబ్రెటీలకు వేరు వేరు ఇళ్లను కేటాయించారు బిగ్‌బాస్. సామాన్యులను ఓనర్స్‌గా, సెలబ్రెటీలను టెనెంట్స్‌గా విభజించి.. ఓనర్స్‌గా మారాలంటే సరికొత్త టాస్క్‌లు పెట్టి ఫన్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలు, వివాదాలు కాకరేపాయి. ఈసారి కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా సామాన్యులకు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా కామెన్‌మెన్లను ఎంపిక చేసి వారిని హౌస్‌కి పంపిస్తారని వార్తలు వస్తున్నాయి.

Recommended For You
రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్? విజయ్ పార్టీలో చేరికపై ముహూర్తం ఖరారు?
రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్? విజయ్ పార్టీలో చేరికపై ముహూర్తం ఖరారు?

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2కి జడ్జిలుగా శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ లేదా అభిజిత్ ఉండే అవకాశం ఉందట. ఐదుమంది సామాన్యులను అగ్నిపరీక్షలో ఎంపిక చేసి కంటెస్టెంట్స్‌గా పాల్గొనే అవకాశం కల్పించనున్నారట. అలాగే మరో కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కి అఫీషియల్ స్పాన్సర్‌గా ఉండే ఒక సంస్థ ద్వారా కంటెస్టెంట్ నిర్వహించి ఒకరికి కంటెస్టెంట్‌గా ఛాన్స్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో పాల్గొనడం ఎలా? రూల్స్ ఏంటీ? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వంటి వివరాలను త్వరలోనే నిర్వాహకులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

You May Also Like
Peddi Day 4 Box Office Collections: 300 కోట్లకు చేరువగా పెద్ది.. మాస్ బ్యాటింగ్‌తో రాంచరణ్ ట్రిపుల్ సెంచరీ
Peddi Day 4 Box Office Collections: 300 కోట్లకు చేరువగా పెద్ది.. మాస్ బ్యాటింగ్‌తో రాంచరణ్ ట్రిపుల్ సెంచరీ

ఇకపోతే.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్ తెలుగు 10 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది కామన్‌మెన్ ఉండే అవకాశం ఉండటంతో జనానికి బాగా పరిచయం ఉన్న సెలబ్రిటీలు, వివాదాస్పద వ్యక్తులను కంటెస్టెంట్స్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఈ లిస్ట్‌లో వినిపిస్తున్న వారి పేర్లు చూస్తే బుల్లితెర నటి పల్లవి గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, పండు మాస్టర్, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, రైటర్ కడలి సత్యనారాయణ, ఈటీవీ ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు హీరో చంద్రహాస్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X