Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లోకి కామన్‌మెన్.. ఈసారి ఎంతమందికి ఛాన్స్ అంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈ మెగా షో లాంచింగ్‌కు సంబంధించి స్టార్ మా వరుస ప్రోమోలతో హైప్ పెంచుతోంది. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే మైల్ స్టోన్ అనదగ్గ సీజన్‌గా చెబుతోన్న బిగ్‌బాస్ తెలుగు 10 కోసం ఈసారి ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సీజన్‌కు కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దాంతో ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రానున్నారు? ఎంతమంది రానున్నారు? అంటూ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టేవారు వీరేనంటూ సోషల్ మీడియాలో రకరకాల పేర్లు తెరమీదకి వస్తున్నాయి. అలాగే ఈసారి కూడా సామాన్యులకు ఎంట్రీ ఉంటుందని స్టార్ మా ఇప్పటికే ప్రకటించింది. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా కామన్‌మెన్‌లను ఎంపిక చేస్తామని, ఆసక్తి ఉన్న దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. దీనికి సామాన్యుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు బిగ్‌బాస్‌లో అడుగుపెడతామంటూ ఆడిషన్ క్లిప్స్ పంపిస్తున్నారు.

Bigg Boss Telugu 10 How many Commoners Likely to Enter Akkineni Nagarjuna show

కొందరు పోలీస్ అధికారులు సైతం బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాలని ఆసక్తి చూపిస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాంతో మరికొందరు సామాన్యులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి ఎంతమంది సామాన్యులు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు? అనేది సస్పెన్స్‌గా మారింది. దీనిపై విశ్లేషకులు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే..

బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు సామాన్యులకు రెండో అవకాశం కూడా కల్పించారు. బిగ్‌బాస్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న వైట్‌గోల్డ్ ఒక కాంటెస్ట్ పెడుతోంది. ఇందులో గెలిచిన ఒకరికి బిగ్‌బాస్ 10 అగ్నిపరీక్ష సీజన్ 2లోకి పంపే అవకాశం కల్పించనున్నారు. గత సీజన్‌లో ఏడుగురు సామాన్యులను హౌస్‌లోకి పంపిస్తే కామన్‌మెనే విజేతగా నిలిచాడు. ఈ వ్యూహం ఫలించి భారీ టీఆర్పీని సాధించింది బిగ్‌బాస్ తెలుగు 9. దాంతో ఈసారి కామన్‌మెన్లు ఎక్కువమందికి అవకాశం కల్పించే ప్లాన్‌లో బిగ్‌బాస్ టీమ్ ఉంది. ఒకటికి, రెండు ఛాన్స్‌లు ఇవ్వడం వెనుక ఉద్దేశం అదేనని అంటున్నారు విశ్లేషకులు.

ఈసారి షోను సక్సెస్ చేయాలని బిగ్‌బాస్ టీం.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కోసం చాలా గట్టిగా ఎఫర్ట్స్ పెడుతోందట. కామనర్స్‌కి పదే పదే అవకాశాలు ఇవ్వడం .. వైట్ గోల్డ్ కాంటెస్ట్‌ దానిలో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరిసారి ముగ్గురు సామాన్యులకు అవకాశం కల్పిస్తామని 7గురిని హౌస్‌లోకి పంపారు. ఈసారి ఐదుగురిని పంపిస్తామని వాళ్లే ప్రకటించారు అంటే ఖచ్చితంగా 7 నుంచి 10 మంది సామాన్యులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దానికి తోడు ఈసారి అగ్నిపరీక్ష సీజన్ 2 షో 22 ఎపిసోడ్స్ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ పడాల లాంటి ఎలాంటి నేపథ్యం లేని స్ట్రాంగ్ కామనర్స్ నలుగురు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి బిగ్‌బాస్ తెలుగు 10 అనేది కామనర్స్‌కి గోల్డెన్ ఛాన్స్ అని మాజీ కంటెస్టెంట్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కఠిన పరీక్షలు, వడపోతలు తట్టుకుని ఎంతమంది కామనర్స్‌.. కంటెస్టెంట్స్‌గా అవకాశం దక్కించుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X